కేసీయార్ కు తెలంగాణ ఆర్‌టిసి అంటే ఏమాత్రం గౌరవం లేదు. దానిని ఎలాగైనా రూపు మాపి ఆర్‌టిసి మొత్తాన్ని ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు ధారబోయాలని చూస్తున్నాడు. కొన్ని రాష్ట్రాలో ఎలానూ ఆర్‌టిసి లేదు మన తెలంగాణాలో ఎందుకన్న అతని భావన దారుణం అనిపిస్తోంది. సమ్మె ముగింపే ఆర్‌టిసి ఖతమన్న కేసీయార్ ఆలోచనా ధోరణి ఎంత ప్రమాదకరమో తెలంగాణా ప్రజలే ఆలోచించుకోవాలి.
Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
బంగారు తెలంగాణ అంటూ బీరాలు తీసిన కేసీయార్ ఇప్పుడు తెలంగాణ జీడీపీ రేటు 20 నుండి 2 శాతానికి పడిపోయిందని మీడియా ముందు అసలు వాస్తవం కక్కేశాడు. ఇక బంగారు తెలంగాణా ఎలా అయ్యిందో తెలంగాణా ప్రజలే అడగాలి.
ReplyDeleteఅయ్యా మీ బ్లాగు AP Political Reviews. మంచిది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయవార్తా విశ్లేషణలకు మాత్ర్మే మీ బ్లాగును పరిమితం చేస్తే బాగుంటుందని నా విన్నపం. ప్రక్కరాష్ట్రమే అగు గాక, సాటిదో మేటిదో ఏదో ఒకటి తెలుగు రాష్ట్రమే అగు గాక, తెలంగాణారాష్ట్రం యొక్క రాజకీయాలను గురించి మీబ్లాగులో విశ్లేషించటం అంత అవసరం కాదని నా భావన. మన యింటి సమస్యలను గురించి ఆలోచించవలసినదీ చర్చించవలసినదో బోలెడుండగా ప్రక్కవారి సమస్యలగురించి విశ్లేషణ లెందుకూ వ్యంగ్యాలెందుకూ చెప్పండి. అపోహలను నివారించటం కోసమైనా సరే మీరు మీ బ్లాగు పేరులోనే ఉద్దేశించిన విధానాన్ని అతిక్రమించటం వద్దని మనవి. ఇలా అన్నందుకు అన్యథా భావించకండి.
ReplyDeleteనమష్కారం శ్యామలీయం గారూ! మన ఆంధ్రా చుట్టూ కేసీయార్ బంధం కూడా ముడిపడి ఉంది కాబట్టే వ్రాయాల్సివస్తోంది. ఇక్కడ ఆంధ్రాలో జగన్ తో కల్సే ఉన్నాడు కదా? ఎన్నికల సమయంలో ఆంధ్రా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని, జగన్ చేత అభివృద్ధి అంటే ఏమిటో ఆంధ్రా ప్రజలకు చూపిస్తానని అన్నాడు కదా? అంటే ఇక్కడ ఆంధ్రాలో ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనానికి సహకరించిన కేసీయార్ అక్కడ తెలంగాణాలో ఉన్న ఆర్‌టిసి కి ఎందుకు సహకరించడం లేదు. ఇది తెలంగాణా ఆర్‌టిసి పై కక్ష సాధింపు చర్యే కదా? ఒకవేళ ఆర్‌టిసి ని తమ ప్రభుత్వంలో కలపడం తెలంగాణా అభివృద్ధికి ఆటంకం అయ్యినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కంటే ఆర్ధిక లోటులో ఉన్నప్పుడు ఆర్‌టిసి ని ప్రభుత్వంలో కలపడం ఎలా ప్రయోజనకరం అవుతుంది? తమ చెప్పుచేతల్లో ఉన్న జగన్ కి, ఆంధ్రా అభివృద్ధి కోసం తెగ కష్టపడిపోయే కేసీయార్ ఆంధ్రా ఆర్‌టిసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ ప్రకటించినప్పుడు కేసీయార్ ఎందుకు మిన్నకుండిపోయాడు? ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే శ్యామలీయం గారూ? ఆంధ్రాను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు కేసీయార్. ఆంధ్రా ప్రజలను కుక్కలతోనూ, నక్కలతోనూ పోల్చిన కేసీయార్ ను మన ముఖ్యమంత్రి నమ్మడం,విలువివ్వడం మన ఖర్మ అంతే!
Deleteమీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న AP, తెలంగాణ పతనానికి జగన్,కేసీయార్లు కారణం. ముఖ్యంగా మోడీ వచ్చిన తరువాతే దేశంలో ఆంధ్ర మాత్రమే తీవ్రంగా నష్టపోయింది.
Deleteచౌదరి గారూ, శ్యామలీయం మాస్టారి సలహా మీరు తెలంగాణా/కెసిఆర్ (లేదా ఆంధ్రేతరం ఎవర/ఏదయినా) గురించి రాయవద్దని కాదు. *ఈ* బ్లాగు పేరే AP Political Reviews కనుక *ఇక్కడి* టపాలను ఆంధ్ర రాజకీయ విశ్లేషణకు పరిమితం చేస్తే బాగుంటుందని మాత్రమే ఆయన సూచన. మీకు ఇంకా వేరే బ్లాగులు ఉన్నాయి కాబట్టి అక్కడెక్కడయినా ఈ టపా వేసుంటే వారికి ఈ అభిప్రాయం కలిగేది కాదేమో.
Deleteఅయ్యా బ్లాగరుగారూ! మీరు, తెదేపా వాల్లు జగన్ను ఎవరితో కలపలేదో చెప్పండి. కాంగ్రేసుతో కలిశారు అంటారు, బీజేపీతో కలిశాడు అంటారు, ఇప్పుడు కేసీఆర్తో అంటున్నారు. విచిత్రమేమంటే... వీళ్ళందరితో కలిసిపొయ్యింది చంద్రబాబు. జగన్ సింగిల్ గానే ఒచ్చాడు, సింగిల్ గానే ఉన్నాడు. కాస్త విషయం ఉన్న టాపిక్ లు మాట్లాడితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. లేదూ.. "మేము ఇలానే ఆనందపడతాం" అంటారా? మీ బ్లాగు... మీ ఇష్టం..
ReplyDeleteకెసిఆర్ కేవలం బస్సోళ్ల పొట్ట కట్టడం అస్సలు బాగాలేదు. నష్టాలలో కూరుకుపోయిన సింగరేణి వర్కర్లకు బోనసు మీద బోనసులు ఇచ్చి ఇంకోపక్క రెండు చేతులా లాభాలు గడించి ప్రభుత్వాన్ని పోషిస్తున్న ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద పడేయడం దారుణం.
ReplyDeleteబస్సోల్ల పొట్టలు కూడా బాగానే నింపాడులేండి.
Deleteవాల్లు సమ్మెకి ఎంచుకున్న టైం అస్సలు కరెక్ట్ కాదు. ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్సు వాల్ల దోపిడీ చూస్తుంటే, వీళ్ళు యూనియన్ నాయకులకి ఏమైనా ముట్టజెపుతున్నారేమో అని సాధారణ ప్రజానీకానికి అనుమానం ఉండిపోయింది..
తెలంగాణా ఏర్పడ్డ ఐదేళ్లలో బస్సోళ్లకు పెరిగిన జీతం అక్షరాలా 67% మాత్రమే. ఇంత తక్కువ ఇంక్రిమెంట్ ఎవరు ఒప్పుకుంటారు!!!
Deleteమరి ఎంత % ఇంక్రిమెంత్ ఉండాలంటారూ?
Deleteసమ్మెకు కార్మిక సంఘాలు ఎంచుకున్న టైం తప్పు. పండగ రోజుల్లో సమ్మె చేస్తే తప్ప ప్రభావం కనబడదు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కోట్లకొలదీ జనాభా ఉన్న దేశం లో ఎప్పుడు సమ్మె చేసినా ప్రభావం కనిపిస్తుంది. సమ్మెలుకూడా సినిమాల్లాంటివే. ఎక్కువరోజులు నిరాటంకంగా నడిస్తేనే హిట్ అవుతాయి. తెలంగాణ ఉద్యమం కూడా అలానే హిట్టయిందన్న విషయం గుర్తించాలి. సంస్థల మధ్య పోటీ ఉండాలంటే monopoly అనేది ఉండకూడదు. కేవలం ఆర్టీసీ బస్సులు కాక ప్రయివేటు బస్సులు కూడా నడిస్తేనే కార్మిక సంఘాలు అదుపులో ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఆడింది క్రికెట్ పాడింది పాప్ సాంగ్ అన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం.
ReplyDelete