Can Chandrababu Revive Amaravati? | చంద్రబాబు తిరిగి CM అయితే రాజధానిని అమరావతికి మళ్ళీ మార్చవచ్చా?
chandrababu naidu, chandrababu amaravati graphics,amaravati,chandrababu,chandrababu amaravati tour,amaravati farmers angry on chandrababu,chandrababu cheats amaravati farmers,amaravati farmers angry on chandrababu graphic design,ap cm chandrababu naidu,chandrababu naidu speech, demolition of chandrababu naidu's building,nara chandrababu naidu,amaravati farmers protest, #chandrababu, chandrababu”,amaravati lands,chandrababu on cm ys jagan,cm chandrababu naidu, had chandrababu concentrated on andhra
- జగన్ విషయంలో ఈ అమ్మాయిల అమాయకత్వం చూడండి
- అమరావతిపై ఇంత బురద చల్లుతారా? మరి జగన్ ఇక్కడ ఇల్లు ఎలా కట్టుకున్నారు?
- ప్రజల కష్టాలకు జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే!
- Please Suscribe to AP Politics Daily Youtube Channel
ఒక ముఖ్యమంత్రి సర్వస్వతంతుడు కాదు. శాశనసభలోని బలమే ఆ ముఖ్యమంత్రి స్థూలబలం. ఆపైన శాశనమండలి సమర్ధించినా, అడ్డుపడలేకపోయినా ఆ బలం నికరబలం అవుతున్నది. ఇక నచ్చనివాళ్ళు గోల చేయటం తప్ప ఏమీ చేయలేరు. అనచ్చనివాళ్ళలో రెండుసభల్లోనూ అడ్డుపడలేని ప్రతిపక్షాలూ, ఓటేసినందుకు బాధపడుతున్నాం అంటూ డైలాగులు చెప్పే ప్రజలూ ఉంటారు. నేటిపరిస్థితి ఐనా ఇది రాబోయేకాలానికీ వర్తిస్తుందనటంలో అభ్యంతరం ఏముంటుంది. ఇకపోతే తమతమ మార్పులకూ చేర్పులకూ తిరగమోతలకూ న్యాయవ్యవస్థ వాతలు పెట్టకుండా ఉంటే ఇష్టారాజ్యమే! అంతా సవ్యంగా బండినడిస్తే ఈ నాడు జగన్మోహనన రెడ్డిగారు కొత్తముఖ్యమంత్రిగా చేసిన పనిని రేపు కాలంలో చంద్రబాబుగారో మరొకరో సరికొత్తముఖ్యమంత్రిగా వస్తే, చేయాలనుకుంటే, బలం చాలితే తప్పకుండా చేయగలరు.
ReplyDeleteఎటోచ్చీ ఈమార్పుల వెనుక ఉండే రాజకీయాలూ, పట్టుదలలూ, పగలూ - ప్రతీకారాలూ, పెద్దలకు ఒరిగే ఆర్ధికరాజకీయ లాభాలూ వంటీవి రాష్ట్రభవిష్యత్తుకు నిజంగా లాభం చేకూరుస్తాయా లేదా అన్నది రాజకీయవేత్తలూ, వాటికి కొమ్ముకాసే మేథావులూ కాదు నిర్ణయించేది. కాలం నిర్ణయిస్తుంది.
"జగన్మోహ*నన* రెడ్డిగారు"
DeleteCorrection suggested: జగన్మోహ*న* రెడ్డిగారు (unless intentional repetition of "న")
It was just a typo.
DeleteThanks you for the latest telugu news article. Checkout
ReplyDeletelatest breaking news in telugu
ఇల్లలకగానే పండగ కాదు కదా, శ్యామలరావు గారూ?
ReplyDeleteఅస్సలు కుదరదండి. అమరావతి వాసులకోసం, కర్నూలు ( మొత్తం రాయలసీమ), విశాకపట్నం జనాలను వదులుకోలేరు. ఒక సారి ఇవ్వడం అంటూ జరిగిన తరువాత, వదులుకోవడానికి ఒకప్పటి కర్నూలు జనాలు కాడు ఇప్పుడున్నది. రాజకీయ చైతన్యం బాగానే వచ్చింది ఇప్పుడు అందరికీ.
