Sunday, January 19, 2020

ABN Andhrajyothy | YS Jagan Gave Shock To Congress Leader | Weekend Comment By RK | ఏపీలో గెలిచిన వెంటనే జగన్ ఆ పెద్దాయనకి గట్టి షాకిచ్ఛారా? ఎవరా నేత? ఏమాకథ?

ABN Andhrajyothy | YS Jagan Gave Shock To Congress Leader | Weekend Comment By RK | ఏపీలో గెలిచిన వెంటనే జగన్ ఆ పెద్దాయనకి గట్టి షాకిచ్ఛారా? ఎవరా నేత? ఏమాకథ?

jagan mohan reddy, ys jagan mohan reddy, ys jagan, jagan mohan reddy going to attend cbi court, cbi court to jagan mohan reddy, ys jagan petition in cbi court, ys jagan songs, ys jagan cbi court, ys jagan attends hyderabad cbi court, ysr congress party, ys jaganmohan reddy, cm jagan mohan reddy, jagan mohan reddy news, jagan mohan reddy attends nampally cbi court

37 comments:

  1. జగన్ ఎవరికీ విలువ ఇవ్వడనేది జగమెరిగిన సత్యమే! ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా కొంతమంది సీనియర్ నాయకులు కూడా వెనక్కి తిరిగి వచ్చేశారు.

    జగన్ గారి విషయానికొస్తే తన పార్టీలోకి వచ్చేవాడు రాజీనామా చేయాలనే నియమం చాలా గొప్పది. దీని విషయంలో జగన్ గారిని మెచ్చుకోవాల్సిందే! ఈ విషయంలో చంద్రబాబుది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలు పార్టీని, నాయకుడిని, తరువాత అభ్యర్ధి చూసి ఓటేస్తారు. ఈ అభ్యర్ధి గెలిచిన పార్టీ నుండి వేరొ.క పార్టీలోకి జంప్ అవ్వడం ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నట్టే. దీనిపై ఇంకా కఠిన చట్టాలు రావాల్సింది ఉంది.

    ReplyDelete
  2. పూర్తిగా అపహాస్యం చేస్తున్నట్లే. ఈ మధ్య కాలం నుండి మరీ పెచ్చుమీరి పోతోంది.

    దీనిపై “కఠిన చట్టాలు” అంటే నాకొకటే తోస్తోంది. జంప్ చేసిన వారి ఎన్నికను రద్గు చేసేసి, ఎన్నికైన పదవి నుండి డిస్మిస్ చేసెయ్యడంతో బాటు వచ్చే ఏ రకమైన ఎన్నికలలోనూ పోటీ చెయ్యకూడదని అనర్హత వేటు కూడా వెయ్యడమే మార్గం. చాలా సందర్భాల్లో. ఈ పనిని స్పీకర్లు చెయ్యకుండా రాజకీయ కారణాల మూలంగానేమో నానబెడుతుంటారు కాబట్టి ... ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించే అధికారాన్ని ఎన్నికల సంఘానికి (వారికి మాత్రమే) ఇవ్వాలి. సస్పెండ్, పార్టీ నుండి రాజీనామాలు వగైరా కంటితుడుపులు కాదు, నిర్దాక్షిణ్యంగా ఎన్నిక రద్దు చేసెయ్యడమే. లేకపోతే గానీ ఈ ధోరణిని ఆపు జెయ్యడం అసాధ్యం. ప్రజాస్వామ్యం మరీ హాస్యాస్పదంగా తయారవుతోంది.

    ReplyDelete
    Replies
    1. జంప్ చేసిన వారు 6 సం వరకూ ఎన్నికల్లో పాల్గొనకూడదని రూల్ పెట్టి, అతని తర్వాత మెజారిటీ తెచ్చుకున్న అభ్యర్ధికి అధికారం అప్పగించాలి.

      Delete
    2. మరీ మంచిది.
      అలాగే ... అనర్హులు లోక్ సభ సభ్యులైతే రాజ్యసభకు, అసెంబ్లీ సభ్యులైతే MLC లు గానూ నామినేట్ చెయ్యకూడదు అని కూడా రూల్ పెట్టాలి.

