Read Andhra Pradesh Political Breaking News, Updates, Analysis, Telugu News, AP Political Gossips, TDP, Congress, BJP, YSRCP, TRS, Loksatta, YS Jagan, Nara Chandrababu Naidu, KCR, Jaya Prakash Narayana and many more..
Subscribe to:
Post Comments (Atom)
మిత్రులకి, ముఖ్యం హిందూ ధర్మ సంబంధులైన ప్రతి ఒక్కరికీ మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చింది!
ReplyDeleteVedas.workd.inc వారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా నియంత్రణ కోసం ఒక బృహద్యజ్ఞం చెయ్యాలని అనుకుంటున్నారు.
వేసిన ప్లాను చాలా బాగుంది. ఒకేసారి 46 స్థలాల్లో ఒక్కో హోమగుండంతో ప్రతిరోజూ ఒకే సమయంలో 40 రోజులు చేస్తారు.ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ గుర్తించిన స్థలాలు అన్నీ శ్రీచక్ర యంత్రంలోని కోణాల వద్ద అమరుతాయి. అంటే నలభై రోజుల పాటు భాగ్యనగరం శ్రీ చక్ర రాజ మహేశ్వరీ శృంఖలా పరివేష్టితం అవుతుంది - వూహించుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది నాకు!
మనం చెయ్యాల్సినది కూడా చాలా సరళమైనది.వారు ధనసేకరణకి వేసుకున్న ప్రణాళిక కూడా అద్భుతమైనదే - 50000 మంది ఒక్కొక్కరు మినిముం 1000 రూపాయలు ఇస్తే చాలు.
దీనికోసం వారొక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు. మీ ఫోన్ నంబర్ మీ పేరుతో కలిపి ఇక్కడ () మధ్యన పెట్టి ఇస్తే నేను మిమ్మల్ని ఆ గ్రూపుకి పరిచయం చేస్తాను. వారు గూగుల్ అకవుంట్ క్రియేట్ చెయ్యగానే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే చాలు.
మీరు గనక మీ ఫొనులోని వాట్సప్ అక్కవుంటు నుంచి దీన్ని చూస్తున్నట్టయితే {https://chat.whatsapp.com/EwpayCxAJ1TH3pYlXdGQEM} దగ్గిరకి వెళ్ళి మీరే చేరవచ్చును.
ఇక్కడ మీకు సెక్యూరిటీ సమస్య అనిపిస్తే నా హరికాలం బ్లాగు దగ్గిర కామెంట్ వెయ్యండి. {http://harikaalam.blogspot.com/?m=1}అక్కడ కామెంట్ మోడరేషన్ ఉంది గాబట్టి మీ వివరాలు బయటికి కనపడవు.మీరు చేరడమే కాదు, మీకు తెలిసిన ప్రతి హిందువుకీ విషయం చెప్పి నమ్మకం కలిగించి వితరణకి ప్రోత్సహించండి,గ్రూపులోకి తీసుకు రండి!
ఇక మీదే ఆలస్యం!
నాకు ఒక విషయం అర్ధం కాలేదు హరిబాబుగారూ!
Deleteయజ్ఞాలు,యాగాలు చేయడం వలన కరోనా మహమ్మారి ఎలా నాశనమవుతోంది? అదే నిజమనుకుంటే ఈ పీఠాధిపతులు ఎందుకు నిర్వర్తించడం లేదు?
పూర్వకాలంలో వీటి వలన ప్రయోజనాలు ఎంతవరకూ కలిగాయి. ఒకవేళ కలిగినా ఇప్పుడు యజ్ఞం, యాగాలు చేసేంత అర్హతున్న పుణ్యపురుషులు ఎక్కడున్నారు?
మీరు ఈ బహత్తుర పని కోసం శ్రమిస్తున్నారని కాబట్టి నా ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు?
నా సందేహ నివృత్తి కోసమే తప్ప విమర్శాత్మకం కాదని మనవి.