ReplyDeleteప్రజలకు రాజకీయ చైతన్యం బాగా వచ్చిందిప్పుడు అంటే అవునంటారు వైకాపా వారు, కాదంటారు మరి కొన్ని పార్టీల వారు. అంతా చూసే దృష్టిలో ఉందేమో నండీ. రాజకీయచైతన్యాన్ని ఓట్లూ - సీట్లూ ఆధారంగా కొలవ్వచ్చునా అన్న ప్రశ్నకు, మరింకెలా కొలుస్తారూ అన్న ఎదురుప్రశ్నతో జవాబు వస్తుంది. ఆమాటా నిజమే. ఐతే ఒక్క విషయం గమనించాలి. నిజానికి జనబాహుళ్యం ఒప్పుకోవటం అనే కాదు, ఒక ప్రాంతపు, రాష్ట్రపు లేదా దేశపు అని ప్రాదేశికపరిమితిని పెట్టి కాని ఒక జాతి అని నిర్దేశం చేసి కాని యావన్మంది ప్రజలూ ఒప్పుకున్నా సరే తప్పు తప్పే ఒప్పు ఒప్పే అవుతుంది కాని మరొకలా కాదు. ఆవేశాలూ,అభిప్రాయబేధాలూ, తర్కపాండిత్యాలూ, రాజకీయసామాజిక సిధ్ధాంతాలూ ఎన్నడూ తప్పొప్పులను ఎంతగానైనా పెయింట్ చేసి చూపటానికి యత్నించా సరే, కాలం తప్పును తప్పుగానే ఒప్పును ఒప్పుగానే నిగ్గు తేలుస్తుంది. కాలం అంటే ఒక ఎన్నికల ప్రక్రియకూ మరొక ఎన్నికల ప్రక్రియకూ మధ్య నడిచే సమయం అనుకోకండి. కాలం చాలా పెద్దది, మన జీవితాలు చిన్నవి - జాతుల జీవన గమనాల్లో.
ReplyDeleteచాలా ఏళ్ళ క్రిందట ఒక సైన్సు పత్రికలో ఒక పరిశోధనావ్యాసం చదివాను. అందులో ఒక జాతి అంతరించిపోవటానికి కారణాలను నిగ్గుతేల్చారు. ఆజాతిలో అందరూ అల్పాయుష్కులుగనే పోయేవారు - చివరికి మొత్తం జాతే తుడిచిపెట్టుకొని పోయింది. కారణం ఏమిటంటే వారందరూ మనసావాచాకర్మణా నమ్మి పాటించిన ఒక మూడాచారం! వారు తాము బాహ్యానికి వెళ్ళే చెరువుల నీటినే సేవించేవారు. అవి తీవ్రకాలుష్యకాసారాలు కావటం వలన మొత్తానికి జాతి నశించింది. అకాలంలో వారికి ఆ వినాశనానికి కారణం తెలియలేదు.
చెప్పవచ్చేది ఏమిటంటే, ఆకాలంలో ఆజాతివారికి తాము ఒక గొప్ప అచారాన్ని పాటిస్తున్నాం అన్న నమ్మకం ఉండేది. కాదంటే ఎవ్వరూ ఒప్పుకోరు కూడా. మరి అందరి ఆమోదమూ లభించినంత మాత్రానా మూఢవిశ్వాసం వలన జాతికి శిక్ష తప్పిందా?
అందుకే మన నమ్మకాలూ వగైరాలతో మనకు ఉన్న చైతన్యానికో మరొకదానికో మనం మురిసినంత మాత్రాన విశేషం ఏమీ లేదు. కాలంలో ఏమి జరుగుతుందీ అన్నదే ముఖ్యం.
