Showing posts with label Political Reviews. Show all posts
Showing posts with label Political Reviews. Show all posts

Tuesday, November 19, 2019

తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?

తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?
will-telugu-desam-party-shut-down
తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? : మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కువుగా వినిపిస్తున్న మాట. ప్రస్తుత టిడిపి పరిస్తితి చూస్తుంటే ఈవార్తలన్నీ నిజమయ్యేలానే ఉన్నాయి. NTR కాలం నుండీ ఎన్నో సేవలందించిన టిడిపి పార్టీ ఇలా మటుమాయమవ్వడం ఒకింత ఆంధ్రా ప్రజలకు జీర్ణించుకోలేని విషయమే. నిజం చెప్పాలంటే ఎన్‌టి‌ఆర్ తరువాత టిడిపిని సక్రమంగా నడిపింది కేవలం చంద్రబాబు మాత్రమే! టిడిపి పార్టీని ఇంతకాలం ఇంత సక్సెస్ ఫుల్ గా నడిపే శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు తప్ప ఎన్‌టి‌ఆర్ పిల్లలకు గాని, కూతుర్లకు గాని, చంద్రబాబు మినహా మిగతా అల్లుళ్ళకు గాని లేవు. ఇది ప్రతివారికీ తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు తరువాత పార్టీని బ్రతికించుకుని ముందుకు తీసుకు వెళ్ళే సత్తా కూడా ఎవరికీ లేదు. ఆయన తనయుడు లోకేశ్ కూడా లేదు. వచ్చి ఏదో ఉద్దరిస్తాడని అనుకుంటున్న జూనియర్ ఎన్‌టి‌ఆర్ కు అసలే లేదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఎవరి రంగం వారిదే. ఏ రంగానికి సంబంధించిన వారు ఆ రంగంలోనే రాణించగలరు తప్ప మరొక రంగంలో రాణించడం చాలా కష్టమే. చివరికి ప్రజలు కూడా ఏ రంగంలో వారిని ఆ రంగంలోనే చూస్తారు తప్ప మరొక రంగంలో చూడరు. ఈ విషయం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల విషయంలో నెరవేరడం మనం చూసాం కదా ? మరి జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎలా రాణించగలడు? మరొక కోణంలో చూస్తే జూనియర్ ఎన్‌టి‌ఆర్ కంటే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువ..అయినప్పటికీ 2019 ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వచ్చాయో మనకు తెలుసు కదా? ఆఖరికి పోటీ చేసిన రెండు చోట్లా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీన్ని బట్టన్నా మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు సినిమా హీరోలనూ, రాజకీయ నాయకులనూ కలిపి చూడలేరని. ఇవి ఎన్‌టి‌ఆర్ ఉన్నప్పటి రోజులు కావు.

Tuesday, November 12, 2019

జగన్ పై నేషనల్ మీడియా అటాక్ | National Media Attack On CM YS Jagan

 జగన్ పై నేషనల్ మీడియా అటాక్ | National Media Attack On CM YS Jagan

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.

pawan-kalyan-is-not-personally-targeted-ap-political-reviews

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.

రాజకీయాలలో అధికార పక్షాన్ని, విపక్షాలు విమర్శించడం, విపక్షాలను అధికార పక్షం వాళ్ళు విమర్శించడం సర్వ సాధారణమైన విషయం. అధికార పక్షo వారి లోపాలను విపక్షాలు,ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తే వాటిని సరిదిద్దుకుని పాలన అందిoచాల్సిన బాధ్యత అధికార పక్షం వారిపై ఉంది.

అంతేగాని లోపాలను ఎత్తిచూపించినవారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. అదీ కూడా సీయం హోదాలో ఉన్న వ్యక్తి అసలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి జగన్ గారు పవన్ భార్యలను,పిల్లలను టార్గెట్ చేసి విమర్శించడం ఏమాత్రం సమoజసం కాదు.

Saturday, November 9, 2019

Thursday, November 7, 2019

జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ.... | Jagannanna Amma odi plan is great! But ....

జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ....అది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుండును. ఈ పధకాన్ని ప్రైవేట్ స్కూళ్లకు కూడా అమలు చేయడం వలన ఇప్పటికే విధ్యార్ధుల లేమితో కొనసాగుతున్న ప్రభుత్వ స్కూళ్ళు క్రమేపీ మూతబడిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలు మరింత పెరిగిపోతాయి. ఈ పధకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే అమలు పర్చడం వలన అవి కళకళలాడటంతో పాటు ఎంతోమంది పేదవారికి తమ పిల్లల వలన ప్రయోజనం చేకూరుతుంది. తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి ముందుకొస్తారు. కాబట్టి అమ్మఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అర్హత కలిగియున్నాయి. ఎందుకంటే సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వడం అంటే అదంతా మన పన్నుల రూపంలో వసూలు చేయబడిన ప్రజల సోమ్మే కదా? దానిని విద్యను భారీ వ్యాపారం చేసుకున్న ప్రవేట్ యాజమాన్యాలకు ధారబోయడం అన్యాయమే అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్ధులకు ఇవ్వడమంటే ప్రైవేట్ విద్యా వ్యాపారులను ప్రోత్సాహించడమే. ఈ విషయాన్ని మన జగన్ గారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే బాగుoటుంది. దీనికి మీరేమంటారు?

Friday, November 1, 2019

అక్రమాస్తుల కేసులో దోషిగా కోర్టు చుట్టూ తిరగాల్సిన జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అతను సియం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా?

does-jagan-get-post-of-chief-minister-of-the-state
అక్రమాస్తుల కేసులో దోషిగా కోర్టు చుట్టూ తిరగాల్సిన జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అతను సియం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా?

Wednesday, October 30, 2019

మన ఆంధ్రాలో ఇసుక కొరత తీరదా? ఇసుక కుట్రకు బాధ్యులెవరు? | Is there a shortage of sand in Andhra Pradesh? Who is responsible for the sand conspiracy?

అసలు రాష్ట్రంలో ఇసుక కొరత ఏమంత లేదు అన్న అధికార పక్షం వాళ్ళు, ఇసుక కొరతపై సరైన పోరాటం చేయని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇతర పార్టీ నాయకులు ఈక్రింది వీడియోలు చూడాల్సిందే!

ఇసుక వల్ల ఉపాధి కోల్పోయామని గగ్గోలు పెడుతున్న జనం.

జగన్ కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న శ్రమ కార్మికుడు

రాష్ట్రంలో ఇసుక ఎక్కడికి తరలిపోతుంది.?
ప్రక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక ట్రాక్టరును పట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు.

కేవలం ఇసుక వలన నిర్మాణ రంగాలన్నీ ఆగిపోయాయి. శ్రమ కార్మికులందరూ రోడ్డున పడిపోయారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. కనీసం అన్నా కేంటీన్లు ఉన్నా 5రూపాయల భోజనంతో కడుపు నింపుకునేవాళ్ళమని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. చివరికి ముద్ద పెట్టె అన్నా కేంటీన్లు కూడా మూసివేసినందుకు ప్రజలందరూ జగన్ ను దుయ్యబడుతున్నారు.

Friday, October 25, 2019

ఆర్టీసీ పట్ల కేసీయార్ కు అంత కసి ఎందుకు?

why-is-kcr-leaning-towards-rtc
కేసీయార్ కు తెలంగాణ ఆర్‌టి‌సి అంటే ఏమాత్రం గౌరవం లేదు. దానిని ఎలాగైనా రూపు మాపి ఆర్‌టి‌సి మొత్తాన్ని ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు ధారబోయాలని చూస్తున్నాడు. కొన్ని రాష్ట్రాలో ఎలానూ ఆర్‌టి‌సి లేదు మన తెలంగాణాలో ఎందుకన్న అతని భావన దారుణం అనిపిస్తోంది. సమ్మె ముగింపే ఆర్‌టి‌సి ఖతమన్న కేసీయార్ ఆలోచనా ధోరణి ఎంత ప్రమాదకరమో తెలంగాణా ప్రజలే ఆలోచించుకోవాలి.

