Monday, December 30, 2019

Mr Jagan.. Can You Answer 10 Questions? Prof Nageshwar Challenge | జగన్మోహన్ రెడ్డీ.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..ప్రొపెసర్ నాగేశ్వర్ సవాల్ !

Mr Jagan.. Can You Answer 10 Questions? Prof Nageshwar Challenge | జగన్మోహన్ రెడ్డీ.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..ప్రొపెసర్ నాగేశ్వర్ సవాల్ !

prof nageshwar,prof k nageshwar analysis,prof k nageshwar channel,prof k nageshwar live,prof nageshwar rao latest,prof nageshwar rao,prof k nageshwar latest,prof k nageshwar debate,prof k nageshwar,prof nageshwar today,prof k nageshwar youtube channel,prof k nageshwar comments,prof k nageshwar interview,prof k nageshwar debate in mahaa news,prof nageshwar rao today,prof nageshwar analysis today

24 comments:

  1. Take one media వారు గమనించవల్చింది ముఖ్యంగా ...
    ఇప్పుడున్న ఆంధ్రా పరిస్తుతులను చూసి ఆందోళన పడుతూ జగన్ పై తెగ విరుచుకు పడుతున్నారు? నిజానికి ఆంధ్రాకు పెద్ద అన్యాయం చేసిందేవరు? జగనా? నరేంద్రమోడీనా?
    ఆంధ్రా అభివృద్ధి దిశగా పరుగెడుతున్న సమయంలో చంద్రబాబును అన్నీ విధాల నిర్భంధం చేసి అనేక ఆర్ధిక కేసుల్లో జైల్ పాలయిన జగన్ ను తీసుకొచ్చి ఆంధ్రా ప్రజలపై కూర్చోబెట్టింది మోడీ కాదా?
    కేంద్రం సమయం చూసి దూకూతుంది, మోడీ మూడో కన్ను తెరిచాడు లాంటి మీ టైటిల్స్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నిజం చెప్పాలంటే మోడీ ఎప్పుడో మూడో కన్ను తెరిచాడు. కాకపోతే జగన్ పై కాదు చంద్రబాబుపై. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం అంతగా కష్టపడినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబును ఘోరంగా ఓడించాడు. ఇది ప్రజలిచ్చిన ఓటమి కాదన్న సంగతి మీకూ తెలుసు?
    ఆంధ్రాకు పెద్ద ద్రోహి ఎవరంటే జగన్ ఎంతమాత్రం కాదు కేవలం మోడీ మాత్రమే.
    జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ప్రజలు ఏదో ఒక సమస్యపై ప్రతిరోజూ రోడ్డు ఎక్కి గగ్గోలు పెడుతుంటే మోడీ ఎందుకు ఇప్పటివరకూ స్పందించడం లేదు? ఇదంతా బిజెపి వైసిపితో చేయిస్తున్న డ్రామా అని మీకు అనిపించడం లేదా? ఆంధ్రావాళ్ళ ఖర్మ... ఆంధ్రాను ముంచిన మోదీనే మళ్ళీ రక్షించమని వేడుకోవడం.
    మరొక ముఖ్యమైన పాయింట్ చెప్పి నా కామెంట్ ముగిస్తాను.
    కొంతమంది కేవలం తమపై ఉన్న చిన్న,చిన్న కేసులకు భయపడి బిజెపి పంచన చేరుతున్న సమయంలో తన మీద దేశంలోనే పెద్ద,పెద్ద ఆర్ధిక కేసులు కలిగిన జగన్మోహన్ రెడ్డి బిజెపిని ఎదిరించే ఇవ్వన్నీ చేస్తున్నాడన్న విషయం మీరు నమ్ముతారా?
    ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయించే అవకాశం లేదన్న కోర్టు తీర్పుకే డిల్లీ పరుగులు తీసిన జగన్ గారు ఈ తుగ్లక్ పనులన్నీ బిజెపిని ఎదిరించే చేస్తున్నాడని మనం నమ్మగలమా? ఇదంతా బిజెపి ఆడిస్తున్న పక్కా డ్రామా! కాదా? కాకపోతే బిజెపికి ఆంధ్రాలో తిరుగులేదన్న సమయం ఆసన్నమయినప్పుడు చంద్రబాబును మింగినట్లు ఏదోరోజు జగన్ ను మిగేస్తుంది. అయితే చంద్రబాబు అరగడానికి సమయం పడుతుంది. జగన్ మింగిన వెంటనే అరిగిపోతాడు. ఎందుకంటే మోడీ, అమిత్ షాలే సిబిఐ ని దగ్గర పెట్టి జగన్ ను దోరగా వేయిస్తున్నారు. తినడానికి సమయం వచ్చే వరకూ వైసీపీ బ్రతికే ఉంటుంది.