మన ప్రస్తుత రాజకీయ చైతన్యం మంచే చేస్తుంది అని వాదించే వారు అలా వాదించకుండా అడ్డుకోవటం వలన పెద్దగా ఉపయోగం లేదు - అలా మేలు జరుగుతున్నదీ, ఇంకా ఇలాగే మేలు జరుగబోతోందీ అనే వారికే మంది బలం ఎక్కువగా ఉన్నప్పుడు. ఉన్న రాజకీయ చైత్యనం హుళక్కి అది కీడు చేస్తుందీ అనే వారి మాటలు వినబడటం అన్నది జోరైతే మంచే చేస్తుందీ మంచిదే అని వాదించటం కూడా అంత సుళువు కాదు. మనవాదనలను కాలం వినదు. దానిపని దానిదే.
This comment has been removed by the author.
Delete@శ్యామలీయం:
ReplyDelete"రాజకీయచైతన్యాన్ని ఓట్లూ - సీట్లూ ఆధారంగా కొలవ్వచ్చునా అన్న ప్రశ్న"
పూర్తిగా quantitative కాకుండా qualitative ప్రమాణాలు కూడా ఉండాలన్నది మీ వాదనని నాకు అర్ధం అయింది. If this is the thrust of your argument, I agree and urge you to consider the following evidence.
కడుపు నిండిన అగ్రవర్ణ పట్టణ ప్రాంత పడక్కుర్చీ విశ్లేషకులు దాదాపు అందరూ చంద్రబాబు "సింగపూరు తలదన్నే మహోన్నత రాజధాని" వైపే నిలిచారు. ప్రచార మాధ్యమాలలో "ఆయన వస్తే జాబు వస్తుంది" అనే హోరు మారుమోగింది. ఎప్పుడూ ఊళ్లలో అలగా వెధవలతో సంపర్కం పెట్టుకోని అమెరికా & హైదరాబాదు ఆంధ్రులు ముక్తఖంఠంతో ఇదే పాటను నొక్కి మరీ వక్కాణించారు.
ఇన్ని బలవంతమయిన ఒత్తిళ్లు తట్టుకొని మరీ జనం జగన్ వైపు నిలబడడమే కాక కనీవినీ ఎరగని బహుమతి ప్రధానం చేసారు. They stood firm against all coordinated propaganda machines of powerful media-cinema-politics nexus. They cut through the messaging to realize the "dreams on sale" are not intended for their consumption. ఇది అసాధారణ స్థాయి చైతన్యానికి సాక్ష్యం.
The "ordinary" Andhras rejected the propaganda pitch of the "hitech dream merchants" hook, line & stinker. This must be seen as a singular takeaway i.e. rejection not just of the dream merchants but the entire portfolio of "dream products".
సామాన్య ప్రజల తీర్పును ఇప్పటికీ వాల్లు జీర్ణించుకోలేక / అంగీకరించ లేక పోతున్నారు. సింగపూర్ బొమ్మలను మనసులో అంత గాఢం గా ముద్రించుకున్నారు.
Deleteఅయితే భ్రమరావతి పోయి అమరావతి ఏర్పడింది . అది విశాఖకు ఈ దశలో తరలించడం సరికాదు అని అనిపిస్తుంది. హై కోర్టు ను కర్నూలు లో ఏర్పాటు చేసి అమరావతి ని కొనసాగిస్తే బాగుంటుంది. అయితే రాజధాని ప్రాంతం ఒక సామాజిక వర్గం చేతిలో ఉండటం రాజకీయంగా జగన్ కు సమ్మతం కాదు.
రాజులైన ప్రజలైనా తీసుకునే ముఖ్య నిర్ణయాల ఫలితాలు విస్తృత కాల పరిధిలోనే అర్థమవుతాయి.
మిత్రులు జై గారూ,
Deleteఏదైనా నొక్కి వక్కాణించాలంటే ఇంగ్లీషు మాటలు వాడాలి అన్న ఆలోచన సరికాదని నా మనవి. తెలుగులో కూడా అలా చెప్పవచ్చును.
