Saturday, August 1, 2020

Sabbam Hari Reaction On Green Signal to AP 3 Capitals Bill and Pawan Kalyan | అమరావతిని చంపేసిన బిజెపి, వైసీపీ, జనసేన పార్టీలు | AP Political Reviews


Sabbam Hari Reaction On Green Signal to AP 3 Capitals Bill and Pawan Kalyan | అమరావతిని చంపేసిన బిజెపి, వైసీపీ, జనసేన పార్టీలు | AP Political Reviews

tdp 3TDP Ex MP Sabbam Hari, TDP Ex MP Sabbam Hari Reaction, TDP Ex MP Sabbam Hari Reaction On Green Signal to AP 3 Capitals Bill, Green Signal to AP 3 Capitals Bill, Pawan KalyanTDP Ex MP Sabbam Hari Reaction On Green Signal to AP, 3 Capitals Bill and Pawan Kalyan, AP3Capitals BillPassed, #APGovernor Approved Capitals Bill, subbam hari about ap 3 capitals bill approved, sabbam hari reaction on ap 3 capitals bill, sabbam ahari about pawan over capital bill, capital billjanasena, abn live


42 comments:

  1. నేను అనుకున్నది నిజమే అయింది.
    పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి డ్రామా ఆడుతున్నాడన్నది బయట పడింది. ఎలక్షన్స్ కు ముందు అమరావతి పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, తరువాత మద్దతుగా మాట్లాడటం.. అది అమరావతి రైతులు నమ్మటం వారి అమాయకత్వం. మెగా ఫ్యామిలీ రాజకీయాలకు పనిచేయరు వెండి తెరలపై బిల్డప్ లు ఇవ్వడానికి తప్ప.

    జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయడం మొదలు పెడితే తప్పనిసరిగా జగన్ కు రాజకీయ అభివృద్ధి ఉండేది. ఆయా ప్రాంతాలు కూడా ఆయనకే బాసటగా నిలిచి యుండేవి. కానీ ఈ మూడు రాజధానుల నిర్ణయంతో భారీ దెబ్బనే అనుభవించవల్సి వస్తుంది.

    మొత్తానికి బిజెపి,జనసేన,వైసీపీలు కల్సీ ఆంధ్రాను అనగదొక్కేశారు.

    ReplyDelete
    Replies
    1. అమరావతి రాజధాని కాదని ఎవరన్నారండీ? దానితోబాటు ఇంకో రెండిటిని కూడా చేశారు. ఇందులో అమరావతి రైతులుకు జరిగే అన్యాయమేమిటో నాకు ఇంతవరకు అర్ధం కాలేదు. మీరు స్టాటిస్టిక్స్ తో ఏమైనా చెప్పగలిగితే అర్ధమౌతుందేమో.

      Delete
    2. https://telugu.greatandhra.com/articles/special-articles/bramaravathi-story-110328.html

      రాజధాని విషయం గురించి పై ఆర్టికల్ బాగా వ్రాశారు. వీలైతే చదవండి.

      చిరు గారు

      Delete
    3. రైతులకు జరుగుతున్న అన్యాయమేంటో అని నేను చూస్తే, పచ్చ బాకాలకు జరుగుతున్న అన్యాయం రాశారేంటి బుచికిగారూ?

      Delete
    4. రైతులకు తప్పక న్యాయం జరుగుతుంది. దురాశా పూరిత పచ్చ పెట్టుబడి దారులకు ఆశాభంగం తప్పదు.


      పై వ్యాసం లో విశ్లేషణ బాగుంది అనిపించి లింక్ ఇచ్చాను చిరు గారు.

      Delete
    5. >>రైతులకు తప్పక న్యాయం జరుగుతుంది

      అసలేం అన్యాయం జరిగింది?

      Delete
    6. రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే ఇపుడు మీ పొలాలు మీకు తిరిగి ఇచ్చేస్తాము అంటున్నారు కనుక...
      మా నాన్నగారు విజయవాడలో స్థలం 10 వేలకు అమ్ముకున్నారు. ఇపుడు 10 వేలు నేను ఇస్తాను ఆ స్థలం నాకు ఇమ్మంటే ఇస్తారా ?
      10 వేల స్థలం 10 కోట్లు విలువ ఉంటే ఎవడయినా ఇస్తాడా ?

