చంద్రబాబు బలహీనతలే... ప్రత్యర్ధులకు బలాలు
దేశ ముఖ్యమంత్రులలో నెంబర్ వన్ ఎవరంటే... "శ్రీ నారా చంద్రబాబు నాయుడు" అనడంలో అతియోశక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న దార్శనికత అంత గొప్పది. ఏపని చేసినా భవిష్యత్ ఉపయోగార్ధం.. అభివృద్ధి వైపు పరుగులు దీసే విధంగా ఉంటాయి. ఆయనకున్న శత్రులు సైతం ఒప్పుకున్న విషయమిది.ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఎక్కడైనా చంద్రబాబు అభివృద్ధే కనిపిస్తుంది. సంపాదనను సృష్టించే పనులు చేయడం ఆయనకే సాధ్యమయింది. ఆయనకున్న మేధావితనం చూసినవాళ్లు అదే రాజకీయ రంగంలో ఉన్నందుకు ఈర్షా, అసూయలతో రగిలిపోయి ఉండటం సహజమే.. అయితే చంద్రబాబు గారి సున్నిత మనస్తత్వం, తన పని తప్ప విమర్శల జోలికి పోకపోవడం ఆయన ప్రత్యర్ధులకు వరంగా మారింది. అందుకే " నీయమ్మ మొగుడు.. నీవు చస్తే బాగుణ్ణు" లాంటి అతి నీచమైన మాటలు సైతం బడానాయకుల నుండి.. ఛోటా నాయకుల వరకూ అనగలుతున్నారు.
ఇది ప్రజలు గమనిస్తున్నారు కదా? వాళ్లే బుద్ధి చెప్తారు అని చంద్రబాబు భావించి వదిలేస్తాడని కొంతమంది ఆయన సన్నిహితులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రజలు అలా లేరు. ప్రవిత్రమైన అసెంబ్లీలోనే బూతులు మాట్లాడుతూ చొక్కా గుండీలు సైతం విప్పేసి రౌడీల్లా ప్రవర్తించే వాళ్లనే ప్రజలు హీరోలుగా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు సైతం పెద్దగా చదువు సంధ్యలు లేని వాళ్లను తమను బాగుచేయమని ఓటు వేసి ఎన్నుకోవడమే మన దేశ దౌర్భాగ్యం.
ఏమాత్రం అర్హత లేనివాళ్లు చట్టాలను తయారు చేస్తారు. చదువుకున్న వాళ్లు చట్టాలను అనుసరిస్తారు.
ఎంత విద్యార్హత ఉన్నా చంద్రబాబులోని కొన్ని పొరపాట్లే ఆయనను మాటి,మాటికి క్రింద పడేస్తూ వస్తున్నాయి. ఉన్నతంగా గౌరవాలు పొందాల్చిన చంద్రబాబు... ఆయన స్థానంలో మహానుభావులుగా మరొకరు కీర్తించబడుతున్నారు.
సంపదలను సృష్టించి, ఖజానాను నిండబెట్టి ఇస్తే వేరొకరు అభివృద్ధికి ఉపయోగించకుండా జనాలకు పంచి పెట్టి మహానుభావుడయ్యాడు. ఇంతా అభివృద్ధి చేసిన చంద్రబాబు జీరో అయ్యాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పసుపు-కుంకుమ పధకం క్రింద ఒక టర్మ్ ఇచ్చి మరో రెండు టర్ముల సొమ్ము ఇవ్వడానికి బ్యాంక్ లో పెట్టాడు. పాపం అగ్రిగోల్డు బాధితుల సొమ్ము కూడా వారికి ఇవ్వడం కోసం బ్యాంక్ లో పెట్టాడు. అలాగే లబ్ది దారుల కోసం పక్కా గృహాలు... ఇలా ఒకటేమిటి అనేకం రెడీ చేసి మరొకరి చేతికి ఇవ్వాల్సి వచ్చింది. ఇంత దార్శనికత ఉన్న నాయకుడు సైతం చేస్తున్న ఘోరమైన తప్పిదాలు. ఇవే చంద్రబాబు బలహీనతలు. పని ఒకరిది.. కూలి మరొకడిది అన్న చందాన ఉంది చంద్రబాబు పరిస్థితి.
చేసిన అభివృద్ధికి ఎప్పటికప్పుడే ఫలితం అనుభవిస్తే చంద్రబాబుకు ఎదురు లేకపోవును... కానీ చంద్రబాబు ఈ బలహీనతల నుండి బయట పడలేకపోతున్నాడు. నిజం చెప్పాలంటే తెలంగాణలోని కేసీయార్ కు, ఆంధ్రాలోని జగన్ మోహన్ రెడ్డిగారికి గత నాయకుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి మీద వచ్చే వనరులను ఖర్చు పెట్టడం, పంచి పెట్టడం తప్ప అభివృద్ధి చేసేంత మేధావితనం లేదు. ఈ విషయాన్ని దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థే బయటపడుతుంది.
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.