    ReplyDelete
  2. టీవీ9 నల్లమోతు దీప్తి & ఇతర జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఒక్క పచ్చ కండువా కూడా నిరసించలేదు సరికదా దారుణంగా ఎగతాళి చేసారు. కందుల రమేష్ అనబడే "జర్నలిస్ట్" సైతం వెకిలి వ్యాఖ్యలు రాసాడు.

    పచ్చమూకల దాడిలో మహా టీవీ జర్నలిస్ట్ వసంత్ కూడా గాయపడ్డాడని తెలిసినా సదరు ఛానెల్ అధినేత సుజనా చౌదరి & నియమిత చైర్మన్ పరకాల ప్రభాకర్ కనీసం నోరు మెదపలేదు.

    నిత్యం విలువలు మాట్లాడే జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వర్ బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నాడు.

    ReplyDelete
  3. చంద్రబాబును ఘోరంగా ఓడించాడు. ఇది ప్రజలిచ్చిన ఓటమి కాదన్న సంగతి మీకూ తెలుసు?----- we can understand your level of maturity with this statement.

    ఎవడో వెనకటికి... దె****** మంగళవారం అన్నాడంట . సెంట్రల్ లో బీజేపీ ఉండి , మహారాష్ట్రా, జార్ఖండ్ లలో ఓడిపోయినా కూడా మీకు ఇంకా ఈవీఎం ల మీద అంత నమ్మకం . ఒకప్పుడు చంద్రబాబు మీద ఉన్న సాఫ్ట్ కార్నెర్ తో చెప్తున్నా ( IT అభివృద్ధి తద్వారా నాకు ఉద్యోగం ) , చంద్రబాబు ఓడిపోవడానికి ఆయనే కారణం . గ్రౌండ్ లెవెల్ లో ఎంత అవినీతి జరిగిందో మీలాంటోళ్ళకి తెలియదు . ఇసుక బంగారం లా అమ్మేశారు టీడీపీ కార్యకర్తలు . సెకండ్ జెనెరేషన్ లీడర్ లేకపోవడం . ఏం మాట్లాడుతున్నాడో తెలియదు . ఎవరు అడిగారు రాజధాని ఆకాశన్నీ అంటే బిల్డింగ్ లు , ఆ గ్రాఫిక్స్ . రాజమౌళి , UK , సింగపూర్ , ఇవన్నీ నిజంగా సాధ్యమా ? జనం అంత వెర్రోళ్ళు లా కనిపిస్తున్నారా ? జనం వెర్రోళ్ళు అనుకున్నంత కాలం, మీరు ఈవీఎం ల మీద ఏడవాల్సిందే ? He lost the grip on party.

    ReplyDelete
    Replies
    1. అయ్యా Event Management (EVM) ఒకసారి కాంట్రాక్టు చేసుకుంటే ప్రతి పంక్షన్ కీ పనిచేసిపెడతారా ." జగన్ " కు ప్రశాంత్ కిషోర్
      చేదినట్లు చేస్తారు అంతే కాని ఎల్లకాలం అంటి పెట్టుకుని ఉండరు ,అదిగాక గుంపులో గోవిందం లాగా ఎక్కువ EVM లు‌ పనిచేసేటప్పుడు కాంట్రాక్టు పెట్డుకుంటారు గాని
      స్టేట్ ఎలక్షన్ ( MLA) కి పెడితే ఊరికినే పట్డుబడి పోతారు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది
      అదే పార్లమెంటు ఎలక్షన్ లో అయితే పిన్ పాయింటెడ్ గా పట్డుకోవడం కష్టం‌
      అయినా మీరు చెప్పినంత పారదర్శకంగా జరిగితే
      ముందే CS సుబ్రమణ్యం ‌ని‌ తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ,ఏ ఏరియాలో‌ వారి‌పార్డీ బాగా వుంది ,ఏఏ ఏరియాలలో తక్కువగా ఉంది‌
      ఏఏ EVM లు‌మానేజ్ చేసి పంపాలనే విషయాలు చూసుకోవడసనికి‌కాదా మరలా ఆ సుబ్రమణ్యం గారినే CS గా కంటిన్యూ‌చేశాడుగా జగన్‌
      దీన్ని‌బట్డి‌మీకు అర్దం కావడం లేదా ముందే కరిగిన‌ఏర్పాటని అయినా ఈ క్రింది‌లింకు వినండి‌
      విపులంగా తెలుస్తుంది
      https://youtu.be/xNvohhrmRdw
      https://youtu.be/dU3PTwAbyh4