జగన్ 2 లక్షలకు పైగా ఉద్యోగులను తీసేసాడు

Saturday, October 19, 2019

వైసీపీ, బిజెపిలది పైకి శత్రుత్వ నటన. లోపలంతా దోస్తీనే!... పాపం టిడిపి?

వైసీపీ, బిజెపిలది పైకి శత్రుత్వ నటన. లోపలంతా దోస్తీనే!... పాపం టిడిపి?

Wednesday, October 16, 2019

Monday, October 7, 2019

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం తెలంగాణాలో సరికానప్పుడు.. ఆంధ్రాలో కరెక్ట్ ఎలా అవుతుంది? | When RTC government merger is not correct in Telangana .. How to Correct in Andhra Pradesh?

ఆంధ్రా సియం జగన్ తీసుకున్న నిర్ణయం.. ఆంధ్రా ప్రజల బ్రతుకుపై పెనుభారం పడదా?
మన ఆంధ్రా మంత్రివర్యులు పేర్ని నాని గారు హైదరాబాద్ బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు? అక్కడ తెలంగాణాలో ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తుంటే కేసీయార్ కు సహకరించడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఆంధ్రాలో ఆర్టీసీని విలీనం చేసిన జగన్ గారి ప్రభుత్వం అక్కడ తెలంగాణాలో ఆర్టీసీకి మద్దతు పలికి కేసీయార్ పై వత్తిడి తేవాలి కదా? కేసీయార్ ఆంధ్రాను ముంచేయాలన్నదే ప్రధాన లక్ష్యం. జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఆంధ్రా ఆర్టీసీని చూసి తెలంగాణ ఆర్టీసీ రంగంలోకి దిగేటప్పటికి పాపం కేసీయార్ క్రిందా,మీదా పడుతున్నాడు. మనసులో జగన్ను తిట్టుకుంటూనే ఉంటాడు.
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ గారి అభిప్రాయం వినండి.

Wednesday, September 11, 2019

ఆంధ్రా రాష్ట్ర నాశనం కొరకు ప్రజలు ఎన్నుకున్న సియం జగన్!

మద్యపాన నిషేధం, ఇకపై మందు ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఎక్కడా, సామాన్యులకు దొరకదు, ఈసారి వచ్చే ఎలక్షన్లలో పూర్తి మద్యాన్ని నిషేధించే ఓట్లు అడుగుతానంటూ నవరత్నాలు బోధించిన వైయస్ జగన్ ఇప్పుడు చేస్తున్నదేమిటి? చదువుకున్న విద్యార్థులతో మద్యం అమ్మకాలా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది.? మద్యం షాపు దరిదాపుల్లోనే తమ సంతానం వెళ్తే జీవితాలు నాశనం చేసుకుంటారన్న భయంతో తల్లిదండ్రులున్న ఈ పరిస్థుతులలో వాళ్ళ చేతే మద్యం అమ్మకాలు చేపట్టాలనుకున్న జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏం చేయాలి?

Thursday, July 11, 2019

KCR వ్యతిరేకులను సైతం తలలు వంచేలా లొంగదీసుకునే ఘటికుడు.

kcr-he-is-also-leader-of-kcr-opponents
ఆంధ్రావాడై యుండి తెలంగాణా సియంను పోగుడుతున్నాడేమిటి? అనుకోవద్దు. ఈమాట యదార్ధం కాబట్టే చెపుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఆంధ్రా భారీగా నష్టపోతుందని, ఇండియా-పాకిస్తాన్ ల మాదిరి తెలంగాణ,ఆంధ్రాలు ఏర్పడతాయని చంద్రబాబు గవర్నమెంట్ లో గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నే ఓపిన్ చేయించాడు. ఇదీ కెసియార్ ఘటికతనమంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ముందు తీవ్రంగా వ్యతిరేకించాను... ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపినింగుకు వెళ్తే ఆంధ్రా ప్రజలు ఏమనుకుంటారోనన్న ఆలోచన కూడా లేకుండా జగన్ ను తయారుచేయడం కెసియార్ గొప్పతనమనే చెప్పాలి. రేపొద్దున్న ఏమాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా భారీ ఫెయిల్ అయినా ఇదంతా ఆంధ్రావాడి దరిద్రం వల్లనే జరిగిందనే నీచపు మాటలు కెసియార్ పలకకుండా ఉండడు. ఇదంతా కెసియార్ ను గుడ్డిగా నమ్ముతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు తెలుసుకుంటే మంచిది.

