Showing posts with label Articles. Show all posts
Showing posts with label Articles. Show all posts

Tuesday, April 20, 2021

షర్మిల CM అయితే... తెలంగాణాకు ఆంధ్రా గతే పడుతుందా?

 షర్మిల CM అయితే... తెలంగాణాకు ఆంధ్రా గతే పడుతుందా?

ప్రొఫెసర్ నాగేశ్వరరావుగారి మహాన్యూస్ ఇంటర్వూలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. 

జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడానికి వెనుకున్నది జగన్,బిజెపి పార్టీలే అన్నఅభిప్రాయం నాకు నిజమే అనిపించింది... ఎందుకంటే ఇప్పుడున్న కేసీయార్ పార్టీ తెరాస ను ఓడించడం ఎవరితరం కాదు. కాంగ్రెస్ గాని, బిజెపిగాని, ఇతర పార్టీలుగాని ఏవీ ఎంత ప్రయత్నం చేసినా అడ్డుకోలేవు. మహా అయితే TRSకు కొద్దిగా ఓటింగ్ శాతాన్ని తగ్గించగలరేమో అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేవు. ఎందుకంటే బిజెపి ఆంధ్రా పట్ల, దేశం పట్ల వ్యవరిస్తున్న ప్రైవేటీకరణ సిద్ధాంతాన్ని చూసి తెలంగాణా ప్రజలు అసలు నమ్మరు. ఇకపోతే కాంగ్రెస్ కు పూర్తిగా గ్రూపు కుమ్ములాటతో బలహీనపడిపోయింది.

ఇటువంటి పరిస్థుతులు ఉన్నప్పుడు కొత్తపార్టీ ఉనికిలోకి తీసుకొస్తే TRS ను గద్దె దించడం సులువు అవుతుంది. ఎందుకంటే TRS ఓటింగ్ ను కొత్తపార్టీ మాత్రమే భారీగా కొల్లగోట్టగలదు.

ఈవిషయం దృష్టిలో పెట్టుకుని షర్మిలను రంగంలోకి దించారు. నా అభిప్రాయం ప్రకారం ఇది ఎప్పటినుండో ప్లానింగ్ లో ఉంది. ఈవిషయం కెసియార్ కి గ్రహించకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డిగారు కెసియార్ తో మిత్రబంధం పెట్టుకున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆంధ్రాలో బిజెపికి మిత్రపక్షమైన వైసిపి, తెలంగాణాలో TRS కు ఎలా మిత్ర పార్టీ అవుతుంది.? అక్కడ తెరాస బిజెపికి వ్యతిరేక పార్టీ కదా?

కెసియార్ ఆంధ్రా పట్ల గుంటనక్క వేషాలు వేసి సర్వనాశనం అవడానికి కుట్రలు పన్నేవాడు. కాని ఆంధ్రా తరువాత బిజెపి చేతికి చిక్కే జింక పిల్ల తెలంగాణ అన్న విషయం గ్రహించలేకపోయాడు.

నాలుగు దారులు మూసి చంద్రబాబును పడగొట్టి వైసిపిని అధికారంలోకి తీసుకురావడానికి కారణం బిజెపికి జగన్ అంటే ప్రేమ కాదు. ప్రయోజనం. చంద్రబాబు అయితే బిజెపి ఆటలు ఆంధ్రాలో సాగవు. నెత్తి మీద కేసులున్న జగన్ అయితేనే చెప్పుచేతల్లో పెట్టుకోవచ్చు.

జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి ప్రత్యేక హోదా ఎగరగొట్టింది. పోలవరాన్ని ముంచేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టగలిగింది. విజయవాడ రైల్వే జంక్షన్ ను హోల్ సేల్ పెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతోంది. ఇలా ఒకటేమిటి అనేకం... కాబోతున్నాయి. ఇది ఆంధ్రాది అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేసేయడం ఖాయం.

తరువాత వంతు తెలంగాణాదే... బిజెపి ముక్కుపుటాలకు హైదారాబాద్, సింగరేణి రుచులు బాగా తాకుతున్నాయి. ఆరగించాలంటే వడ్డించేవారు కావాలి. దానికి బిజెపి ఎన్నుకున్న వ్యక్తే షర్మిల. 

బిజెపికి భయపడే జగన్ షర్మిలలు నడుచుకుంటున్నారు. ఎందుకంటే దోచుకున్న ఆస్తికి మీ ఇద్దరు వారసులుగా ఉన్నారు కదా అని బిజెపి అన్నా,చెల్లెళ్ళను మూసేయడం పెద్ద విషయం కాదు. 

ఇదంతా బిజెపి ఎందుకు చేస్తుందంటే ఈ తెలుగు రాష్ట్రాలు రెండూ తమ చేతుల్లోనే ఉండాలి. తమ దగ్గరే బ్రతకాలి. స్వయంగా బ్రతికే చాన్స్ వీటికి ఉండకూడదు. అలా జరగాలంటే తెలుగు రాష్ట్రాలకు ఆర్ధిక మూలాలు ఉండకూడదు. ఇది జరగడానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బిజెపికి సహకరించడానికి దానికంటే మహా ముదురులకు కొదువే లేదు.

Friday, July 10, 2020

Chandrababu's weaknesses ... strengths for rivals | చంద్రబాబు బలహీనతలే... ప్రత్యర్ధులకు బలాలు

చంద్రబాబు బలహీనతలే... ప్రత్యర్ధులకు బలాలు

Chandrababu's weaknesses ... strengths for rivals
దేశ ముఖ్యమంత్రులలో నెంబర్ వన్ ఎవరంటే... "శ్రీ నారా చంద్రబాబు నాయుడు" అనడంలో అతియోశక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న దార్శనికత అంత గొప్పది. ఏపని చేసినా భవిష్యత్ ఉపయోగార్ధం.. అభివృద్ధి వైపు పరుగులు దీసే విధంగా ఉంటాయి. ఆయనకున్న శత్రులు సైతం ఒప్పుకున్న విషయమిది.

ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఎక్కడైనా చంద్రబాబు అభివృద్ధే కనిపిస్తుంది. సంపాదనను సృష్టించే పనులు చేయడం ఆయనకే సాధ్యమయింది. ఆయనకున్న మేధావితనం చూసినవాళ్లు అదే రాజకీయ రంగంలో ఉన్నందుకు ఈర్షా, అసూయలతో రగిలిపోయి ఉండటం సహజమే.. అయితే చంద్రబాబు గారి సున్నిత మనస్తత్వం, తన పని తప్ప విమర్శల జోలికి పోకపోవడం ఆయన ప్రత్యర్ధులకు వరంగా మారింది. అందుకే " నీయమ్మ మొగుడు.. నీవు చస్తే బాగుణ్ణు" లాంటి అతి నీచమైన మాటలు సైతం బడానాయకుల నుండి.. ఛోటా నాయకుల వరకూ అనగలుతున్నారు.