Saturday, July 13, 2019

Thursday, July 11, 2019

KCR వ్యతిరేకులను సైతం తలలు వంచేలా లొంగదీసుకునే ఘటికుడు.

kcr-he-is-also-leader-of-kcr-opponents
ఆంధ్రావాడై యుండి తెలంగాణా సియంను పోగుడుతున్నాడేమిటి? అనుకోవద్దు. ఈమాట యదార్ధం కాబట్టే చెపుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఆంధ్రా భారీగా నష్టపోతుందని, ఇండియా-పాకిస్తాన్ ల మాదిరి తెలంగాణ,ఆంధ్రాలు ఏర్పడతాయని చంద్రబాబు గవర్నమెంట్ లో గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నే ఓపిన్ చేయించాడు. ఇదీ కెసియార్ ఘటికతనమంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ముందు తీవ్రంగా వ్యతిరేకించాను... ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపినింగుకు వెళ్తే ఆంధ్రా ప్రజలు ఏమనుకుంటారోనన్న ఆలోచన కూడా లేకుండా జగన్ ను తయారుచేయడం కెసియార్ గొప్పతనమనే చెప్పాలి. రేపొద్దున్న ఏమాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా భారీ ఫెయిల్ అయినా ఇదంతా ఆంధ్రావాడి దరిద్రం వల్లనే జరిగిందనే నీచపు మాటలు కెసియార్ పలకకుండా ఉండడు. ఇదంతా కెసియార్ ను గుడ్డిగా నమ్ముతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు తెలుసుకుంటే మంచిది.

Wednesday, July 10, 2019

Tana సభలో అద్భుతంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్! | Pawan Kalyan to Excellent speak at Tana Sabha

Pawan Kalyan Excellent Speech at TANA Conference 2019

జనసేన పార్టీ భారీ ఓటమి తరువాత మీడియా పరంగా పెద్దగా కనిపించలేదు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. కనీసం పవన్ కళ్యాణ్  అయినా అసెంబ్లీలో కూర్చుంటే బాగుంటుందని ఆంధ్రా ప్రజలు ఆశించారు. జనసేన పార్టీ అధికారంలోకి రాదని తెలుసుగాని, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని ఆశించారు. జనసేన పార్టీ లీడర్, సిబిఐ మాజీ డైరెక్టర్ J.D.లక్ష్మీనారాయణ సైతం ఓటమి పాలయ్యాడు. వీళ్ళిద్దరూ ఎంత గొప్ప వ్యక్తులైనా జగన్ సునామీకి కొట్టుకు పోవాల్సి వచ్చింది. ఏది,ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెరుగున్న పరిణితి Tana సభలో అద్భుతంగా కనిపించింది.

జగన్ కు కెసియార్ అంటే అంత ముద్దెందుకు?

why-does-jagan-love-kcr-ap-political-reviews
కెసియార్ పై జగన్ కున్న ప్రేమ చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు ఆశ్చర్యమేస్తుంది. హైదరాబాద్ లోని ఆంధ్రా ఆస్తులను తెలంగాణాకు ఇచ్చేయడం, మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు అన్నింటిని కొట్టివేయడం, డిల్లీ లోని ఆంధ్రా భవన్ ను తెలంగాణాకు కేటాయించడం చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు వళ్ళు మండుతోంది. ఆంధ్రాకు బయట ఏవీ మిగలకుండా చేస్తున్నవాడు రేపొద్దున్న ఆంధ్రాలోని వాటిని కూడా ఉంచుతాడన్న నమ్మకం పోతోంది. దారుణం కాకపొతే మన పోలవరం నీళ్ళు తెలంగాణాకు ఇవ్వడమేమిటి? నక్కలమారి జిత్తు అయిన కెసియార్ కు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లొంగిపోయాడు. దీనికి ప్రధాన కారణం జగన్ పై ఉన్న కేసులే. ఎందుకంటే ఈ కేసులన్నీ ఆంధ్రా,తెలంగాణా కల్సి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటివే. ఇందులో ఎక్కువ కేసులు తెలంగాణాకే చెందుతాయి. కెసియార్ కు ఎదురు తిరిగితే ఆ కేసులన్నీ బయటికి ముమ్మరం చేసి జగన్ ను ఇరకాటంలో పడవేయడమే కాదు... అరెస్టుల వరకూ తీసుకువెళ్ళవచ్చు. దీని కారణంగా జగన్.. కెసియార్ ఏదంటే దానికే తలూపవల్సివస్తుంది. పోలవరం నీళ్ళు మేము వాడుకున్న తరువాతే రాయలసీమకు పడేస్తాం అన్నా జగన్ మాట్లాడకుండా ఉండాల్సిందే.  జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తన నవరత్నాల అమలుకు ఆంధ్రాలో నిధులు లేవని గగ్గోలు పెడుతున్న వైయస్సార్ సిపి, మరి మన ఆస్తులన్నీ తెలంగాణాకు ఎందుకు ధారభోస్తుంతో ఆంధ్రా ప్రజలే ఆలోచించాలి.

