కెసియార్ పై జగన్ కున్న ప్రేమ చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు ఆశ్చర్యమేస్తుంది. హైదరాబాద్ లోని ఆంధ్రా ఆస్తులను తెలంగాణాకు ఇచ్చేయడం, మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు అన్నింటిని కొట్టివేయడం, డిల్లీ లోని ఆంధ్రా భవన్ ను తెలంగాణాకు కేటాయించడం చూస్తుంటే ఆంధ్రా వాళ్లకు వళ్ళు మండుతోంది. ఆంధ్రాకు బయట ఏవీ మిగలకుండా చేస్తున్నవాడు రేపొద్దున్న ఆంధ్రాలోని వాటిని కూడా ఉంచుతాడన్న నమ్మకం పోతోంది. దారుణం కాకపొతే మన పోలవరం నీళ్ళు తెలంగాణాకు ఇవ్వడమేమిటి? నక్కలమారి జిత్తు అయిన కెసియార్ కు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లొంగిపోయాడు. దీనికి ప్రధాన కారణం జగన్ పై ఉన్న కేసులే. ఎందుకంటే ఈ కేసులన్నీ ఆంధ్రా,తెలంగాణా కల్సి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటివే. ఇందులో ఎక్కువ కేసులు తెలంగాణాకే చెందుతాయి. కెసియార్ కు ఎదురు తిరిగితే ఆ కేసులన్నీ బయటికి ముమ్మరం చేసి జగన్ ను ఇరకాటంలో పడవేయడమే కాదు... అరెస్టుల వరకూ తీసుకువెళ్ళవచ్చు. దీని కారణంగా జగన్.. కెసియార్ ఏదంటే దానికే తలూపవల్సివస్తుంది. పోలవరం నీళ్ళు మేము వాడుకున్న తరువాతే రాయలసీమకు పడేస్తాం అన్నా జగన్ మాట్లాడకుండా ఉండాల్సిందే. జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తన నవరత్నాల అమలుకు ఆంధ్రాలో నిధులు లేవని గగ్గోలు పెడుతున్న వైయస్సార్ సిపి, మరి మన ఆస్తులన్నీ తెలంగాణాకు ఎందుకు ధారభోస్తుంతో ఆంధ్రా ప్రజలే ఆలోచించాలి.
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.