Janasena with BJP | బిజెపితో పొత్తు జనసేనకు నష్టం కాదా? |
మరొక ముఖ్య విషయమేమిటంటే అనుభవలేమీతనం వలన ఎన్ని ముంపులకు గురి కావాల్చి వస్తుందో జగన్ వలన ఆంధ్రా ప్రజలకు బాగా తెలిసొచ్చింది. జగన్ అయితే తన తండ్రి అయ్యాంలో MP గా చేశారు. పవన్ అయితే కనీసం వార్డు మెంబర్ గా కూడా చేయలేదు... డైరెక్ట్ సియంను చేస్తే ఆంధ్రా పరిస్తితి ఏమిటి? జగన్ అంత క్రూరత్వం పవన్ లో ఇచుమంతా అయినా లేకపోయినా తొందరగా ఆవేశ పడిపోవడం, లేనిపోని విషయాలు త్వరగా నమ్మి రియాక్ట్ అయ్యిపోవడం పవన్ బలహీనతలు. ఇవి కూడా సియం పదవికి అనర్హాలే!, జగన్ ముఖ్యమంత్రి అయ్యి కేసీయార్ పై ఆధారపడినట్లు, పవన్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రా బిజెపి నాయకులపై ఆధారపడవల్సివస్తుంది.
ఏది, ఏమైనా జనసేనకు బిజెపి కంటే టిడిపి తో ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. చంద్రబాబు గారి అపూర్వ పాలనా దక్షతకు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడైతే ఇప్పటివరకూ మొలకెత్తిన విష కోరలను తొలగించి ఆంధ్రాను అభివృద్ధి పదం వైపునకు నడిపించవచ్చు. దీనికి మీరేమంటారు?
పాపం దత్తపుత్రుడు, చివరికి పావలా పాకేజీ స్టారుగానే మిగుల్తాడో ఏందో!
ReplyDeleteఆయన పనులన్నీ అలాగే ఉన్నాయి జైగారు.
Deleteఏమిటో పవన్ కళ్యాణ్ రాజకీయం అంతా తికమకగా ఉంది. ప్రత్యేక హోదా కోసం బిజెపిపై పడిన పవన్ ఇప్పుడు అకస్మాత్ గా బిజెపితో జత కట్టడం ఏమిటి? ఈయన పూర్తిగా అర్ధం కాకే ఆయన అభిమానులు సైతం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు. పవన్ లో హడావుడి తప్ప ఏమీ లేదు. వైయస్సార్ చేతిలో తన్నులు తిన్న తన కార్యకర్తలను పరామర్శించి వెళ్లిపోయాడు తప్ప దెబ్బలు తిన్నవారికోసం చేసిందేమీ లేదు కాకినాడలో. పవన్ది అంతా గందరగోళ రాజకీయం.
ReplyDeleteపవనుడు ఎవరైనా అనుభవజ్ఞుడైన రాజకీయ సలహాదారును / strategist / ఎందుకు నియమించుకోవడం లేదు?
ReplyDeleteనాచబానా ఉన్నాడుగా సలహాదారుగా.. ఇక వేరే ఎవరో ఎందుకు.
Deleteపవన్ తను బయట కూడా హీరోనే అని భ్రమల్లో బతుకుతుంటాడు. "తను తప్పితే ఎవ్వరూ కనిపించకూడదు" అనేది తన స్ట్రాటర్జీ.
@విన్నకోట నరసింహా రావు:
Delete2009 ప్రరాపా అనుభవం అట్లాంటిది. అప్పట్లో చిరంజీవి ఎంబడి ముగ్గురు పెద్ద తలకాయలు (కత్తి పద్మారావు, పరకాల ప్రభాకర్, డా. మిత్ర) నిలిచారు. వాళ్ళు ఉన్నది కొద్దినాళ్లే అయినా, ఉన్నన్నాళ్ళు తలా ఒక దారికి గుంజి బండిని ఆగం పట్టించారు, చివరికీ వెళ్తూ వెళ్తూ బూతులు తిట్టుకుంటూ పోయారు.
ఆ చేదు అనుభవాన్ని కళ్లారా చూసిన పవనాలు సారు సీక్వెల్ తీసేటప్పుడు ఆ కలగూరగంప వద్దు, 40 ఏళ్ల అనుభవం ఉన్న డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయితే మేలని అనుకున్నట్టు ఉంది. దెబ్బకి మొదటి బొమ్మలో వచ్చిన ఆమాత్రం బిలో అవేరేజీ కలెక్షన్లు కాస్తా రెండో అవతారంలో అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది.
ఇవన్న్నీ చూస్తుంటే మీ(మా) సినీ వినీలాకాశ లీలలు గురించి అతనెవరో మహామేధావి (బచ్చల రాజు రవితేజ్ కాదు) రాసిన తత్త్వం గుర్తుకొస్తుంది: "చిత్రాలు తీయరో శివుడో శివుడా, జనం సిత్రాలు చూడరో నరుడో నరుడా"
చెంగు వీరుడు అన్న పదం చెంగున దూకిన పవనయ్యకు సరిపోతుంది. ఎందుకు పాపం ఈ రాజకీయాల్లోకి వచ్చాడో అర్థం కావడం లేదు. కళ్ళముందు అన్నయ్య అనుభవం కనిపిస్తోంది కదా. ఒక పరిణితి చెందిన నటుడుగా మారుతున్న సమయంలో తప్పు నిర్ణయం తీసుకున్నాడు.
ReplyDeleteపూర్తిగా బిజెపి లో కలిపి వేయడం మంచిది. ఒక స్థిరమైన విధానం లేదు. ఆలోచనలు కలగా పులగం గందర గోళం.
పూనకం ఉపన్యాసాలు వీడియోలు ఒక్కసారి తాను తిరిగి చూసుకుంటే బాగుంటుంది.
మనిషిలో ఏదో చేయాలి అనే తపన కనిపిస్తుంది.
Better for him to merge with BJP and either continue with BJP or quit politics.