Rumullamma Uncovered the secrets of KCR! | కేసీఆర్ రహస్యాలు బట్టబయలు చేసిన రాములమ్మ! |
టీఆర్ ఎస్ కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీ సైతం తట్టుకోలేకపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సమాజం ఇదే అభిప్రాయంతో ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విశ్లేషించారు. `టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని - ముఖ్యమంత్రి కేసీయార్ దొరగారు - ఆయన కుటుంబం సభ్యులు అంతకన్నా ఎక్కువ కలిమితో ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.` అంటూ ఎద్దేవా చేశారు.
మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి... ప్రభుత్వ ఉద్యోగులు - అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ గారు సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విజయశాంతి వ్యంగ్యంగా విమర్శించారు. ``ప్రభుత్వ ఉద్యోగులు - అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్న కేసీఆర్ సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఏ మేరకు తగ్గించారో వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. వాటి ద్వారా కేసీఆర్ తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని కలలు కంటున్నారు.` అంటూ మండిపడ్డారు.
తెలంగాణ అత్యధిక వృద్ధి రేటులో ఉందని, తెలంగాణాను ఢీకొట్టే దమ్ము ఎవరికీ, ఏరాష్ట్రానికి లేదని డబ్బా కొట్టిన కేసీయార్ ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను దారుణంగా ముంచేశాడని ఘాటుగా విమర్శించింది. TSRTC వ్యవహారంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేట్ దారుణంగా పడిపోయిందని చెప్పకనే చెప్పాడని విజయశాంతి గుర్తు చేశారు.
ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడి... ఆయన అసలు స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. తను సర్వనాశనం చేసిన బంగారు తెలంగాణాను గూర్చి కేసీయార్ ఏం సమాధానం చెప్తాడో చూద్దామని ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారని" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.