మీరు జగన్ గారి తరపున నాతో వాదించే నక్కరలేదు. నేను ఎవరికీ అనుకూలంగా కాని. ప్రతికూలంగా కాని మాట్లాడటం లేదు.
మరొకసారి శాంతంగా నామాటలు చదువుకోండి దయచేసి. నేను భగవత్ స్వరూపమైన కాలం గురించి మాత్రం చెప్పాను - తప్పు చెప్పులను నిర్ణయం చేసే శక్తి అది మాత్రమే అని.
మొబైల్ టైపింగ్ వలన దొర్లిన టైపోలకు మన్నించండి.
Deleteగురువు గారూ, నా వ్యాఖ్య ప్రధానుద్దేశ్యం "రాజకీయ చైతన్యం ఉందా?" అన్న ప్రశ్న తప్ప జగన్ కాదు. నాకు వచ్చిన తెలుగులో కొన్ని విషయాలు చెప్పడం కష్టం కావడం మూలాన *అక్కడక్కడ మాత్రమే* కొంత ఆంగ్లం వాడాను తప్ప వేరే కాదు.
Deleteతామే లోక శ్రేయస్సును నిర్ధారించే విధాతలమని అపోహ పడుతున్న పండితమ్మన్యుల "సూచనలను" తిరస్కరించే పరిణితి "సామాన్య" ప్రజల చైతన్యానికి నిదర్శనం.
మీరు ఇంకా నావ్యాఖ్య ప్రధానసూత్రాన్ని అర్ధం చేసుకున్నట్లు అనిపించదు. మీ ధోరణి మీది గానే ఉంది. చైతన్యవంతులం అయ్యాం అని జనం అనుకున్నా, చైతన్యవంతులను చేసాం అని రాజకీయులో మేథావులో అనుకున్నా, కాలం అలాగే అనుకోవాలని లేదన్న నా అభిప్రాయాన్ని మీరు గమనించటం లేదే. ఎవరు ఎవరిని పండితులు అనుకొన్నా ఎవరిని పండితమ్మన్యులు అనుకొన్నా అది ఆవ్యక్తుల అభిప్రాయంమాత్రమే అని కూడా కాలం తేల్చవచ్చును. ఎవరూ అతిగా సంతోషించటమో గర్వించటమో వంటివి అవసరం కాదు.
Deleteశ్యామలీయంగారు ఓదార్పుయాత్ర చేపట్టింట్టున్నారే!😉😉
Deleteమిత్రులు చిరు గారు,
Deleteఅసలు తెలుగువారికి ఒకరి ఓదార్పుకోసం అంగలార్చవలసిన పరిస్థితులు ఎందుకు రావాలి చెప్పండి. అంతా వారి స్వయంకృతాపరాథమే.
ఉమ్మడి మదరాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు సొమ్మలన్నీ మదరాసుపాలు చేసి చివరకు ఉసూరుమంటూ కట్టుబట్టలతో బయటకు వచ్చారంటే తప్పు తెలుగువారిదే కదా!
మొదటి తెలంగాణాఉద్యమానికి ప్రతిచర్యగా ఆరంబశూరులై జైఆంద్రా ఉద్యమం అంటూ హడావుడి చేసారు. సుబ్బారెడ్డి గారు ఆంధ్రా రాకపోతే కృష్నాలో దూకుతానూ అన్నట్లు గుర్తు. కాకాని వెంకటరత్నంగారు ఆ ఉద్యమసందర్భంలో ఇరవైమంది కాబోలు పిల్లలు కాల్పుల్లో చనిపోయారని గుండెపోటుతో పోయారు. చివరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పటికీ విడదీసేది లేదు అని ఇందిరమ్మ నిక్కచ్చి చేసేసరికి అంతా చల్లబడ్డారు కదా. అప్పటికీ ఆంద్రులంతా పొలోమని హైదరాబాదులో పెట్టుబడులకు ఎగబడ్డారు.