      Delete
    2. Super sir..అదరగొట్టారు!

      Delete
  4. సెంట్రల్ లో బీజేపీ ఉండి , మహారాష్ట్రా, జార్ఖండ్ లలో ఓడిపోయినా కూడా మీకు ఇంకా ఈవీఎం ల మీద అంత నమ్మకం .

    ఆ మచ్చను పోగొట్టుకోవడానికి బిజెపి ఆడిన మరొక డ్రామా అని ప్రజలు అనుకుంటున్నారు.కావాలనే ఓడిపోయారట జార్ఖండ్ లో. నిజానికి బిజెపి జార్ఖండ్ లో గెలిచినా ఉపయోగం లేదు.

    ReplyDelete
    Replies
    1. కావాలనే ఓడిపోయా"రట"
      మంచి గాసిప్ కదూ!

      Delete
    2. వారి మాతృభాష "ట"లో అలానే నేర్పుతారుమరి..

      Delete
    3. ప్రచారమవుతున్నది కాబట్టి "ట" వాడాను. దగ్గరనుండి చూసుంటే మీలా "డ" వాడేవాడిని.

      Delete
    4. అదేకదా నేనుకూడా చెప్పింది.. మీది "ట" భాష... నాది "డ" భాష..

      Delete
  5. వీళ్ళలా మైకంలో ఉండడమే ఏ పార్టీకైనా కావలసింది.. అదే మత్తులో జోగుతూ.. తర్వాతి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పడిపోతారు.. ఆ తర్వాత టర్మ్ కు తప్పనిసరై సినబాబు పార్టీ పగ్గాలు చేపట్టాల్సొస్తుంది.. ఇక అంతకంటే, వై ఎస్ ఆర్ సీ పీ కి కావల్సిందేముంది?

    ReplyDelete
  6. మీకు వై‌ఎస్‌ఆర్‌సి‌పి మత్తు ఎక్కువైనట్టుంది. ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సింగిల్ డిజిట్ లోకి పడిపోయే పరిస్తితి ఎవరికుందో అర్ధం కావడం లేదు?

    ReplyDelete
    Replies
    1. అయ్యా పోలిట్రిక్సూ! మీరలా జోగుతుండడమే వాళ్ళకి కావల్సింది అని చెప్పా... మీరు లేస్తారో... లేక.. జీవితాంతం అవతలోడిమీద "ట" భాషతో పేడచల్లుకుంటూ.. మీచేత్లు మీరే వాసనచూసుకుంటూ తుత్తిపడతారో... మీ ఇష్టం

      Delete
  7. మీలాంటి జనాలని చూస్తుంటే భయమేస్తుంది . ఎంతసేపు మా నాయకుడు గొప్పోడు, తోపు, తురుము .. అంతే కానీ.. జనాలు చచ్చిపోతున్నా సరే .. వాళ్లకి ముడ్డి చూపించి మీ నాయకుడి కి హారతులు ఇచ్ఛే మిమ్మల్ని చూస్తుంటే .. .. ఆశ్చర్యం వేస్తుంది .

    జార్ఖండ్ లో ఓడిపోవడం బీజేపీ నాటకమా ?
    మహారాష్ట్ర లో కావాలని ఓడిపోయారా ?

    కొంచెం లో కొంచెం కూడా లాజిక్ గా ఆలోచించరా ? కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది ?? అసలు ప్రశాంత్ కిశోరె ఏం చేస్తాడో తెలుసా మీకు ?
    ఈవీఎం లు రిపేర్ చేస్తాడు అని మాత్రం చెప్పొద్దు .

