జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ....అది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుండును. ఈ పధకాన్ని ప్రైవేట్ స్కూళ్లకు కూడా అమలు చేయడం వలన ఇప్పటికే విధ్యార్ధుల లేమితో కొనసాగుతున్న ప్రభుత్వ స్కూళ్ళు క్రమేపీ మూతబడిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలు మరింత పెరిగిపోతాయి. ఈ పధకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే అమలు పర్చడం వలన అవి కళకళలాడటంతో పాటు ఎంతోమంది పేదవారికి తమ పిల్లల వలన ప్రయోజనం చేకూరుతుంది. తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి ముందుకొస్తారు. కాబట్టి అమ్మఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అర్హత కలిగియున్నాయి. ఎందుకంటే సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వడం అంటే అదంతా మన పన్నుల రూపంలో వసూలు చేయబడిన ప్రజల సోమ్మే కదా? దానిని విద్యను భారీ వ్యాపారం చేసుకున్న ప్రవేట్ యాజమాన్యాలకు ధారబోయడం అన్యాయమే అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్ధులకు ఇవ్వడమంటే ప్రైవేట్ విద్యా వ్యాపారులను ప్రోత్సాహించడమే. ఈ విషయాన్ని మన జగన్ గారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే బాగుoటుంది. దీనికి మీరేమంటారు?
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
జగనన్న పధకాలు భారీగానే ఉన్నాయి. ఇవి మొదటి సంవత్సరంలో మాత్రమే అమలవుతాయా? లేక రెందూ,మూడు సంవత్సరాలలో కూడా అమలు చేయగలరా? వేచి చూడాలి.
ReplyDeleteప్రైవేటు స్కూల్లని వదిలేసి, ఏ లాభాపేక్షలేకుండా బడులని నడిపే విధ్యాసంస్థలకి వర్తింపజేయాలి.
ReplyDeleteఇక్కడింకో చిక్కొచ్చిపడుతుంది అప్పుడు. చైనా బాచ్చి బతికేదెలా? వాళ్ళని నమ్ముకున్న పార్టీల మనుగడేంటి?
చైనా బాచ్చి, వారిని నమ్ముకున్న పార్టీలు కూడా మన ఆంధ్రాలో ఉన్నాయా చిరుగారూ?
Deleteవాటి విషయంలో నాకు ఐడియా లేదని అడిగాను.
మీలాంటి అమాయకులున్నారు కాబట్టే, ఆ పార్టీలు పచ్చగా కళకళాడుతున్నాయి.
Deleteచైనా బాచ్చి: చై= చైతన్య నా=నారాయణ అనగా కార్పో"రేట్లు"
Deleteచైనా బాచ్చి: చై= చైతన్య నా=నారాయణ అయినప్పుడు వీటికి ఇవ్వకుండా ఉండడానికి అమ్మఒడి పధకాన్ని గవర్నమెంట్ స్కూళ్లకే పరిమితం చేస్తే బాగుంటుంది కదా? ఓహో ఒకవేళ జగన్ తొత్తు సంస్థలైన ఆదిత్య లాంటి కార్పో"రేట్లు" కూడా నష్టపోతాయేమోనని ఇవ్వడం తప్పటం లేదేమో పాపం.
Deleteకొడుకు యూనివర్సిటీ ఫీజులు కూడా కట్టుకోలేనివాల్లకి అవసరం గానీ, లక్షకోట్లు అవినీతి చేసినవాడికి ఆదిత్యతో పనేంటండీ మీ అమాయకత్వం కాకపోతేనూ.
Deleteఆదిత్య శేషు కూడా లక్షకోట్లు అవినీతి చేసినవాడిని మోసేవాడే కదా! ప్రయోజనాలు చేకూర్చకపోతే ఎలా అని నా అభిప్రాయం చిరు గారూ!!
Deleteఈ అదిత్యా శేషు ఎవరు? గూగిలించినా తెలియలేదు.
Deleteమీరు అన్న విషయం "ప్రైవెటు స్కూల్లకి అమ్మ ఒడి అవసరంలేదు"ని నిస్సందేహంగా, భేషరతుగా సమర్దిస్తున్నాను.
Deleteశేషు అంటే శేషా రెడ్డి.ఆదిత్య సంస్థల యజమాని, వైయస్ అయ్యాంలో MLA కూడాను చిరుగారూ!
Delete@AP Politics:
Deleteశేషారెడ్డి రామకృష్ణా రెడ్డి గార్లకు చుట్టరికం ఉందాండీ? తెలుసుకోవడానికే అడుగుతున్నాను.
వాళ్ళకు చుట్టరికం ఉందో,లేదో నాకు తెలీదు Jai Gottimukkala గారూ!
Deleteబహుశా నేను సరిగా గూగిలించలేదనుకుంటాను. శేషారెడ్డి గురించిన కాంట్రవర్సీలు ఉన్న లింకులు ఎమైనా చూపించగలరా? పైత్యం నెత్తికెక్కిన యూట్యూబ్ చానల్లవి కాదు.
Deleteమీదగ్గరైనా ఇంఫర్మేషన్ ఉందా లేక ఎదో నొటికొచ్చింది మాట్లాడేద్దాం అని ఆ పేరు చెప్పారా?
Deleteశేషారెడ్డి గురించిన కాంట్రవర్సీలు నాకు తెలియవు. వాటి గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం లేక ప్రయత్నించలేదు. ఇకపోతే జగన్ గారి ముఖ్య అనుచరులలో ఈయన కూడా ఒక్కడే అన్న విషయం ప్రక్కాగా తెలుసు. ఈయన వైయస్ గారి ఆయ్యాంలో అనపర్తి నియోజకవర్గానికి MLA గా చేశారు. ఈమధ్య జరిగిన MLC ఎలక్షన్ లలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆదిత్య విధ్యా సంస్థలన్నీ ఈయనవేనని చెప్పడమే నా ఉద్దేశ్యం చిరుగారూ!