Wednesday, July 10, 2019

జగన్ కు కెసియార్ అంటే అంత ముద్దెందుకు?

why-does-jagan-love-kcr-ap-political-reviews
కెసియార్ పై జగన్ కున్న ప్రేమ చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు ఆశ్చర్యమేస్తుంది. హైదరాబాద్ లోని ఆంధ్రా ఆస్తులను తెలంగాణాకు ఇచ్చేయడం, మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు అన్నింటిని కొట్టివేయడం, డిల్లీ లోని ఆంధ్రా భవన్ ను తెలంగాణాకు కేటాయించడం చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు వళ్ళు మండుతోంది. ఆంధ్రాకు బయట ఏవీ మిగలకుండా చేస్తున్నవాడు రేపొద్దున్న ఆంధ్రాలోని వాటిని కూడా ఉంచుతాడన్న నమ్మకం పోతోంది. దారుణం కాకపొతే మన పోలవరం నీళ్ళు తెలంగాణాకు ఇవ్వడమేమిటి? నక్కలమారి జిత్తు అయిన కెసియార్ కు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లొంగిపోయాడు. దీనికి ప్రధాన కారణం జగన్ పై ఉన్న కేసులే. ఎందుకంటే ఈ కేసులన్నీ ఆంధ్రా,తెలంగాణా కల్సి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటివే. ఇందులో ఎక్కువ కేసులు తెలంగాణాకే చెందుతాయి. కెసియార్ కు ఎదురు తిరిగితే ఆ కేసులన్నీ బయటికి ముమ్మరం చేసి జగన్ ను ఇరకాటంలో పడవేయడమే కాదు... అరెస్టుల వరకూ తీసుకువెళ్ళవచ్చు. దీని కారణంగా జగన్.. కెసియార్ ఏదంటే దానికే తలూపవల్సివస్తుంది. పోలవరం నీళ్ళు మేము వాడుకున్న తరువాతే రాయలసీమకు పడేస్తాం అన్నా జగన్ మాట్లాడకుండా ఉండాల్సిందే.  జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తన నవరత్నాల అమలుకు ఆంధ్రాలో నిధులు లేవని గగ్గోలు పెడుతున్న వైయస్సార్ సిపి, మరి మన ఆస్తులన్నీ తెలంగాణాకు ఎందుకు ధారభోస్తుంతో ఆంధ్రా ప్రజలే ఆలోచించాలి.

Friday, July 5, 2019

జనసేన నిలబడే ఉంటుందా? ఎందులోనైనా కల్సిపోతుందా?