      Delete
  3. https://bonagiri.wordpress.com/2018/09/08/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b0%bf/

    ReplyDelete
  4. మీ టపా చదివాను, బాగా వ్రాసారు బోనగిరి గారూ. అప్పుడు జరిగిన తెలంగాణా ఎన్నికలలో అటువంటి అభ్యర్ధులను ఓడించిన దాఖలాలు లేవేమో కదా? ఒక వ్యక్తి (పార్టీ అధినేత) image మీద ఆధారపడి ప్రభంజనలా జరిగే ఓటింగులో మీ టపాలో చెప్పినట్లు జరగడం అరుదు కదా. ప్రధానంగా ఓటర్లకు ఆ discernment కొరవడడం, ఇతర ప్రలోభాల పాత్ర ఎక్కువగా ఉండడం కారణాలని నా అభిప్రాయం.
    మీ టపాకు లింకిచ్చినందుకు thanks.

    ReplyDelete
    Replies
    1. Thanks sir.
      ప్రజలు అంత విజ్ఞతతో ఓటు వేస్తే మన దేశం ఇలా ఎందుకు ఉంటుందండి? బాగా చదువుకున్న వాళ్ళు కూడా కుల, మత సెంటిమెంట్లకు అతీతంగా ఆలోచించడం లేదు.

      Delete
    2. బోనగిరి గారూ, బాగా చదువు"కొన్న" వారికే కులం/మతం గట్రా దురద ఎక్కువ. మీడియా, సాంఘిక మాధ్యమాలు, సినిమాలు, కాలేజీలు, చివరికి అమెరికాలో సంఘాలు ఏవయినా చూడండి: మా కులం, మా కులం అంటూ అరిచి గీ పెట్టేవాళ్ళలో దాదాపు అందరూ బోలెడంత "పెద్ద చదువులు" వెలగబెట్టిన మహాశయులే.

      అత్యధిక "సాధారణ" ("పండితుల" భాషలో అలగా) జనం ఇటువంటి సంకుచిత భావాలకు అతీతం. వాళ్ళూ "పెద్దమనుషుల" తరహాలో స్వకులానికే అందలాలు దక్కాలనుకుంటే అల్పసంఖ్యాకులయిన అగ్రవర్ణాలు గెలిచేనా?

      Delete
  5. మోడీ, జగన్, కేసీయార్ లాంటి వాళ్ళు కులం/మతం విద్వేషాలు రెచ్చగొడుతుంటే అందులో చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ కొట్టుకుంటున్నారు. ఏమిటో ఈ దారుణం ఇప్పుడు ఆంధ్రా ప్రశాంతంగా లేదు. ఆంధ్రావాళ్ళంటే మోడీ, కేసీయార్ల కెందుకింత ద్వేషం? ఎన్నో ఆర్ధిక బొక్కల్లో ఉన్న జగన్ వీళ్ళను పీకెదేమీ లేదు. వీళ్ళ కాళ్ళకు మొక్కడం తప్ప!

    ReplyDelete
    Replies
    1. మోడీ కెసిఆర్ ఇద్దరేనా! విశాఖ సాములోరు, రాం గోపాల్ వర్మ, రమణ దీక్షితులు, సోము వీర్రాజు: ఇట్లాంటోళ్లను మరిచిపోయారేమి.

      డబ్బులు లేవో అని మొత్తుకునే బదులు రివర్స్ టెండరింగ్ ద్వారా చేసిన ఆదా, అట్లాగే తగ్గించిన దూబర చూడండి. స్విట్జర్లాండ్/సింగపూరు తిరిగేందుకు ప్రత్యేక విమానాలు, ఢిల్లీలో మీడియా దీచ్చలు, బాహుబలి తలదన్నే గ్రాఫిక్కుల కోసం బోలెడన్ని డబ్బులు తగలేసినప్పుడు ఆర్ధిక చిక్కులు గుర్తుకు రాలేదేం?

      Delete
    2. మీరన్నది నిజమే విశాఖ సాములోరు, రాం గోపాల్ వర్మ, రమణ దీక్షితులు, సోము వీర్రాజు, ఉండవల్లి లాంటి సన్నాసి వెధవలందరూ ప్రజలను మాయ చేసినవారే! ఆంధ్రాను నాశనం చేసిన పాపంలో వీరూ భాగస్వాములే.

      రివర్స్ టెండరింగ్ ద్వారా చేసిన ఆదా మామూలుగా లేదు. ఇక్కడున్న మాకంటే ఎక్కడో తెలంగాణలో మీకు మాత్రమే అర్ధమవుతుంది. బహుశా రివర్స్ టెండరింగ్ ద్వారా పనులన్నీ ఆపేయడమే పెద్ద ఆదా అనుకుంటా మీ దృష్టిలో..?