Deleteమీకేం తెలియదు ఐనాగానీ గుడ్డ కాల్చి మొఖం మీద వేస్తానంటారు. గుడ్..
Deleteఈ అదిత్యా శేషు ఎవరు? గూగిలించినా తెలియలేదు. అని మీరడిగిన దానికి నేను శేషు అంటే శేషా రెడ్డి.ఆదిత్య సంస్థల యజమాని, వైయస్ అయ్యాంలో MLA కూడాను చిరుగారూ! అని సమాధానం చెప్పాను.
Deleteమళ్ళీ మీరు "బహుశా నేను సరిగా గూగిలించలేదనుకుంటాను. శేషారెడ్డి గురించిన కాంట్రవర్సీలు ఉన్న లింకులు ఎమైనా చూపించగలరా? పైత్యం నెత్తికెక్కిన యూట్యూబ్ చానల్లవి కాదు, అని ఒకసారి మళ్ళీ మీరే "మీదగ్గరైనా ఇంఫర్మేషన్ ఉందా లేక ఎదో నొటికొచ్చింది మాట్లాడేద్దాం అని ఆ పేరు చెప్పారా?" అని అడిగితే ... దానికి నేను "శేషారెడ్డి గురించిన కాంట్రవర్సీలు నాకు తెలియవు. వాటి గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం లేక ప్రయత్నించలేదు. ఇకపోతే జగన్ గారి ముఖ్య అనుచరులలో ఈయన కూడా ఒక్కడే అన్న విషయం ప్రక్కాగా తెలుసు. ఈయన వైయస్ గారి ఆయ్యాంలో అనపర్తి నియోజకవర్గానికి MLA గా చేశారు. ఈమధ్య జరిగిన MLC ఎలక్షన్ లలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆదిత్య విధ్యా సంస్థలన్నీ ఈయనవేనని చెప్పడమే నా ఉద్దేశ్యం చిరుగారూ!" అంటూ గౌరవంగానే ఆన్సర్ చేశాను.
మరి దీనికి గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం ఎలా అయ్యిందో నాకార్ధం కాలేదు. నాకు తెలియని శేషారెడ్డి కాంట్రవర్సీలు నేను ఎక్కడ తేవాలి? గూగులాడతారు కదా? ఉంటే అవే దొరుకుతాయి. వెతకండి. నాకావసరం లేదని మనవి. అసలు సబ్జెక్ట్ వదిలి కామెంటూడుకోవటం అనవసరం కూడా!!!
>>ఆదిత్య శేషు కూడా లక్షకోట్లు అవినీతి చేసినవాడిని మోసేవాడే కదా! ప్రయోజనాలు చేకూర్చకపోతే ఎలా అని నా అభిప్రాయం చిరు గారూ!!
ReplyDeleteమరి ఏప్రయొజనాలు చేకూర్చాడు అని అడిగితే, "నాకేం తెలియదు, నాకు తెలియనివి నేనెక్కడ తేవాలి?" అనేమాట పద్దతేనా మాస్టారూ?
నాకేం తెలియదు, నాకు తెలియనివి నేనెక్కడ తేవాలి? అన్నది మీరడిగిన శేషారెడ్డి గురించిన కాంట్రవర్సీలు ఉన్న లింకులు గురించి. నేను మాట్లాడేది అమ్మఒడి కేవలం గవర్నమెంట్ స్కూళ్లకే పరిమితం చేయాలన్నది. అందులో భాగంగా చైనా బాచ్చి గురించి కొంత ప్రస్తావన జరిగినప్పుడు ఆదిత్య శేషు ప్రస్తావన వచ్చింది. అమ్మఒడి వలన జగన్ గారి అనుచరుని విధ్యా సంస్థలకు కూడా ఉపయోగమే నన్న అభిప్రాయం వ్యక్తం చేయడం వరకే జరిగింది. పై కామెంట్లు నిశితంగా చూసుకోండి. ఏప్రయొజనాలు చేకూర్చాడు అని మీరు అడగానూ లేదు. ఆ విషయంలో "నాకేం తెలియదు, నాకు తెలియనివి నేనెక్కడ తేవాలి?"నేను అననూ లేదు నేను అన్నది కేవలం శేషారెడ్డి గురించిన కాంట్రవర్సీలు ఉన్న లింకులు విషయంలో తప్ప!
Deleteచైనాబాచ్చి గురించి మీకేం తెలియదని అందరికీ అర్ధమైంది. ఎందుకంటే, దానిగురించి పసిపిల్లలకితప్ప అందరికీ తెలుసు. కాకపోతే, ఈ ఆదిత్య శెషారెడ్డి మాటర్ ఎందుకొచ్చిందో అర్ధంకాక ఇంత స్ట్రగులు. ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నారనీ , దాన్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడర్ధమైందిలేండి
Deleteనాకు తెలిసి నల్లమిల్లి శేషారెడ్డి వైకాపా సభ్యుడు కాదు, ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసాడు. గత రెండు (2014 & 2019) ఎన్నికలోనూ సత్తి సత్యనారాయణ రెడ్డి గారే అనపర్తి వైకాపా అభ్యర్థి.
Deleteఈయన వైయస్ గారి ఆయ్యాంలో అనపర్తి నియోజకవర్గానికి MLA గా చేశారు..అని ముందే చెప్పాను కదా Jai Gottimukkalaగారూ!
Deleteవిషయం చాలా విచిత్రంగా వుందిగానీ ఇక వొదిలెయ్యండి
Delete