    అరేయ్ రోడ్ మీదకి రండి , పేదోళ్ల గోష వినండి . తమ బిడ్డల కోసమో , జీవితాల కోసమో ... జబ్బులు , నొప్పులు ఉన్నా లెక్కచేయక , రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి తెచ్చుకునే నోట్లు .. అంత కష్టం ఊరికినే లంచాల గా పోతుంటే ?? ..

    నా అనుభవం లో .. వ్యవసాయం భూమి నుండి ప్లాట్ గా మార్చడానికి టీడీపీ వాళ్ళు 3 లక్షలు అడిగారు ( అది కూడా ఆ నాయకుడు, అడిగేవాడు ఇద్దరు కూడా బంధువు లే, ప్లాట్ 200 గజాలు .) , వైస్సార్ వాళ్ళు లక్ష అడిగారు . మరీ ఇంత తేడానా ?
    అంటే వీళ్ళేదో పతివ్రతలు అని చెప్పడం కాదు . ఆ లక్ష కూడా కష్టపడి ఇవ్వాల్సి వచ్చింది .
    not just this one... ఏది వదల్లేదు .. నొల్లేశారు. ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదు .. అంటుంటే ఆశ్చర్యం.

    చంద్రబాబు ఏమి ఊడపోడిచాడని , జనం గెలిపించాలి ? అంతోటి గ్రాఫిక్స్ , అమీర్ పేట లో కూడా చేస్తారు . తిండికి దిఖానా లేని మనకెందుకు రా లండన్ , న్యూయార్క్ లు , 33 వేల ఎకరాలా ? ఎవడి కోసం అదంతా ? . విశాఖ వైభవం ఎందుకు తగ్గిపోయింది సడన్ గా .. HCL విజయవాడ ఎందుకు వెళ్ళింది . ? ఎందుకు ఆ షో లు , MOU లు ,బిల్డ్ అప్ లు , ఈ రోజుల్లో జనం మరీ అంత వెర్రోళ్ళు కాదు .

    ముందు ఒక చిన్న రాజధాని పెట్టి , మిగతా సమయం అభివృద్ధి మీద దృష్టి పెట్టొచ్చ్చు కదా , మొత్త్తం అయిదు సంవత్సరాలు అమరావతి , గుంటూరు తప్పిస్తే , చెప్పుకోవడానికి ఏమి లేదు . చివరి రోజుల్లో డ్వాక్రా వాళ్లకి డబ్బులు పంచేస్తే అయిపోతుందా ?

    ఎవరి పార్టీ ఓట్లు వాళ్లకి ఉంటాయి , న్యూట్రల్ గా ఉండే జనాలు కూడా అసహ్యించుకుంటే నే అన్ని తక్కువ సీట్ లు వస్తాయి .