      ఉన్నతమైన రాజధాని నిర్మించేటప్పుడు రీసెర్చులు, డిజైనింగులు ఉంటాయి. అవన్నీ కంప్యూటర్ పై గ్రాఫిక్స్ రూపంలోనే ముందు డిజైన్ చేసి తరువాత ఆ ప్లాన్ ప్రకారం పనులు నిర్మిస్తారు. చంద్రబాబు క్రమబద్ధంగా అవే చేస్తూ ఉన్నాడు.

      ఆంధ్రా అభివృద్ధి అడుగడునా దెబ్బ తీస్తున్న మీ కేసీయార్ లాంటి సన్నాసులకు, మనస్సులో ఆంధ్రా నాశనం కోరుకుంటూ పైకి సానుభూతి డబ్బా కొట్టే మీలాంటి వారికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి.

      ఏమిటి సర్? దుబారా చూడాలా? మేము ప్రతి శుక్రవారం 60లక్షలు కోర్టు దుబారా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మీరు ఆనందపడే మరో ముఖ్యమైన విషయం జైగారు.. ఆ 60 లక్షలు మీ తెలంగాణకే ఆదాయంలెండి. ఎందుకంటే మా ప్రియతమ సీయం గారు ఎక్కే కోర్టులన్నీ మీ తెలంగాణాలో ఉన్నవే కదా?

      ఆంధ్రాకు రావాల్సిన ఆస్తులన్నీ అప్పనంగా దోచేసినా మీకింకా ఆంధ్రాపై పది ఏడ్వడం మానలేదు. అయినా ఆంధ్రావాళ్లు లేకపోతే మీకు బ్రతుకేది? హైదారాబాద్ లో మా వాళ్ళు ఉండకపోతే మీకు ఉనికెక్కడిది?

      Delete
    3. రివర్స్ టెండరింగ్ ద్వారా షుమారు 1,400 కోట్లు ఇప్పటికే ఆదా అయినట్టు అంచనా. మీ లెక్క ప్రకారం, ఇంకో 44 (1.400 crores, 60 lacs per weekly appearance, 52 weeks in year) సంవత్సరాల కోర్టు హాజరీ ఖర్చులు వచ్చేసినట్టే :)

      మీ ఎరికా కొరకు సదరు 60 లక్షలు అనేటివి సెక్యూరిటీ బందోబస్తు నిమిత్తం ఆంధ్ర ప్రభుత్వ ఖర్చు. దాన్ని కోర్టులకు కట్టరు & తెలంగాణాకు అందుట్లో దమ్మిడీ రాదు. అంత బాధగా ఉంటే గుజరాత్ కోర్టులకు మార్చుకోండి, అభ్యంతరం లేదు.

      బాబు సింగపూరు అసమదీయుడు ఈశ్వరన్ కంపెనీకి కన్సల్టెన్సీ పేరిట వందలాది కోట్లు ముట్టచెప్పాడు. ఇతడు & చిన్నబాబు డావోస్/సింగపూరు/దుబాయి వగైరాలు విహారయాత్రలకు ఇంకొన్ని వందల కోట్లు తగలేసారు. ధర్మపోరాట దీచ్చలంటూ ఇంకా బోలెడంత ప్రజాధనం పార్టీ కార్యకర్తలపై వెచ్చించాడు. ఇవేవీ మీకు కనిపించలేదు కానీ జనానికి బానే తెలిసాయి కనుకే 23 సీట్లు విదిల్చారు.

      హైదరాబాదులో "మీ వాళ్ళు" ఉన్నా లేకపోయినా ఏమీ ఫరక్ పడదు. అందరికీ స్వాగతం పలికే ఔదార్యత మాకుంది కానీ ఎవడో లేకపోతే అధోగతి అని బెంబేలెత్తే స్వభావం మాత్రం లేదు.

      Delete
    4. Jai Gottimukkala : రివర్స్ టెండరింగ్ ద్వారా షుమారు 1,400 కోట్లు ఇప్పటికే ఆదా అయినట్టు అంచనా. మీ లెక్క ప్రకారం, ఇంకో 44 (1.400 crores, 60 lacs per weekly appearance, 52 weeks in year) సంవత్సరాల కోర్టు హాజరీ ఖర్చులు వచ్చేసినట్టే :)

      AP Political Reviews : అబ్బో పెద్ద గూడుపుటాణినే బయట పెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరిట అభివృద్ధి పనులన్నీ ఆపేసింది కోర్టు ఖర్చుల కోసమా? ఇదేనా పెద్ద పొదుపు?

