Saturday, January 25, 2020

14మంది MLC లు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత? | దీనికి BJP సహకరిస్తోందా?

14మంది MLC లు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత? | దీనికి BJP సహకరిస్తోందా?

3 comments:

  1. పచ్చ సోదరులు పచ్చ సానుభూతి పరులు స్పందించ గలరు.

    ఈ రోజు సాక్షిలో 'జ‌గ‌న్ వ్య‌క్తిగత హాజ‌రు మిన‌హాయింపు పిటిష‌న్ కొట్టివేత అనే శీర్షిక‌తో వార్త రాశారు.

    అదే ఈనాడులో మార్గదర్శి కేసులో. సుప్రీం కోర్టులో ఉండ‌వ‌ల్లి పిటిష‌న్ స్వీక‌ర‌ణ" గురించి ఊసే లేదు.

    ఇదీ పచ్చ పత్రికల నిబద్ధత విలువలు.





    ReplyDelete
  2. ఆనాడు చంద్రబాబు ఏమన్నారంటే..


    ‘‘అధికారపక్షం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. కేవలం పదవుల కోసమే మండలిని పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మండలి వల్ల ఎలాంటి లాభం లేదు. ఒకప్పుడు అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండేది. కాబట్టి పెద్దలు అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంచి క్వాలిటీ ఉంది. అనుభవం ఉంది. మండలి వస్తే, శాసనాలు పాస్‌ కావడంలో ఆలస్యం అవుతుంది. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని మన్స్‌ఫర్డ్‌ కమిటీ కూడా చెప్పింది. 1930 రౌండ్‌ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌పార్టీ కూడా మండలిని వ్యతిరేకించింది. అక్టోబరు 26, 1934న అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశంలో కూడా బాబు రాజేంద్రప్రసాద్‌ మండలిని వ్యతిరేకించారు. మండలి వల్ల లాభం ఉండదని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. 1950 నుంచి కేవలం 8 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఏర్పాటైంది. వాటిలో 3 చోట్ల రద్దయింది మండలి వల్ల ఏటా రూ. 20 కోట్ల ఆర్థిక భారం. ఒక బిల్లు మండలికి వెళ్లి అక్కడ పాస్‌ అయినా లేదా తిప్పి పంపితే మళ్లీ కాలాయాపన. ఏ బిల్లునైనా ఆపే అధికారం మండలికి కేవలం 4 నెలలే ఉంటుంది. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు కూడా మండలి సభ్యులకు లేదు.(‘చంద్రబాబు కోరుకున్నదే.. మేము అమలు చేస్తున్నాం’)

    ఇక ఆర్థికేతర విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలంటూ ఏమీ లేవు. ఆర్థిక బిల్లులన్నీ శాసన సభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగ సవరణలు వచ్చినా శాసన సభకు తప్ప మండలికి ప్రమేయం ఉండదు. పరిమిత అధికారాలు తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. మేధావులు కూడా మండలికి వస్తారనుకోవడం లేదు. 1958లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో మండలి ఏర్పాటేతే అది ఒక పునరావాస కేంద్రంగా మారింది. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలను కలుపుకోవడానికి మండలిని వాడుకున్నారు. ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్‌ రద్దు చేశారు. జనవరి 23, 1990న మండలి కావాలని చెన్నారెడ్డి తీర్మానం చేస్తే నాటి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తిరస్కరించింది. మండలి పెట్టాలంటే రెఫరెండం పెట్టాలి. చాలా రాష్ట్రాలు మండలి కావాలని అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. అనేక కారణాల వల్ల మండలి కావాలన్న బిల్లు లోక్‌సభలో లేదా రాజ్యసభలో తిరస్కరిస్తున్నారు’’

    ReplyDelete
  3. https://www.sakshi.com/news/politics/chandrababu-says-2004-legislativ-council-misusing-public-money-1259005

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.