    ReplyDelete
    Replies
    1. ”ఎవరి పార్టీ ఓట్లు వాళ్లకి ఉంటాయి , న్యూట్రల్ గా ఉండే జనాలు కూడా అసహ్యించుకుంటే నే అన్ని తక్కువ సీట్ లు వస్తాయి”
      కరెక్ట్. ప్రతి పార్టీకి కరడుకట్టిన అభిమానులు ఉంటారు, వాళ్ళే పార్టీకి ప్రచారకర్తలు. అయితే అధికారం లోకి ఎవరు వస్తారో నిర్ణయించేది మాత్రం తటస్థులే. ఈ తటస్థుల నమ్మకం కోల్పోబట్టే తెదేపా ఇంత దీన స్థితిలో ఉంది.
      తటష్తుల అభిమానం కోల్పోడానికి అనేక కారణాలు ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని:
      (1) తెలంగాణ ఉద్యమ సమయం లో రెండుకళ్ళ సిద్ధాంతం పేరుతో సైలెంట్ గా కూర్చుని "ఏమైనా జరిగితే కాంగ్రెస్సే నష్టపోతుందిలే" అనుకోవటం.
      (2) తెలంగాణ తెదేపాని వద్దనుకుంది. తెరాసకి అధికారం కట్టబెట్టింది. అలాంటపుడు పరిస్థితులు అనుకూలించేవరకు వెయిట్ చెయ్యాలి. అలా కాకుండా ఓటుకు నోటు తో అడ్డంగా బుక్ అయి మొత్తం పరువును గంగలో కలిపేసాడు. తనకు దొరికిన రాజ్యం తో సంతృప్తి పడకుండా పక్కోడిని కెలికే దురద ఎక్కువైతే తరవాత గోక్కోవాల్సి ఉంటుందన్న సంగతిని విస్మరించడం. తెలంగాణా కోసం ప్రాకులాడి తనకున్న సింహాసనాన్ని కూడా కోల్పోయాడు!
      (3) ప్రత్యేక హోదా అంశం ఆంధ్రావారి భావోద్వేగాలతో ఎంతగా ముడిపడి ఉందో చెప్పక్కర్లేదు. అలాంటి హోదాని కాదని, బీజేపీ ప్యాకేజీ అనగానే దాని విధి విధానాలు, పరిమితులు తెలుసుకోకుండా తల ఊపెయ్యడం ఒక అనుభవం కల నేతకి శోభించదు. అబ్బే "బీజేపీనే ఇవ్వకుండా మోసం చేసింది" అని అభిమానులు ఏడ్చి మురిసిపోవచ్చుగాని అనుభవం కల నేతకు తమ ప్రాంతానికి కావల్సినవి ఎలా రాబట్టుకోవాలో తెలిసి ఉండాలి. అది ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఏ హామీలైనా తొందరగా నెరవేర్చుకోపోతే తరవాత పక్కరాష్ట్రాలవారి ఏడుపులు ఎక్కువ అవుతాయి. రాబట్టుకోవటమూ కష్తమవుతుంది. అందుకే ఇపుడు ప్రత్యేక హోదా అనేది చరిత్రలో కలిసిపోయిన ఒక కాల్పనిక అంశంగానే మిగిలిపోయింది.
      (4) ఇక చివరి రోజుల్లొ యూ టర్న్ తీసుకుని ధర్మ పోరాటమనో మరో పేరో పెట్టుకుని ఒక రోజో రెండు రోజులో దీక్ష చేసి తొడకొట్టేసి కేంద్రం మెడలు వంచేస్తామంటే చూడటానికి కామెడీ సినిమాలానే ఉంటుంది. కేసీఆర్ ఏ రేంజి లో ఉద్యమం నడిపాడొ చూసాక కూడా నేర్చుకోపోతే ఎలా?
      (5) రాజధానికి ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళని కాకుండా సినిమా డైరెక్టర్ ని ఏదైనా అయిడియా చెప్పమనడం, ఒక మామూలు సినిమా ఏక్టర్ తో సెంటర్ రాజకీయాలగురించి మొత్తం తెలిసినట్లు మాట్లాడించడం ఇలాంటివి చూసి చూసి తటస్థులకి కూడా వాంతి చేసుకునేంత వికారం కలిగింది.
      (6) అన్నిటికంటే ముఖ్యమైనది.మీడియాలో వచ్చిన మార్పుని గుర్తించకపోవటం. 1990ల్లో వేరే పత్రికలు ప్రచార సాధనాలు లేనప్పుడు తమ అనుకూల పత్రికల్లో ఎంత టముకు వేయించుకున్నా చెల్లేది. ఎన్ని సార్లు మాట మార్చినా ఎవిడెన్స్ ఉండేది కాదు కాబట్టి తప్పించుకునే వీలుండేది. కాని ఇప్పుడు అలా కాదు. ఇది సోషల్ మీడియా కాలం. మాట మార్చేవాల్లని ఎవిడెన్స్ చూపించి మరీ ట్రోల్ చేసే కాలం.
      అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మోదీ పెద్ద నోట్ల రద్దు అనగానే చాలామంది సమర్థించారు. మన నాయకుడు ఇంకో అడుగు ముందుకేసి "పెద్ద నోట్లు రద్దు చేయమని ఈ మధ్యే లెటర్ రాసా" అని టముకేసుకున్నాడు. కొన్నాల్లకి నోట్ల రద్దుతో ఏం సాధించారంటూ ప్రశ్నించాడు. ఇలాంటి డైలాగులు 1990ల్లో చెల్లగలవు కాని ఈ కాలం లో అవి పప్పు అనుకుని పెంటలో వేసిన అడుగుల్లాంటివి!

      తెదేపా ఇప్పటికైనా వాస్తవికతని గ్రహించి అడుగేస్తే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఇక జగన్ అదృష్టమే అదృష్టం!

      Delete
  8. Agree with you. Well said. Such objective assessment based on reality is needed.

