7 lakh pensions out of state They have not yet received a pension from February 1 | రాష్ట్రం మొత్తం మీద 7లక్షల పింఛన్లు ఔట్ | వీళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఇంకా పింఛన్ రాదు
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
అర్హులైన వారికి పింఛన్లు ఉంచినప్పుడే జగన్ ప్రభుత్వం పట్ల సానుభూతి ఉంటుంది. అంతేగానీ ఏవో రూల్స్ పెట్టి పింఛన్లు పీకేయడం దారుణం. నిజానికి వైయస్సార్ సిపి కార్యకర్తలకు మేలు చేద్దామన్న ఉద్దేశ్యంతో ఏవో కారణాలతో పింఛన్లు రద్దు చేస్తే జగన్ పట్ల జనాలలో అయిష్టత తప్ప అభిమానం ఉండదు. వైసీపీ పేరు చెప్పి పింఛన్లు తీసుకున్నా చివరికి వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు. సక్రమంగా నడుస్తున్న దాన్ని అక్రమంగా తీసుకెళ్ళడం ప్రారాభించిననాడు పతనం కూడా దాని వెంటే బయలు దేరుతుంది. ఇది జగన్ ప్రభుత్వానికి అర్ధమయ్యేటప్పటికి భారీ. మూల్యం చెల్లించి ఉంటారు.
ReplyDelete
ReplyDelete"కుక్షి" లో నేటి వార్త:
టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కా వేసుకుంటే గానీ పెన్షన్లు ఇచ్చేవారు కాదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా పెన్షన్లు ఇస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు భరించలేకపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో భర్త ఉన్న వారికి కూడా వితంతు పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. కనీస అర్హతలు కూడా చూడకుండా పెన్షన్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతం చూడకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్‌లు ఇస్తున్నారని గుర్తుచేశారు. పెన్షన్లను తీసేస్తున్నారంటూ ప్రస్తుతం చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక:
పెన్షన్ల మంజూరు విషయంలో గతంలో ఉన్న అర్హతలను కూడా సడలించి మరింత ఎక్కువ మందికి మేలు చేసేలా చర్యలు తీసుకున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేయాలన్న వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. వలంటీర్లు రేపటి నుంచి ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి ఒకే రోజు పింఛన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు
"ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు! What to do..what not to do"
వితంతు ఫించన్ అనేది అనవసరం. కూలీ పని చేసే స్త్రీకి భర్త ఉన్నా, లేకపోయినా ఆమె కూలీ పనికి వెళ్తుంది. వైట్ కాలర్ ఉద్యోగం ఉన్న స్త్రీకి ఎలాగూ పెన్షన్ ఇవ్వరు. ఈ పెన్షన్ వల్ల ఏమి ఉపయోగం, భర్త ఉన్నా అతను చనిపోయాడని సర్పంచ్ చేత సర్టిఫై చెయ్యించి పెన్షన్ తీసుకోవడానికి తప్ప?
ReplyDeleteకూలీ పని చెయ్యలేని, వైట్ కాలర్ ఉద్యోగం లేని ... వితంతువుల సంగతేమిటి? అటువంటి వారికి ఈ పెన్షన్ ఎంతో కొంత ఊరట గదా?
Deleteపని చెయ్యలేని స్త్రీలు ఉంటే స్త్రీ సాధికారికత రాదు. తెలుగు కొమటోళ్ళలో జరుగుతున్న జెండర్ సెలెక్టివ్ అబార్షన్ల గురించి ఒరిస్సాకి చెందిన కొందరు గిరిజనులకి చెప్పాను. "వాళ్ళ పెళ్ళిళ్ళలో కట్నాలు ఇచ్చుకోవాలి, మా పెళ్ళిళ్ళలో కట్నాలు ఇచ్చుకోము" అని ఒక గిరిజనుడు సమాధానం చెప్పాడు. ఇక్కడ కట్నం ఒక్కటే సమస్య కాదు. "మీరు పొలంలో కలుపు మొక్కలు తియ్యించే పని ఆడవాళ్ళ చేతే చెయ్యిస్తారు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే మీకు నష్టం. కోమటోళ్ళు ఆడవాళ్ళ చేత వ్యాపారాలు చెయ్యించరు కదా" అని నేను సమాధానం చెప్పాను. ఆ గ్రామంలో మగవాళ్ళు పశువులు కాస్తారు, ఆడవాళ్ళు అడవిలో విప్ప మొగ్గలు ఏరుతారు. జెండర్ సెలెక్టివ్ అబార్షన్‌లు ఆ గ్రామంలో లేవు. ఆడవాళ్ళు లేకపోతే అక్కడ ఎకనామిక్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. గిరిజనుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు కట్నాలు తీసుకుంటారు కానీ పశువులు కాసేవాళ్ళు & వేటగాళ్ళు కట్నాలు తీసుకోరు.
Delete
Delete++కోమటోళ్ళు ఆడవాళ్ళ చేత వ్యాపారాలు చెయ్యించరు కదా" అని నేను సమాధానం చెప్పాను
నాయనా ప్రవీణు రిప్ వాన్ వింకల్ వలె లేచి వచ్చినావా :)
జిలేబి
ఆడవాళ్ళలో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కొంత మంది ఉన్నారు. పావలా వడ్డీ ఋణాల డబ్బులని ప్రైవేట్‌లో పది రూపాయల వడ్డీకి తిప్పే మహిళలని నేను చూసాను. వితంతు ఫించన్ స్త్రీలకి ఏమాత్రం మేలు చెయ్యదని ఇక్కడ చెపుతున్నాను. పల్లెటూర్లలో భూమి మగవాళ్ళ యాజమాన్యంలో ఉండడం, ఆ భూమిలో ఆడవాళ్ళు కూలీ పని చెయ్యడం లాంటి జెండర్ ఇనీక్వాలిటీ ఇష్యూస్ అనేకం ఉన్నాయి. ఇక్కడ వితంతు ఫించన్‌ల వల్ల ఆడవాళ్ళు బాగుపడతారని కొంత మంది నమ్ముతున్నారు.
Deleteముస్లింలు భర్త చనిపోయిన స్త్రీకి మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. పంజాబ్‌లో సిక్కు స్త్రీలు రెండో పెళ్ళి చేసుకున్న తరువార పెన్షన్ తీసుకున్న వార్తలు ఉన్నాయి. హిందు మతంలో విధవా వివాహాలు నిషిద్ధం అని ఇతర మతాలకి చెందిన స్త్రీలకి పెన్షన్ ఎలా ఇస్తున్నారు? చట్ట ప్రకారమైతే హిందు స్త్రీ కూడా రెండో పెళ్ళి చేసుకోగలదు. రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీ కూడా పెళ్ళైన స్త్రీతో సమానమే. రెండో పెళ్ళి చేసుకున్న తరువాత పెన్షన్ క్లెయిం చేసేంత తెలివి హిందు స్త్రీలకి కూడా ఉంటుంది. హిందు స్త్రీలలో ఇప్పుడు కూడా ఎక్కువ మంది వెనుకబాటు నమ్మకాలని నమ్ముతున్నారు అని మీరు చెప్పొచ్చు. వెనుకబాటు నమ్మకాలని నమ్మేవాళ్ళకి కూడా ఉపాధి కల్పన ముఖ్యం. పెన్షన్ వేరు, ఉపాధి వేరు.
ReplyDelete