      Delete
    5. Jai Gottimukkala : హైదరాబాదులో "మీ వాళ్ళు" ఉన్నా లేకపోయినా ఏమీ ఫరక్ పడదు. అందరికీ స్వాగతం పలికే ఔదార్యత మాకుంది కానీ ఎవడో లేకపోతే అధోగతి అని బెంబేలెత్తే స్వభావం మాత్రం లేదు.

      AP Political Reviews : మీది ఔదార్యం కాదు సర్. అవసరం.. లేకపోతే తెలంగాణ గతి ఏమవును?

      Delete
    6. Jai Gottimukkala : బాబు సింగపూరు అసమదీయుడు ఈశ్వరన్ కంపెనీకి కన్సల్టెన్సీ పేరిట వందలాది కోట్లు ముట్టచెప్పాడు. ఇతడు & చిన్నబాబు డావోస్/సింగపూరు/దుబాయి వగైరాలు విహారయాత్రలకు ఇంకొన్ని వందల కోట్లు తగలేసారు. ధర్మపోరాట దీచ్చలంటూ ఇంకా బోలెడంత ప్రజాధనం పార్టీ కార్యకర్తలపై వెచ్చించాడు. ఇవేవీ మీకు కనిపించలేదు కానీ జనానికి బానే తెలిసాయి కనుకే 23 సీట్లు విదిల్చారు.

      AP Political Reviews : ఇక మీరు ఊదే బాకాకు బొక్కలు పడిందిలెండి. ఇక్కడ నమ్మే ఆంధ్రావాళ్లు ఎవరూ లేరు. చంద్రబాబు చేసిన అభివృద్ధిలో ఒక్క శాతం కూడా జగన్ చేయలేకపోయాడు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ తప్ప ఏమీ లేదు. ఆటరానివాడిని ఆడుకుందాం రా...అంటే చోటు చాలదన్నాడట వెనుకటికి ఒకడు. మీ కామెంట్లు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడూ చెప్పుకోవడానికి చేసిన పనులేవీ లేక ఎదుటివారి బొక్కలు క్రియేట్ చేయడటం మాత్రం మానటం లేదు. అచ్చం జగన్ గారిలా!!!

      Delete
    7. @AP Politics:

      "ఇక్కడ నమ్మే ఆంధ్రావాళ్లు ఎవరూ లేరు"

      ఏబీఎన్, డ్రామోజీ, వడిబియ్యం వెంకట కృష్ణ, లగడపాటి, కుండబద్దలు ఇతర అసమదీయులు ఎన్నికల ముందు కూడా ఇవే ఖబుర్లు చెప్పారు కానీ ఏమైంది? ఆంధ్ర జనం జనహృదయ నేత వెంబడే ఉన్నారు.

      అభివృద్ధి అంటే జిమ్మిక్కులు కాదు. పిల్లలను చదివించలేక అవస్థలు పడుతున్న తల్లులకు నేనున్నానని భరోసా ఇవ్వడం నిజమయిన విజన్.

      Delete
    8. జనహృదయ నేత కాదు... ఈవియమ్ టాంపరింగ్ నేత
      పంచి పెట్టుల కార్యక్రమం ఒకసారి హడావిడి చేస్తే విజన్ అయ్యిపోద్దా? అభివృద్ధి ఏదీ? వచ్చిన కంపెనీలన్నీ ఆంధ్రాను విడిచి పోయిన విషయం మీకు తెలియకుండా ఉంటుందా? లేక అవన్నీ తెలంగాణాలో వచ్చి పడుతున్నాయని కప్పి వేస్తున్నారా?

      మేకతోలు కప్పుకున్న తోడేలని ఆంధ్రా వాళ్ళకు అర్ధమయ్యింది. ముందు సోళ్ళు కబుర్ల సాక్షి టివిని, పేపర్ను వదిలి ఆంధ్రా వచ్చి చూడండి వాస్తవాలు అర్ధమవుతాయి..

      కేసీయార్లా తెలంగాణాలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. ముందు ప్రజలను అర్ధం చేసుకోండీ.

      Delete
    9. ఈవీఎం టాంపరింగ్ జరిగిందని రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు. మోడీ గారికి వేరే పనీపాటా లేదా, టాంపరింగ్ చేసి వేరే పార్టీని గెలిపిస్తారా?