ఈ కలియుగంలోనే హేతువాదులు సాధికారికమైన పరిశోధన చేసి శాస్త్రీయమైన జవాబు చెప్పలేని ఒక లీలావినోదం 1979 నవంబర్ 7 నాటి అర్ధరాత్రిన తిరపతి కొండ మీద జరిగింది!
Deleteఆ యేడాది వర్షాలు కురవక తిరపతి కొండ మీద నీటి ఎద్దడి తీవ్రమయింది - భక్తుల్ని రావద్దని చెప్పాలని కూడా కొందరికి అనిపించింది.కానీ అప్పటి CEO అయిన PVRK అలా కాదని నీటి సమస్యకి పరిష్కారం కోసం వారినీ వీరినీ సంప్రదిస్తుంటే చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వరుణ యాగం చేయమని సలహా ఇచ్చారు.దాన్ని పట్టుకుని వెతికితే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు దొరికారు.కానీ అప్పటికే పెద్ద వయస్సు కావడం వల్ల ఆయన వేరేవారి వివరాలు చెప్పారు.అందర్నీ కలుసుకుని యజ్ఞ ప్రారంభానికి నవంబర్ 1వ తేదీని నిర్ణయించారు.కానీ ప్రధాన యాజకుల వారి అస్వస్థత కారణాన వాయిదా పడింది.రెండవసారి అనుకున్న తేదీ కూడా మరొక యాజకులకి వచ్చిన సమస్య వల్ల అచ్చి రాలేదు.ఇక మూడవసారిగా నవంబర్ 8వ తేదీని నిర్ణయించుకుని అదే ఆఖరుసారి కావాలని నిశ్చయించుకుని PVRK 7వ తేదీ రాత్రి స్వామి సముఖాన నిలబడి ప్రార్ధించారు.సరే, ఆనాటి పూజాదికసేవలు అన్నీ ముగించాక తాళాలు వేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాక అర్ధరాత్రి సమయాన ఆలయంలోని రెండు గంటలు "ఠంగ్!ఠంగ్!"మని మ్రోగుతూ మళ్ళీ అందర్నీ ఆలయం దగ్గిరకి రప్పించాయి.పత్రికల వారు వచ్చారు,పోలీసులు వచ్చారు,ధర్మకర్తలు వచ్చారు,అధికారులు వచ్చారు, పూజారులు వచ్చారు - అయితే ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు తెరవకూడదు కాబట్టి ఉదయం వరకు ఆగి తలుపులు తెరిచాక వెతికితే మనుషుల అలికిడి లేదు.మరి గంటలు ఎవరు మ్రోగించారు?PVRK గారు అది ఆ రోజు ప్రారంభం కావల్సిన యజ్ఞానికి తన ఆమోదం తెలుపుతూ స్వామి జరిపించిన లీలావినోదం అని అర్ధం చేసుకున్నారు.అలా ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ మొదలైన యజ్ఞం రెండు రోజులు జరిగింది.మూడవ రోజున ఉత్సవబేరుకి వరాహ స్వామి ఆలయం దగ్గిర స్నపనతిరుమంజనం అనే స్నానసేవ కూడా ముగిసింది.అప్పటికీ ఆకాశం నిర్మలంగానే ఉంది.అసలే PVRK గారికి కూడా లోపల్లోపల గుబుల్గుబుల్గా ఉంటుంటే "మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?యజ్ఞాలకు వర్షాలు కురుస్తాయా!వర్షం ఆకాశం నుంచి కాదు గానీ ఇంకో పది నిమిషాల తర్వాత PVRK కళ్ళనుంచి కురుస్తుందిలే:-)" అనే ఎత్తిపొడుపులు మొదలయ్యాయి.అయితే, స్నపన పూర్తయ్యాక అక్కణ్ణించి ముఖద్వారం దగ్గిరకి వచ్చేలోపున ఒక్కసారి కుండపోత మొదలై ఉత్సవబేరుని మోస్తున్నవాళ్ళు పరుగులు పెట్టుకుంటూ ఆలయంలోకి వచ్చిపడ్డారు - ఎంత అద్భుతం!అప్పుడు మొదలైన వర్షం సుమారు 48 గంటలు కురిసింది.గోగర్భం నిండింది.ఇంతకీ వీళ్ళు ఎక్కడ వర్షం కురవాలని యజ్ఞం చేశారో అక్కడ తప్ప ఆ చుట్టుపక్కల ఒక్క చినుకు పడలేదు - ఎందుకంటారు?