Friday, July 5, 2019

జనసేన నిలబడే ఉంటుందా? ఎందులోనైనా కల్సిపోతుందా?

మెగాస్టార్ చిరంజీవి గారి "ప్రజారాజ్యం" పార్టీ ఆవిష్కరణ సినిమా లెవెల్లో ప్రారంభమయ్యింది. ఏదో ఆంధ్రా రాజకీయాలను మలుపు తిప్పుతుందనుకుంటే మొత్తానికి ప్రజలెవరికీ కనిపించకుండా కాంగ్రెస్ లో కనుమరుగయ్యిపోయింది. మెగాస్టార్ చిరంజీవిగారు కేవలం కేంద్ర మంత్రి పదవికి లోబడిపోయి నమ్ముకున్న జనాలను, పార్టీ పట్టుకుని సహకరించిన పార్టీ అభ్యర్ధులను, కార్యకర్తలను నట్టేట ముంచేసి తను మాత్రం మంత్రి పదవిని ఎంజాయ్ చేసాడు. దీనికారణంగా చిరంజీవంటే ఆంధ్రా ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదు. నిజానికి ఆయన సినిమాల్లోనే ఉండాల్సింది. మెగాస్టార్ అన్న పేరు ఉండేది. ఆయన కుళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెట్టి, పార్టీని నిలబెట్టకుండా మూసేసినందుకు ఆయనగారు కాస్తా జీరోస్టార్ అయిపోయారు. చిరంజీవిగారుగాని "ప్రజారాజ్యం"పార్టీని మూసేయకుండా ఉంటే ఈరోజు ఆ పార్టీ తప్పనిసరిగా ఖ్యాతి సాధించి ఉండేది. చిరంజీవి సియం అయినా ఆశ్చర్య పోయే పరిస్థితి లేదు.

ఇప్పుడు ఆయనగారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు "జనసేన" పార్టీ అవిర్భింప జేశాడు. మెదటి దెబ్బకే ఏమాత్రం పవర్ లేకుండా ఎగిరిపోయింది. ఒక్క సీటు మినహా అన్ని సీట్లు నామరూపాలు లేకుండా ఎగిరిపోయాయి. పెద్ద విచిత్రమేమిటంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండూ చోట్లా ఓటమి పాలయ్యాడు. యూత్ క్రేజ్ అధికంగా ఉన్న అధ్యక్షుడి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇక అభ్యర్ధుల పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.

చిరంజీవిగారు పార్టీ పెట్టి "తెలుగుదేశం" పార్టీకి దెబ్బకోట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మళ్ళీ తెలుగుదేశానికే దెబ్బకోట్టాడు. పోనీ వీళ్ళేమైనా నిలబడతారా అనుకుంటే అంతా సందేహమే. అన్నగారిలా తమ్ముడు కూడా "జనసేన" పార్టీని కనుమరుగు చేసేస్తాడెమోనన్న అనుమానంలోనే ఆంధ్రా ప్రజలున్నారు.

రాజకీయాలనేవి ఎంతో ఇమేజ్ ఉన్న వ్యక్తులను సైతం ఎందుకూ పనికిరాని వ్యక్తులుగాను, విలువలేని మనుషులుగాను మార్చివేస్తాయి. చిరంజీవికి రాజకీయాల్లోకి రానప్పుడున్న ఇమేజ్, ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చాక పూర్తిగా పోగొట్టుకున్నాడు. రాజకీయ బురద,కంపు ఎన్ని రోజులైనా పోయే పరిస్థితి లేదు. మెగాస్టార్ కాస్తా జీరో స్టార్ గా మిగిలిపోయారు.

ఇకపోతే మన పవన్ కళ్యాణ్ కూడా అన్నగారిని చూసి జాగ్రత్త పడాలి. నష్టమైనా,కష్టమైనా పార్టీని నిలబెట్టుకుంటే ప్రజలు ఆయనకు పట్టం కడతారు. అందుకు తగ్గ పరిస్థితులు ఆంధ్రాలో కచ్చితంగా ఉన్నాయి. ముందు,ముందు చూద్దాం...పవన్ కళ్యాణ్ గారు "పవర్" స్టార్ గా నిలబడతారో లేక చివరికి డమ్మీ స్టార్ గా మిగిలిపోతారో!