      విశాఖ నుండి గెలిచిన నలుగురు పచ్చ తమ్ముళ్లలో ఒక్కడంటే ఒక్కడు ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో "విశాఖపట్నం వద్దు భ్రమరావతి ముద్దు" నినాదంపై పోటీ చేసి (బ్యాలట్ పేపర్ పద్దతిలోనే లెండి) గెలిచి చూపించండి.

      జగన్ తన మానిఫెస్టోలో ఉన్న హామీలు ఒకటొకటీ పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. అమ్మ ఒడితో నిరుపేద తల్లులకు భరోసా ఇస్తుంటే పచ్చంగీలకు కంటిలో కారం పడినట్టుంది.

      Delete
    10. ప్రజల అభిప్రాయం ముఖ్యం కాదా? విశాఖలో ఉన్న ఆ నలుగురు ఎందుకు? వాళ్ళు మళ్ళీ గెలిచినా? ఓడినా ప్రయోజనం ఉండదు గాని ముందు AP మొత్తం ఎలక్షన్స్ పెట్టమనండి..వైసీపీ,టిడిపిల బండారం బయటపడుతుంది. అప్పుడు ప్రయోజనం ఉంటుంది అంతేగానీ జగన్ లా తలకాయలేని కామెంట్లు పెట్టకండి.

      పంచుడు కార్యక్రమాలకంటే మేనిపెస్టోలో భవిష్యత్ కు ఉపయోగపడే ప్రత్యేకహోదా, పోలవరం లాంటివి ఉన్నాయి. వాటి ప్రస్తావన ఏదీ?

      కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, అమరావతిని గొప్ప రాజధానిగా నిర్మిస్తానంటేనే అందరం నమ్మి ఓటేసాం. అంతేగానీ పంచుడు కార్యక్రమాలకు ప్రలోభ పడిపోయి ఒట్లేయలేదు. ఎలక్షన్స్ లో సంక్షేమ పధకాలు చెప్పినట్టు అమలవుతున్నాయా? అయినా మీకూ, కేసీయార్కు ఆంధ్రా నాశనమవ్వడమే కావాలి. అడ్డమైనదాన్ని సమర్ధిస్తారు. మీకు పోయేదేముంది బొచ్చు. కేసీయార్, మీరూ AP అసెంబ్లీ మీటింగ్లు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మీకు మందు అలవాటు ఉంటే ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోండి. ఇద్దరూ కల్సీ ఎంజాయ్ చేయొచ్చు

      వైసీపీ పత్యం నరనరాన కల్సిపోయిన మీకు ఆంధ్రా అభివృద్ధి కోసం, పరిస్థితుల చూసి బాధ పడుతున్న ప్రతి ఆంధ్రుడూ మీకు పచ్చంగీలలా కనిపిస్తారు.

      Delete
    11. ఈ సారి ఎన్నికలొస్తే ఆ 23 కూడా రావని తమ్ముళ్ళకూ తెలుసు. కెసిఆర్ మోడీ జగన్ కుట్రలంటూ మళ్ళీ అవే "శిల మోసే గాయాలు" పాచి పళ్ళ దాసరి గీతాలు పాడితే ఒరిగేది ఏమీ లేదు.

      పంచుడు అంటూ తేలిగ్గా కొట్టిపారేయకండి. చంద్రబాబు రైతు & డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టకయుంటే ఇంతకన్నా మెరుగు ఫలితాలు వచ్చేవి కావా.

      బాబు ఐదేళ్లలో పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? బాబు, రాయపాటి & నవోదయ మధ్య సర్దుబాట్లు కుదరకపోవడం జగన్ తప్పెలా అవుతుంది?

      జగన్ మానిఫెస్టోలో ప్రత్యేక హోదా, అదరగొట్టే రాజధాని వగైరా ఊకదంపుడు లేదు. అటువంటి చిన్న మాయ, లంబూ & జంబూ మాయాబజార్ సోది ఖబుర్లు చెప్పి బొక్కా బోర్లా పడ్డది ఎవరో మీకూ తెలుసు.

      కెసిఆర్ ఏమి ఎప్పుడు తాగుతాడో నాకెందుకు? అంత ఉబలాటంగా ఉంటే తమరే అతని సోపతిలో పోసుకోండి.

      Delete
  6. Jai Gottimukkala : మీ ఎరికా కొరకు సదరు 60 లక్షలు అనేటివి సెక్యూరిటీ బందోబస్తు నిమిత్తం ఆంధ్ర ప్రభుత్వ ఖర్చు. దాన్ని కోర్టులకు కట్టరు & తెలంగాణాకు అందుట్లో దమ్మిడీ రాదు. అంత బాధగా ఉంటే గుజరాత్ కోర్టులకు మార్చుకోండి, అభ్యంతరం లేదు.