రెండవతెలంగాణా ఉద్యమం ఫలించి మళ్ళా హైదరాబాదును వదలుకొని ఒకప్పుడు మదరాసునుండి వెర్రిముఖం వేసుకొని కట్టుబట్టలతో బయటికి వచ్చినట్లే హైదరాబాదును వదలుకొని ఉసూరుమంటూ బయటపడ్డారు. ఇక్కడ ఆంధ్రావారిదే స్వయంకృతాపరాథం మళ్ళా.
అప్పటికే ఆంధ్రావారి సొమ్మంతా ఎంత హైదరాబాదుని సింగారించటానికి ఎత్తిపోసారో అదంతా బూడిదలో పోసిన పన్నీరైనది ఆంద్రావాళ్ళ వైపునుండి చూస్తే. అటు తెలంగాణా దొరలేమో నిజాం ప్రభువుల చల్లని పాలన తరువాత హైదరాబాదులో అభివృధ్ధే జరగలేదూ అనేసారు. కనీసం ఐటీ ఇండస్ట్రీ క్రెడిట్ ఐనా సరే తెలుగుదేశం పెద్దమనిషికి ఇవ్వటానికి ఇష్టపడకుండా - ఆతరువాత ఎప్పుడో కేటీఆర్ గారు ఆముక్క అన్నాడట లెండి. అది వేరే విషయం. ఇలా చేసినదానికైనా పేరూఊరూ లేకుండా పోవటం ఆంధ్రావాళ్ళ స్వయంకృతాపరాథం కాదా?
పోనీ ఏదో ఒక పెద్ద రాజధాని కట్టుకుందాం అని కొత్త ఆంధ్రాప్రభుత్వం ఆవేశపడింది. ఒక ప్రపంచస్థాయి నగరం నిర్మించుకుంటే దాని వలన భవిష్యత్తులో మేలు అని ఆశించారు. అది ప్రజలకు ఎక్కలేదో నచ్చలేదో మరేదో కొత్తగా ఆశించారో కాని మరొకదఫా వారికి అధికారం పోయి మరొక పార్టీ వచ్చింది. వాళ్ళు చిన్నరాజధాని చాలూ అన్నారు. ఆ తరువాత మూడు రాజధానులు చేస్తాం అన్నారు. చివరకు ఏమి జరుగుతుందో తెలియదు. అటు మొదలు పెట్టిన నగరాన్ని కూలదోసుకుంటున్నారు ఆంద్రులు. ఇటు కొత్తకొత్త ఆలోచనలు చేసేస్తున్నారు కొత్త దొరతనం వారు. చివరికి అంతా కప్పలతక్కెడలాగా ఉంది వ్యవహారం. చాలా బాగుంది అని కొందరు అనుకోవచ్చును కాదనలేం. ఏదైనా కాలం తేలుస్తుంది. కాని ఈ గందరగోళం చెరుపే చేస్తే అది ప్రజల స్వయంకృతాపరాథమే.
"నావ్యాఖ్య ప్రధానసూత్రాన్ని అర్ధం చేసుకున్నట్లు అనిపించదు"
Deleteమీ వ్యాఖ్య చాలా విషయాలపై, అందుట్లో నేను రాసింది ఒకే ఒక్క అంశం గురించి, నిజమే. ఎక్కడో మొదలెట్టాలి కదా.
దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే రాజధాని ఆంధ్ర వారికి అచ్చి రాలేదు. ఏదో ఒక ఊరికి పోలో మంటూ పరుగెత్తడం. ఆనక ఇక్కడ కాదు అక్కడ అంటే వెళ్లిపోవడం. ఇదే మళ్లీ మళ్లీ జరుగుతుంది.👻🐘🐿🐁
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteలేదండీ శ్యామళీయం గారు,
ReplyDeleteఎప్పుడైతే జనాలు ఇంగ్లీషు మాట్లాడతారో, జనాలు అది దాదాపుగా నిజం అనుకుంటారు. మన దేశములో రూల్సు మాట్లాడే వారు సడనుగా ఇంగ్లీషుకు షిఫ్ట్ అవుతారు. ఎందుకో తెలుసా.. మన రూల్సన్నీ ఇంగ్లీషులోనె ఉన్నాయి, రాజ్యాంగం కూదా ఇంగ్లీషు,హిందీలో మాత్రమే ఉంటుంది, కానీ అఫిషియలు భాషగా ఇంగ్లీషునే మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం. కోర్టులు దగ్గరనుండి, చాలా వరకూ ఇంగ్లీషే ఎక్కువ.