      రాజధాని లేకపోతే వారికి ఆ రేటు రాదు కనుక అన్యాయం అని బాధపడుతున్నారు కానీ ఎప్పటికైనా అమరావతి రైతులకు న్యాయం చేస్తామని ముందుకొచ్చే నాయకులు లేరు కనుక ఆందోళన చేస్తున్నారు. రైతులకు లాంగ్ టెర్మ్ ఆలోచనలు ఉండవు. ఈ రోజు పంట పండిందా అమ్ముకున్నామా అంతవరకే వారి ఆలోచనలు ఉంటాయి.పంట చేతికొస్తదో రాదో తెలియని పరిస్థితిలో పెట్టుబడి పెట్టకుండా 60 వేలు ఇస్తామంటే ఆశపడి ఇచ్చారు. ఇపుడు పంట డబ్బు లేక ...చేతిలో భూమి లేకపోతే బాధపడరా ?

      Delete
  2. "కరోనా కష్టకాలంలో లిక్కర్ షాపులు ఎందుకు, పేదల కష్టాన్నంతా లిక్కర్ ద్వారా ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోంది, లిక్కర్ షాపుల వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతోంది." ఇదీ నిన్నటి వరకూ చంద్రబాబు చేసిన వితండవాదం. అదే బాబు ఈరోజు నాలిక మడతపెట్టేశారు.

    "లిక్కర్ షాపులు అందుబాటులో లేకపోవడం వల్లే కదా కురిచేడులో మందుబాబులు శానిటైజర్ తాగారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అంటూ రెచ్చిపోతున్నారు.

    ReplyDelete
  3. “AP Politics” గారు (మీ పేరేమిటో తెలిపితే మరింత బాగుంటుంది),

    కర్ణుడి అంతం గురించి కృష్ణుడు అర్జునునితో అన్న ఈ మాటలు గుర్తు వచ్చుండాలే?

    ———
    "నీ చేతను నా చేతను
    వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
    ధర చేత భార్గవు చేత
    నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్”
    ————

    అయ్యా, అదీ సంగతి.

    ReplyDelete
    Replies
    1. కర్ణుడు దుష్ట చతుష్టయం లో ఒకడు. అతను అధర్మం వైపు నిలిచాడు కాబట్టి అంతమై పోయాడు అని చెప్పారు.

      Delete
    2. కర్ణుడు అధర్మం వైపు నిలిచాడా, అభిమన్యుడో మరొకరో ధర్మం వైపు పోరాడారా అన్నది కాదనుకుంటాను ఈ పద్య ఉద్దేశం. ధర్మం వైపు నిలిచిన వారు కూడా చాలా మంది అంతమై పోయారు కదా.

      ముఖ్యంగా కర్ణుడి మరణానికి చాలా మంది పరోక్ష కారకులన్నారన్నది చెప్పడమే కవిహృదయం అని నా అభిప్రాయం.
      (శల్యుడి పేరు కూడా ప్రస్తావించడం పద్యంలో ఇమడలేదేమో లెండి.)

      More sinned against than sinning అని ఒక ఆంగ్ల నానుడి.

      కర్ణుడి గురించి అరివీర భయంకర చర్చలు చాలానే జరిగాయి, మరొకటి ఇక్కడ మొదలెట్టే ఉద్దేశం నాకు లేదు.

      Delete
    3. కర్ణుడు దానవీరశూరుడు, భావితరాల గురించి ఎల్లప్పుడూ తపించి తరించే మహా మేధోసంపన్నుడు, నయాపైసా అక్కరకు రాని అలాగా వెధవాయిలకు అమిత అపాత్రదానం చేయడం మూలానే ఓడిపోయాడు.

      అందని ద్రాక్ష పుల్లన, అంతా ఈవీఎం మహత్యం!

      Delete
    4. పురాణాల్లో కర్ణుడు, ధుర్యోధనుడు మించిన స్నేహితులు లేరు.
      HAPPY FRIENDSHIP DAY

      Delete
    5. దుర్యోధనుడు కి కర్ణుడు స్నేహితుల రోజు శుభాకాంక్షలు చెబుతాడు. అయితే అమరపతికి దోస్త్ మేరా దోస్త్ లేదా డోంట్ వరీ ముస్తప్పా అని ఎవరు చెబుతారు.

      Delete
  4. అమరావతి రైతులకి జరిగే అన్యాయం లెక్కల్తోటి చెప్పండ్రాబాబూ అంటే ఒక్కడూ మాట్లాడడేమీ? ఏం తెలియకుండానే గొడవలు చేస్తున్నారా బ్లాగుల్లో చానెల్లల్లో?