    AP Political Reviews : గుజరాత్ కోర్టులకు పోతే మీ కేసీయార్కు హార్ట్ ఎటాక్ రాదూ? ఎలాగూ మీ తెలంగాణ జైలులోనే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా పెద్ద అభిమానులు కదా? అప్పుడప్పుడు చూసిపోతూ ఉండండి :)

    ReplyDelete
  7. <<< విశాఖ నుండి గెలిచిన నలుగురు పచ్చ తమ్ముళ్లలో ఒక్కడంటే ఒక్కడు ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో "విశాఖపట్నం వద్దు భ్రమరావతి ముద్దు" నినాదంపై పోటీ చేసి (బ్యాలట్ పేపర్ పద్దతిలోనే లెండి) గెలిచి చూపించండి.<<<<<

    23 మంది రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోదు. మళ్ళీ తెలుగుదేశమే గెలిచినా లాభం ఏముంటుంది ? జనం డబ్బు పోగొట్టుకోవడం తప్ప..

    ReplyDelete
  8. @ jai garu,

    ఆంధ్రాలోచూసి చెపుతున్నాను, రాజధాని విభజన పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు. అమరావతి రైతు పట్ల సానుభూతి లేదు. అమరావతి అభివృద్ధి అంటే కమ్మవారి అభివృద్ధి అని ప్రజల్లో బలంగా విద్వేషం నింపారు.

    ఎన్నికలకు ముందు చంద్రబాబుగారు నెత్తీ నోరు మొత్తుకుని, మళ్ళీ గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పినా ఒక్కరూ వినలేదు.
    ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల పోగొట్టుకున్నదాంట్లో పోలిస్తే అమరావతి విభజన వల్ల పోగొట్టుకునేది ఎంత అని ఆలోచించాలి. డబ్బు, ఆస్థులు మళ్ళీ సంపాదించుకోవచ్చు సమయం విలువ కట్టేదెవరు ?

    యెల్లో మీడియా కమ్మవారిని సపోర్ట్ చేస్తుంటే గులాం గ్యాంగ్ కి వచ్చిన నెప్పి ఏమిటంట ? మీక్కూడా గులాం మీడియా ఉంది కదా ? ఆంధ్రా వారికి ప్రతిపక్షమంటూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. మీలాగ కాల్మొక్త బాంచెన్ అంటూ ఎవరూ లేరిక్కడ !

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారూ, ఏ పార్టీ/మీడియా ఎట్లా పొతే మనకేమిటి. నయా పైసా ఖర్చు లేకుండా బోలెడంత వినోదం ఎంజాయ్ చేద్దాం.

      చదువుకున్నోడి కంటే చాకలోడు మేలన్నట్టు సామాన్యా జనం ఈ "విశ్లేషకుల" మీద ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. వారికి కులకుంపట్ల జంజాటాలు పట్టవు. తమకేమి కావాలో బాగా తెలుసు. ఎదో కట్టేస్తే ఏవో బ్రహ్మాండాలు సాధిస్తాం అన్న నడిమంత్రపుసిరి కలలు వారికి ఉండవు.

      Delete
  9. మిత్రులు జై గారు, పొరబడుతున్నారు. పైసాఖర్చు లేని వినోదాన్ని ఎంజాయ్ చేయటం అదీ అల్లకల్లోలంగా ఉన్న ఆంధ్రా దుస్థితి పైన! ఎంత దిగజారుడు ఆలోచన చేస్తున్నారో కదా మీరు! శత్రువుల దుస్థితి కళ్ళారా చూసి వినోదించుదాం అన్న కర్ణుడి లాగా మీరూ మాట్లాడుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. పెద్దలు శ్యామలీయం మాస్టారు నా వాక్యాన్ని మళ్ళీ చదువుకోగలరు. నేను "నయా పైసా ఖర్చు లేకుండా బోలెడంత వినోదం" అన్నది కులగజ్జి మీడియా ఆపసోపాలు గురించి.

      ఆంధ్రులకేదో దుస్థితి దాపురించిందని మీరనుకుంటే మీ ఇష్టం. ఊరూరూ తిరిగి జనం కష్టం కళ్లారా తెలుసుకుని కనీవినీ ఎరగని అఖండ మెజారిటీతో గెలిచిన నాయకుడు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేరుస్తుంటే అది మెచ్చుకునే హృదయం లేకపోవడం మీ విచక్షణకే వదిలేస్తాను.