    ReplyDelete
  9. ఇకనుంచీ ఈ బ్లాగులో.. 6 నెల్ల క్రితం నుంచీ ఒచ్చిన ప్రతి పోష్టునూ.. రోజుకొకటి చూసి ఎంజాయ్ చెస్తాను..

    ReplyDelete
  10. చివరి రోజులో ముసలి తండ్రికి పట్టెడన్నం ముద్ద పెట్టని ముద్దుల కూతురు భ్రమరావతి రైతులు అందరికి గాజులు తాకట్టు పెట్టి పరమాన్నం పెడతాను అనిందంట!

    ReplyDelete
    Replies
    1. మీరు తెలంగాణలో కూర్చుని ఆంధ్రుల రాజధాని అమరావతిని "భ్రమరావతి" అని మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ రాష్ట్రం ఇలా ఉందంటే దానికి కారణం మా ఆంధ్రుడే. మా ఆంధ్రులు లేకపోతే మీకు గతి లేదన్న విషయం మర్చిపోయి ఆంధ్రుల రాజధానిని విమర్శించడం దారుణం గొట్టిముక్కల గారూ!

      Delete
    2. మీ చంద్రబాబు చెడ్డీ వేసుకోక ముందే దాశరధి "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అన్నాడు. అతగాడి బాబు కర్జూర నాయుడు పుట్టక ముందే హైదరాబాదు మహానగరం. మీకు చరిత్ర తెలువకపోతే నేనేమి చేయగలను?

      భ్రమరావతి అన్న పదం తొలుత వాడింది స్వ. పండలనేని శ్రీమన్నారాయణ, వడ్డె శోభనాద్రీశ్వర రావు, IYR కృష్ణారావు, EAS శర్మ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి కోస్తా ఆంధ్రులే (మీ ఎరిక కోసం వారిలో ఎవరు కూడా క్రైస్తవులు లేదా రెడ్లు కాదు).

      తుళ్లూరు & వెలగపూడి (అందునా కొందరు అగ్రవర్ణ absentee landlords అలియాస్ మోతుబరి కామందులు) మాత్రమే యావత్ ఆంధ్ర ప్రజానీకానికి ప్రతినిధులనుకుంటే మీ ఇష్టం. కుండబద్దలు కొట్టే సుబ్బారావు గణపవరం పొలిమేర దాటకుండా రాస్తే మాత్రం వేదం అంటారా అయితే వాకే!

      Delete
    3. దాశరధి "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అన్నాడంటే అది ఆంధ్రా వాళ్ళ అభివృద్ధి చూసే! నిజాం అయ్యాంలో మీ తెలంగాణ ఎలా ఉండేదో ఎవరికీ తెలీదా? తరువాత దానిని అభివృద్ధి చేసిందేవరు? ఇవ్వన్నీ ఎందుకు ఇప్పుడు తెలంగాణాకు హైదరాబాదు నుండి అందుతున్న అత్యధిక ఆదాయం అక్కడున్న ఆంధ్రులది కాదా? తెలంగాణాను అభివృద్ధి చేసింది ఆంధ్రుడే! ఇప్పుడు కూడా తెలంగాణ నడుస్తున్నది ఆంధ్రా వాళ్ళ (హైదారాబాద్)వలననే!

      భ్రమరావతి అన్న పదం తొలుత వాడింది స్వ. పండలనేని శ్రీమన్నారాయణ, వడ్డె శోభనాద్రీశ్వర రావు, IYR కృష్ణారావు, EAS శర్మ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి కోస్తా ఆంధ్రులే (మీ ఎరిక కోసం వారిలో ఎవరు కూడా క్రైస్తవులు లేదా రెడ్లు కాదు).

      పైన మీరు పేర్కొన్న ఈ స్వయం ప్రకటిత మేధావుల పట్ల ఆంధ్రా ప్రజలలో ఎంత విలువ ఎడ్చిందో ఒకసారి ఆంధ్రా వచ్చి చూడండి. వాళ్లేదో వాగారని ఆంధ్రుల రాజధానిని మీరు కూడా అలా అంటారా?

      Delete
    4. సరే టైం మాగజీను కూడా తప్పే, చంద్రాలు సారు కరుణా కటాక్షాలు & అతగాడి మడుసుల దయాభిక్ష లేకుంటే మేము మట్టి కొట్టుకుపోయేటోల్లము.

      All the best with your Bhramaravati!

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.