    ReplyDelete
    Replies
    1. ఎకరానికి 60 వేల చొప్పున 33 వేల ఎకరాలకి సంవత్సరానికి 1,98,00,00,000(షుమారుగా) ఇవ్వాలి. ఇప్పటికి మూడు సంవత్సరాలుగా ఇవ్వలేదు. మళ్ళీ డెవలెప్ మెంట్ జరిగాక 1000 గజాలు ఇవ్వాలి.మీరు ఇప్పిస్తారా ?

      Delete
    2. ఈ సంవత్సరం వొదిలేస్తే, ముందు రెండు సంవత్సరాలు ఎందుకివ్వలేదు? అప్పుడు ఈ చానెల్లు, బ్లాగులు గాడిదల పల్లు తోముతున్నాయా?

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. రాజధాని వేరేదగ్గరకూడా ఉంటే 1000 గజాలు ఇవ్వరని మీతో ఎవరైనా చెప్పారా?

      Delete
  5. రాజధాని రైతుల మీద సానుభూతి ఎందుకు లేదంటే వారు ఎక్కువగా కమ్మ కులస్థులు కాబట్టి జనాలకి వాళ్ళమీద ద్వేషం ఎక్కువ. కమ్మవాళ్ళు బాగుపడిపోతున్నారు అని ఏడ్చేవాళ్ళని బ్లాగుల్లో రోజూ చూడడం లేదా ? ఇదే పోస్టులో కమెంటినవారు ఏడ్వడం మీరు చూడలేదా ? ముఖ్యంగా ఏడుపుముక్కల...పచ్చ పచ్చ అని ఎన్నిసార్లు ఏడవలేదు.వీళ్ళకి ఏడవడం తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఒకడు బాగుపడుతుంటే చూసి మనం కూడా బాగుపడదాం అనే ఆలోచన ఉంటే ఈ ఏడుపు ఉండదు. ఒక్క కమ్మవాడిని పడగొట్టటానికి రాష్ట్రం మొత్తం ఏకమైందంటే అతను శక్తివంతుడైనా అయి ఉండాలి అత్యంత అవినీతిపరుడైనా అయి ఉండాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటే నిజం. ఆ నిజాన్ని మూడు సంవత్సరాలలో తేల్చలేకపోయారు.

    ReplyDelete
    Replies
    1. రైతులకి జరిగే అన్యాయమేముంది దీన్లో! వాల్ల పొలాలు వాల్లకిస్తే వ్యవసాయం చేసుకోమంటున్నారా? మీవాల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతే రైతులెందుకు ధర్నా చెయ్యాలి?

      Delete
    2. ముందు రెండు సంవత్సరాలు ఆ ఒక్క కమ్మోడు. .. తోటి కమ్మోల్లకి డబ్బులెందుకు ఇవ్వలేదు? అదొదిలేసి... బ్లాగులూ, చానెల్లు ఈ ఒక్క రెడ్డి మీదే ఎందుకు పడి ఏడుస్తున్నాయి.

      Delete
  6. చంద్రబాబు గారు ఉన్నపుడు ఇచ్చారు.జగన్ వచ్చినాక ఇవ్వలేదు.
    వాళ్ళకి ముందుచూపులేదు అని నేను వ్రాసింది మీరు చూడలేదా ? వాళ్ళ భూములు వాళ్ళకిస్తే వాళ్ళకి చంద్రబాబు గారు ఇస్తానన్నదానికన్నా ఎక్కువ వేల్యూ వస్తుంది. వాళ్ళు రైతులు ...ఇవాళ తిన్నామా అమ్ముకున్నామా అన్నదే కావాలి. వాళ్ళకి అంబానీల తెలివితేటలు ఉండవు.

    ReplyDelete
  7. >>ఎకరానికి 60 వేల చొప్పున 33 వేల ఎకరాలకి సంవత్సరానికి 1,98,00,00,000(షుమారుగా) ఇవ్వాలి. ఇప్పటికి మూడు సంవత్సరాలుగా ఇవ్వలేదు

    >>చంద్రబాబు గారు ఉన్నపుడు ఇచ్చారు.జగన్ వచ్చినాక ఇవ్వలేదు.

    ReplyDelete
  8. Niharika:వాళ్ళ భూములు వాళ్ళకిస్తే వాళ్ళకి చంద్రబాబు గారు ఇస్తానన్నదానికన్నా ఎక్కువ వేల్యూ వస్తుంది.