కాబట్టి, జనాలు ఏదన్నా రూలు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంగ్లీషులో ఉన్న ఆ రూల్సును చెప్పి, దాని అర్థం చెప్పేవారు. ఆవిధంగా .. రూల్సుకు ఇంగ్లీషు ఆవాలం అయ్యింది.
జనాలు మైండ్‌సెట్ కూడా అలా ఫిక్సైపోయింది. ఆ ఎఫెక్టును కొంచెం వాడుకోవడం తప్పేమీ కాదని ఫీలింగు.
ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు.-- జగన్
ReplyDeleteఅమెరికాలో ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణులు భారత ఐటీ సంస్థలకు సమస్యగా మారుతున్నాయి. __ కుక్షిలో వార్త
మిత్రులు చిరు గారు,
Deleteమీరు అన్యథా భావించనంటే నాదొక చిన్న విన్నపం. ఈమధ్యకాలంలో తెలుగుబ్లాగులోకంలో ఇలా పదాలను పేరడీగా వక్రీకరించి వ్రాయటం ఒక ఫేషన్ ఐపోయింది. (ఉదా: సాక్షిని కుక్షి అనటం.) ఈ పధ్ధతిని ఎవరు మొదలుపెట్టారూ, ఎవరెవరు ప్రస్తుతం వాడుతున్నారూ, వద్దని అనేవాళ్ళ వాడుకల్లో దోషాలు లేవా ఇలాంటివో వీటిని పోలినవో, వక్రీకరించటం మాకానందం మీకు నచ్చకపోతే మీకర్మ వంటి వాదనలను విడచిపెట్టి పదాలను ఉన్నవి ఉన్నట్లుగానే వ్రాయటం ఇకనైనా మరలా మొదలు పెడదాం అందరమూ. ఇది కేవలం విన్నపమే. ఎవరినీ తప్పుబట్టటం కాని ఆదేశధోరణిలో కాని ఆక్షేపధోరణిలో కాని చెప్పటం కాదు నా ఉద్దేశం. మీరూ, ఇతర చదువరుల్లో ఎవరికి ఈ అభిప్రాయం నచ్చితే వారూ ఈవిన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇబ్బంది కలిగిస్తే క్షంతవ్యుడను.
నేను సరదాగే అన్నానండీ. ప్రక్కన స్మైలీలు గమనించినట్లు లేరు.
Delete😄😄😄అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అధికార పక్షం వైసీపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ""బంపర్ ఆఫర్"" ఇచ్చారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కొందరు వైసీపీ మంత్రులు అడుగుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటించండి. మేం మా పదవులకు రాజీనామాలు చేస్తాం. వాటిని కూడా మీరే ఉంచుకోండి’’🙃🙃🙃🙃
Deleteవీల్ల తెలివితేటలకి బొందబెట్ట. "అమరావతి మాత్రమే రాజధానిగా వుండాలి" అని కూడా డిమాండ్ చెయ్యలేని చచ్చుదద్దమ్మలు.
Deleteజోతిష్యం 6303372020
ReplyDeleteబార్యభర్తల మధ్య తగాదాలు, ఉద్యోగంలో నిలకడ లేక, చదువులో రణించలేక, ఆర్ధికంగానిలబడలేక, పరస్త్రి వ్యామోహంలో నుండి బయటకు రాలేక మరెన్నో సమస్యలకు కాల్ చేయండి
🤑🤑🤑🤑🙃🙃🙃
Delete