      Delete
  10. మిత్రులు జై గారు, చెడిన మీడియా గురించి అన్ని సాకు చాటున సమర్ధించుకోలేరు. చెడటం అన్నది మీ రెత్తిపొడిచే పచ్చమీడియా మాత్రమే కాదు మీప్రియతమ పిచ్చిమీడియా కూడా అని మీ ధోరణి మాటలే వాడి చెప్పవలసి వస్తున్నది. ఏమీడియా ఐనా వ్రాసేది ప్రజా గురించే కదా - మీరు వినోదించేది ఆప్రజ గురించిన వార్తలే కదా.

    మీరు మెచ్చటానికి నాయకుడు యోగ్యత కలవాడేమో కాని నాకు అలా అనిపించటం లేదు.

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ, నేను ఫలానా మీడియాను ఎప్పుడు మెచ్చుకున్నానని మీరు నా "ప్రియతమ పిచ్చి మీడియా" అంటున్నారు? Why do you insist on reading between the lines?

      రామోజీ & రాధాకృష్ణలను నేనేమన్నా మీరెందుకు భుజం తడుముకోవాల్నో తెలువడం లేదు.

      జగన్ మీకు నచ్చకపోతే మీ ఇష్టం. కుదిరితే & మనసు ఒప్పితే ఆయనకు భారీగా ఓట్లేసి నభూతో నభవిష్యతి అన్నరీతిలో గెలిపించిన ప్రజలతీర్పును గౌరవించమని మనవి చేయడం మినహా నేనేమీ చేయలేను.

      Delete
    2. శ్యామలీయం గారు ఆంధ్రా పరిస్తుతులు.. జైగారికి, కేసీయార్లకు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. కేసీయారైతే ఫుల్ గా గుడుంబా కొట్టేసి ఆఖరికి వాళ్ళ మునిసిపల్ ఎలక్షన్స్ కూడా పట్టించుకోకుండా టీవీలకు అతుక్కుపోయాడు. ప్రజల భాధను చూపించే మీడియాను పట్టుకుని పచ్చ మీడియా అని ఎగతాళి చేయడం జైగారికి తెలంగాణాలోని పిచ్చి మీడియా (దానికి గులాం మీడియా అని పేరు )సోల్లు మీడియా అయిన సాక్షి తప్ప మిగతా అంతా పచ్చమీడియానే.. భారీగా గెలిపించినందుకే గుండెలు బాదుకుని ఏడ్చేలా చేస్తున్నాడు. ఈ టాంపరింగ్ సియం. ప్రజల బాధలు ఎంజాయ్ చేయడం మాని ముందు మంచిగా ఆలోచించడం నేర్చుకోండి జై గొట్టిముక్కల గారూ?

      Delete
  11. మిత్రులు జై గారు, మీరు మీడియాలో కొంతభాగాన్ని ఈసడించి సంబోధించటం కొంతభాగంపట్ల సానుకూలంగా ఉండటమూఅందరికీ తెలిసిందే.నేనెందుకు భుజాలు తడుముకోవటం?

    ఏనాయకుడైనా నాకు నచ్చటమూ నచ్చకపోవటమూ వెనుక నా అభిప్రాయాలు నాకుంటాయి సహజంగానే. ఇకపోతే ఈనాడొక నాయకుడికి నభూతమైన మెజారిటీ వచ్చినా అది నభవిష్యతి అని మీరు ఎలా నిర్ధారిస్తారు? ఓడలు బండ్లు కావటమూ బండ్లు ఓడలు కావటమూ సర్వసాధారణం. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు నేడు. నిజమే. దాని పరిణామాలు చూస్తున్నాం. మీకు నచ్చాయి. సంతోషం. నాకు ఆపరిణామాలు నచ్చటం లేదు. దాని అర్ధం ప్రజలను నేను అవమానిస్తున్నానని కాదు. మీరలా అర్ధం తీయకూడదు. లేకపోతే, ఎన్నుకున్న పిదప ఎవరికీ తప్పొప్పులను వివేచించే హక్కే లేదని మీరు సిద్ధాంతం చేస్తున్నట్లు అవుతుంది. అది ఉచితం కాదు. అందుచేత నచ్చలేదూ అంటే పెడర్ధం తీయకండి.