    పచ్చబాచ్చి స్వగతం:"ఈమె పొగుడుతోందా? తిడుతోందా?"

    ReplyDelete
    Replies
    1. రాజధాని లేకుండానే 10 వేల స్థలం 10 కొట్లయితే, కోటి రూపాయల ఎకరం.. ఎంత అవుతుంది ?

      Delete
  9. వెలమ,కమ్మ, రెడ్డి, కాపు కులపిచ్చలతో రెండు రాష్ట్రాలు నాశనమైపోయినాయి. తెలుగు వాళ్ళం అనిపించుకున్నాం.

    ReplyDelete
    Replies
    1. సరిగ్గా చెప్పారు.

      Delete
    2. అగ్రహారం వారిని మీరు గుర్తించడం లేదు.

      Delete
  10. @sistla:

    తెలంగాణాలో కులగజ్జి ఉందా? మీకు "కిరస్తాన కడప రెడ్లు" అంటే అలెర్జీ ఉంటే అది మీ ఇష్టం, నడుమ ఇతరోళ్లను గుంజడం అనవసరం.

    ReplyDelete
    Replies
    1. తెలంగాణాలో కులగజ్జి లేదా?

      నాకు తెలిసిన ధనవంతులైన ఒక రాజకీయ కుటుంబం ప్రతిసంవత్సరం ఒక ఊరులో ఉన్న గుడికి వెల్తుంది(వూరు పేరు గుర్తులేదు). అక్కడ ఎవరినైనా తాగునీరు అడిగితే, మాల కులస్తులకోసం సెపరేట్గా పెట్టుకున్న లోటాలో పోసి ఇస్తారు. రెండు గ్లాసుల సిస్టం ఎప్పటిదో.. ఆ సంస్కృతిని వాల్లు కాపాడుకుంటున్నారు.

      Delete
    2. @Chiru Dreams:

      పైన @sistla రాసిన వ్యాఖ్య మళ్ళీ చూడండి: "వెలమ,కమ్మ, రెడ్డి, కాపు కులపిచ్చలతో". ఆయన ఆదుర్దా పెద్దకులపోళ్ల అంతర్గత కులపోరాటాల గురించి, అస్పృశ్యత కాదు.

      Delete
  11. 🤣🤣🤣అమరావతి రైతుల కోసం తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.😁😁😁🤣🤣🤣🙃🙃🙃

    ReplyDelete
    Replies
    1. ముంగట గ్లాసు పార్టీ ఒంటికాయ సొంటికాయ ఎమ్యెల్యేతోటి రాజీనామా చేయించవయ్యా పవన్ నాయుడూ!

      Delete
    2. రాజీనామా చెయ్ అంటే రిప్లయ్ ఏమొస్తుందో అని భయం.

      Delete
    3. ఆయనకున్న ఒక్క ఎమ్మెల్యే పైనే నీకెందుకంత ధ్యాస గొట్టి దూలముక్కలా?

      Delete
    4. ఎదుటోడికి నీతులు చెప్పే ముందు ఆపనేదో నువ్వే చేసి తగలడవోయ్ డింభకా. పావలా పాకేజీ దత్తపుత్ర మొఖానికి బారానా బిల్డప్పులు అవసరమా?

      Delete
    5. పవన్ బాబా చెబితే ఒకే ఒక్కడు రాజీనామా చెయ్యడు. వ్యవసాయ క్షేత్రం లో హాయిగా ప్రకృతి తో మమేకమై చాతుర్మాస దీక్ష చేసుకోకుండా అర్థం లేని ఆరాటం ఎందుకు వకీల్ సాబ్.

      Jana Sena is a failed experiment. Better to merge in BJP to get peace of mind for pavan.

      Delete
  12. 🙃🙃😆😆😁😁ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చురేపేలా వైకాపా ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ చేపట్టిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు.😂😂😂😂😂

    ReplyDelete
    Replies
    1. అభిమానం ఎదిటోడిమీదకి రాళ్ళెయ్యడానికేనా? స్క్రిప్టు రాసేవాడ్ని మార్చమని సలహాలివ్వలేదా?

      Delete
  13. మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. 😴😴😴

    ReplyDelete
    Replies
    1. అమర పతికి ఆగ్రహం వచ్చిన వేళ. 48 గంటల గడువు ఇవ్వడం జరిగింది.ఒక రాజుకు మూడు రాజధానులా. దిక్కారంమున్ సైతునా. మాయా లంకా నగర మున్ నిర్మించి తీరవలే.

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.