ఇప్పుడు స్వామీజీలు ఎందుకు చెయ్యడం లేదు అనే ప్రశ్నకి జవాబు చెప్తాను.
Deleteభాగ్యనగర యజ్ఞానికి మినిమం కోటిన్నర నుంచి రెండు కోట్లు ఖర్చవుతుందని మొదట అంచనా వేశారు. సేఫ్ సైడ్ అవుతుందని చెప్పి అయిదు కోట్లు అనే మాట వచ్చింది.
ఇప్పుడు మనకి తెలుస్తున్న స్వామీజీల దగ్గిర అంత డబ్బు లేకనే చెయ్యడం లేదని నేను అనుకుంటున్నాను.మీడియా చేస్తున్న విష ప్రచారం వల్ల పెద్ద పెద్ద వ్యాపారస్తులూ పారిశ్రామికాధిపతులూ వాళ్ళకి ఎక్కువ మొత్తం చందాలు ఇచ్చి వాళ్ళతో కలిసి తిరగడానికి భయపడే పరిస్థితి ఉంది.
నిత్యానందని చూడండి - మొదట కేసు గురించి బయటపడినప్పుడు మొత్తం హిందూ గురువులూ సన్యాసులు అందరూ కామాంధులే అన్నంత గోల చేశారు.విచారణలో ఎప్పుడైతే ఆయన నిరపరాధి అనీ అది క్రైస్తవ ఎవాంజలిస్టుల కుట్ర అనీ బయటపడుతున్నదో ఇక గప్ చుప్ అయిపోయారు తప్పితే ఆయన మీద జరిగిన కుట్రని మాత్రం ప్రజలకి తెలియనివ్వలేదు - చిత్రం ఏమిటంటే, ఆ చానల్స్ యజమానులు హిందువులే!
ఏ స్వామీజీ మీద ఎప్పుడు స్కాండల్ వస్తుందో తెలియదు, పొరపాట్న తాము రాసుకు పూసుకు తిరిగే స్వామీజీ చుట్టూ స్కాండల్ వస్తే తమకీ చెడ్డపేరు వస్తుందనే భయం ఉన్నప్పుడు ఎంతమంది వాటికి ధనసహాయం చెయ్యడానికి ముందుకు వస్తారు?
అదీగాక వాళ్ళు వాళ్ళకొచ్చే ఆ తక్కువ నిధుల్ని ఇప్పటికే వాళ్ళ పరిధిలో చేసే పనులకి ఉపయోగిస్తూనే ఉన్నారు.
అందువల్లనే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మీద ఎక్కువ బరువు పెట్టని 50000X1000=05 Crores అనే ప్లాను వేశారు.
కేసీయార్ గారికి సెక్యులరిజం పిచ్చ లేదు గాబట్టి జియ్యర్ స్వామి గార్ని కదిలించి ఆయన్ని మెప్పిస్తే ప్రభుత్వపరమైన కార్యక్రమంలా చెయ్యొచ్చుననే ఆలోచన కూడా వుంది.
రకరకాల ఆలోచనలు వస్తున్నాయి.వలంటీర్ల నమోదు మొదలైంది.మొదలుపెట్టి నాలుగు రోజులే అయింది, కానీ చాలామంది ముందుకు వస్తున్నారు.కొందరు విధి విధానం చెప్తే చాలు, తమకు ఇచ్చిన చోట తమ సొంత ఖర్చుల్తో చేస్తామని కూడా అంటున్నారు.
ఆ ఉత్సాహం చూస్తుంటే యజ్ఞం మేము వూహించిన దానికన్న గొప్పగానే జరుగుతుందని అనిపిస్తుంది నాకు.వేదం అంటే ఏమిటో దాని శక్తి ఎంత గొప్పదో అందరికీ తెలుస్తుంది.
జై శ్రీ రాం!
జై శివశంకరా
Delete