మెగాస్టార్ చిరంజీవి గారి "ప్రజారాజ్యం" పార్టీ ఆవిష్కరణ సినిమా లెవెల్లో ప్రారంభమయ్యింది. ఏదో ఆంధ్రా రాజకీయాలను మలుపు తిప్పుతుందనుకుంటే మొత్తానికి ప్రజలెవరికీ కనిపించకుండా కాంగ్రెస్ లో కనుమరుగయ్యిపోయింది. మెగాస్టార్ చిరంజీవిగారు కేవలం కేంద్ర మంత్రి పదవికి లోబడిపోయి నమ్ముకున్న జనాలను, పార్టీ పట్టుకుని సహకరించిన పార్టీ అభ్యర్ధులను, కార్యకర్తలను నట్టేట ముంచేసి తను మాత్రం మంత్రి పదవిని ఎంజాయ్ చేసాడు. దీనికారణంగా చిరంజీవంటే ఆంధ్రా ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదు. నిజానికి ఆయన సినిమాల్లోనే ఉండాల్సింది. మెగాస్టార్ అన్న పేరు ఉండేది. ఆయన కుళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెట్టి, పార్టీని నిలబెట్టకుండా మూసేసినందుకు ఆయనగారు కాస్తా జీరోస్టార్ అయిపోయారు. చిరంజీవిగారుగాని "ప్రజారాజ్యం"పార్టీని మూసేయకుండా ఉంటే ఈరోజు ఆ పార్టీ తప్పనిసరిగా ఖ్యాతి సాధించి ఉండేది. చిరంజీవి సియం అయినా ఆశ్చర్య పోయే పరిస్థితి లేదు.

ఇప్పుడు ఆయనగారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు "జనసేన" పార్టీ అవిర్భింప జేశాడు. మెదటి దెబ్బకే ఏమాత్రం పవర్ లేకుండా ఎగిరిపోయింది. ఒక్క సీటు మినహా అన్ని సీట్లు నామరూపాలు లేకుండా ఎగిరిపోయాయి. పెద్ద విచిత్రమేమిటంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండూ చోట్లా ఓటమి పాలయ్యాడు. యూత్ క్రేజ్ అధికంగా ఉన్న అధ్యక్షుడి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇక అభ్యర్ధుల పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.

చిరంజీవిగారు పార్టీ పెట్టి "తెలుగుదేశం" పార్టీకి దెబ్బకోట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మళ్ళీ తెలుగుదేశానికే దెబ్బకోట్టాడు. పోనీ వీళ్ళేమైనా నిలబడతారా అనుకుంటే అంతా సందేహమే. అన్నగారిలా తమ్ముడు కూడా "జనసేన" పార్టీని కనుమరుగు చేసేస్తాడెమోనన్న అనుమానంలోనే ఆంధ్రా ప్రజలున్నారు.

రాజకీయాలనేవి ఎంతో ఇమేజ్ ఉన్న వ్యక్తులను సైతం ఎందుకూ పనికిరాని వ్యక్తులుగాను, విలువలేని మనుషులుగాను మార్చివేస్తాయి. చిరంజీవికి రాజకీయాల్లోకి రానప్పుడున్న ఇమేజ్, ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చాక పూర్తిగా పోగొట్టుకున్నాడు. రాజకీయ బురద,కంపు ఎన్ని రోజులైనా పోయే పరిస్థితి లేదు. మెగాస్టార్ కాస్తా జీరో స్టార్ గా మిగిలిపోయారు.

ఇకపోతే మన పవన్ కళ్యాణ్ కూడా అన్నగారిని చూసి జాగ్రత్త పడాలి. నష్టమైనా,కష్టమైనా పార్టీని నిలబెట్టుకుంటే ప్రజలు ఆయనకు పట్టం కడతారు. అందుకు తగ్గ పరిస్థితులు ఆంధ్రాలో కచ్చితంగా ఉన్నాయి. ముందు,ముందు చూద్దాం...పవన్ కళ్యాణ్ గారు "పవర్" స్టార్ గా నిలబడతారో లేక చివరికి డమ్మీ స్టార్ గా మిగిలిపోతారో! 

Saturday, June 29, 2019

ఆంధ్రా, తెలంగాణాలను బిజెపి హస్తగతం చేసుకునే అవకాశం ఉందా? |Is BJP likely to take over Andhra and Telangana?