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ, నేను ఏ "ప్రియతమ మీడియా" పట్ల "సానుకూలంగా" లేను కనుక నాకు ఇబ్బందేమీ లేదు. తెలంగాణా సర్కారు మోడీ గారి అఖండ జనాదేశాన్ని అగౌరవపరిస్తే నేను జవాబుదారీ కాలేను.

      ఇంతకంటే బ్రహ్మాండమయిన (both quantitative & qualitative) ఫలితాలు మళ్ళీ నేను బతికుండగా చూస్తానని అనుకోను, జరిగితే మంచిదే.

      గెలిచిన వారు ఏమి చేసినా ఎవరూ వ్యతిరేకించకూడదని నేను ఇప్పుడూ ఎప్పుడూ అనలేదు. జనసామాన్యంలో ప్రస్తుత నిర్ణయం పట్ల ఇసుమంతయినా అసమ్మతి లేదన్న నా అంచనాని విశాఖ టీడీపీ శానసభ్యులలో ఎవరో ఒక్కరు రాజీనామా చేసి single issue campaign కింద భారీ మెజారిటీతో గెలిస్తే మార్చుకోవడానికి సిద్ధం.

      Delete
    2. single issue campaign అదే single issue campaign క్రింద అమరావతిలోని YCP MLA'S రాజీనామా చేసి నిరూపించుకోవచ్చు కదా? మీకు వైసీపీ పైత్యం బాగా ముదిరిపోయింది. కక్కుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎక్కడ అమరావతి.. హైదారాబాద్ కు పోటీ వస్తుందన్న భయం మీకు..మీ కేసీయార్కు!

      మూడురాజధానులు వలన అంతా అభివృద్ధి జరిగిపోతే మీ తెలంగాణ వాళ్ళు ఎందుకు కేవలం హైదరాబాద్ ను పట్టుకు వేలాడటం? మీ తెలంగాణా ఎలాగూ బలిసి ఉంది కాబట్టి నాలుగు రాజధానులు పెట్టుకోవచ్చు కదా?

      మీ నక్కజిత్తుల వేషాలు ఎవరికీ తెలియవు అనుకోకండి. మీ ఆలోచనల వెనుక ఆంధ్రా నాశనమే అజెండా!!

      Delete
    3. తెలంగాణకు నాలుగు కాకపొతే నలభై రాజధానులు పెట్టండి మిత్రమా నేను వద్దన్నానా.

      చంద్రబాబు భ్రమరావతిని "అభివృద్ధి" చేస్తే గుజరాత్, తెలంగాణా, బీహార్ గట్రా మట్టి కొట్టుకుపోతాయి కాబట్టి మోడీ, కెసిఆర్, ప్రశాంత్ కిషోర్ వగైరాలందరూ బాబోరిని ఓడించాలని కుట్ర చేసారని అంటూ ఎన్నికల ముందు కులమీడియాలో బోలెడంత టాంటాం చేసారు. జనం నమ్మలేదు పైగా 1989 కంటే ఘోరమయిన పరాభవం.

      ఇకనయినా "శిల మోసే గాయాలు" తరహా పాచిపండ్ల పాత పాట బదులు వ్యూహం మార్చి ప్రయత్నించండి. కుదిరితే మారుమూల నీళ్లు లేని పల్లెలకు వెళ్లి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని హైలైట్ చేస్తే జనం బాగుపడతారు.

      Delete
  12. మిత్రులు జై గారు, మరొక మాట. అఖండమైన మెజారిటీతో భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోనికి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాటికి ఆ కేంద్రం విధానాలను నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉంది. ప్రజలు తీర్పును గౌరవించి కేంద్రంతో విబేధించక గౌరవిస్తూ ఉండమని తెలంగాణా ప్రభుత్వానికీ మీరు సూచించగలరా ?

    ReplyDelete
    Replies

    1. Per suppose , జై గారిస్తే గిస్తేనూ , వారి వాయిస్ తెలగాణలో వినే నాధులున్నారంటారాండీ శ్యామలీయం వారూ :)


      నారదాయ నమః


      జిలేబి

      Delete
    2. జిలేబీ మాతా నమోనమః

      నా వాయిస్ వినేవారున్నారని కానీ నా చాయిస్ జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కానీ ఎటువంటి అపోహలు నాకే లేవు. లోకవాణిని కొంతలో కొంతయినా అర్ధం చేసుకోగలిగితే నా బతుక్కి అదే ఎక్కువ.

      శారదా!

      Delete

    3. మీకు మీరే సాటి :)


      జిలేబి

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.