is-bjp-likely-to-take-over-andhra-and-telangana
ఈమధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఊహలకు అందనంతగా మలుపులు తిరుగుతున్నాయి. ఆంధ్రాలో తిరుగులేని పార్టీగా ఉంటుందనుకున్న తెలుగుదేశం పార్టీ బిజెపి కుట్రలకు ఘోరంగా బలయిపోయింది. కేంద్ర సహకారంతో YSRCP రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. మళ్ళీ ఆంధ్రరాష్ట్రంలో TDP నే వస్తుందనుకున్న ప్రజలకు YSRCPకి అంత మెజారిటీ ఎలా వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. జనసేన అయితే 99.99% తుడుచుపెట్టుకు పోయింది. అత్యంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఎలక్షన్ నిర్వహణలో ఏదో గోల్ మాల్ జరిగిందన్న అనుమానాలు అందరికీ కలుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ఇంత పెద్ద భారీ మోసం బయటపడక తప్పదు. ఎందుకంటే కేవలం 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమయ్యే చెత్త పరిపాలన టిడిపి కలిగిలేదు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు బాగానే చేసుకు వచ్చాడు. ఒకవేళ టిడిపి అధికారం కోల్పోవాల్సివచ్చినా ఇంత దారుణమైన ఓటమి మాత్రం రాదు. EVM లలో ఏదో జరిగే ఉంటుంది.

అసలు తెర వెనుక ఏదో జరుగుతోంది.
బిజెపి తెలుగు రాష్ట్రాలను కబళించాలని చూస్తోంది. తన పూర్తి పట్టు సాధించాలని ప్రయత్నం ముమ్మరం చేస్తోంది. ముందుగా ఆంధ్రాలో బలమైన పార్టీ గా ఉన్న టిడిపిని కకావికలం చేసేసింది. ఇప్పటికే నలుగురు MP అభ్యర్ధులు బిజెపికి సరెండ్ అయిపోయారు. మిగతా వాళ్ళపై వేట ప్రారంభమవుతుంది. నేటి రాజకీయ నాయకుల్లో విలువల కంటే స్వార్ధాలు ఎక్కువ కాబట్టి ఓడిన పార్టీలోని ఒక్కొక్కడూ అధికార పార్టీలోకి జంప్ అవుతూనే ఉంటారు. ఈవిధంగా బిజెపి కావాల్సిన ముఖ్యమైన అభ్యర్దులనందరినీ తనలోకి లాగేసుకున్నాక తదుపరి టార్గెట్ అధికార పార్టీనే. జగన్ ఎలాగూ కేసుల మధ్య తిరుగుతున్నాడు కాబట్టి అతనిని లొంగదీసుకోవడం లేక జగన్ పార్టీని తనలోకి విలీనం చేసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

ఇకపోతే తెలంగాణ విషయం...
ఒకవిధంగా చూస్తే తెలంగాణాలో KCR తిరుగులేని నాయకుడు. బిజెపి TRSను ఎదురుకోవడం పెద్ద కష్టతరమే. చంద్రబాబులాగ కేసీయార్ కూడా కొరుకుడు పడని కేండిట్టే. అయితే క్రమేపీ తెలంగాణలో కూడా బిజెపి కొంచెం,కొంచెం పుంజుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ కూడా బలమైన స్థితిలోనే ఉంది. ఇటువంటి స్థితిలో తెలంగాణాను హస్తగతం చేసుకోవడం బిజెపికి చాలా కష్టతరమనే చెప్పాలి.

అసలు విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు ఉన్న బలం జాతీయ పార్టీలకు ఉండదు. ప్రజలు ప్రాంతీయ పార్టీల వారికే ఎక్కువ మక్కువ చూపిస్తారు. తెలంగాణలో బిజెపికి కొద్ది ఓటింగ్ ఉన్నా కొన్ని సీట్లు సంపాదించగలిగినా, ఆంధ్రాలో మటుకు బిజెపికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థులలో తెలుగు రాష్ట్రాలను బిజెపి హస్తగతం చేసుకోవడం అసాధ్యమనే చెప్పాలి. చివరికి ఏపార్టీ అయినా ప్రజల అభిమానం ఉన్నంతవరకే భవిష్యత్ ను కలిగియుంటాయన్నది జగమెరిగిన సత్యం.

దీనిపై నా బ్లాగు వీక్షకులను స్పందనను అడుగుతున్నాను.