Tuesday, July 21, 2020

Latest Telugu news : వల్లభనేని వంశీ పని ఇక అయిపోయినట్లేనా?

Latest Telugu news : వల్లభనేని వంశీ పని ఇక అయిపోయినట్లేనా? 

Latest-Telugu-news-One-More-Jolt-To-Mla-Vallabhaneni-Vamsi
వల్లభనేని వంశీ పని ఇక అయిపోయినట్లేనా? 
ఆదరించిన నాయకుడిని అభిమానించటం మాని అణగదొక్కాలని చూసేవారికి వల్లభనేని వంశీ ఉదాంతం ఒక ఉదాహరణ. టిడిపిని వదిలేసిన కనీసం ఆదరించిన నాయకుడైన చంద్రబాబు పట్ల గౌరవంతో ఉన్నా సరిపోయేది కానీ... వైసిపి మన్ననలు పొందటం కోసం జగన్ ను ఆకాశానికి ఎత్తుతూ చంద్రబాబు పట్ల అనేక దుర్భాషాలాడుతూ విర్రవీగాడు. గన్నవరంలో తనేదో వైసీపీ తరుపున చక్రం తిప్పుదామని కలలు కన్నాడు. కానీ అంతలోనే అతని కలలన్నీ పటాపంచలు చేస్తూ... గన్నవరంలో ఒకప్పుడు వెలుగువెలిగి రాజకీయంగా తెరమరుగైన వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం రంగప్రవేశం చేసింది. వల్లభనేని వంశీకి ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న విషయం వైసీపీలో చేరాకే అర్థమవుతోందని గన్నవరంలో అతని అనుచరులు సైతం గుసగుసలు ఆడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబును ఎదురించి వైసీపీ అధినేత జగన్ ను జైకొట్టిన వంశీకి లైన్ క్లియర్ చేసింది వైసీపీ అధిష్టానం అని అందరూ అనుకున్నారు.. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిన వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టి వంశీకి ఇక పోటీ లేదు అన్న భావన కలిగించింది. దీంతో గన్నవరంలో యార్లగడ్ద జెండా పీకేశారు.

ఇదే ఆనందంలో ఉన్న వల్లభనేని వంశీకి ఇప్పుడు ఆ సంతోషం మాయమయ్యిపోయింది.  వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దుట్టా అల్లుడు వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి హైదరాబాద్ నుంచి డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి గన్నవరంకు వచ్చేశారు. వైసీపీ గెలవడంతో పూర్తి స్థాయి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ఇప్పుడు వల్లభనేని వంశీకి రాజకీయ భవిష్యత్ కు బీటలు పడటం ప్రారంభమయ్యింది. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి సీఎం జగన్ కు స్వయానా బంధువు కావడంతో.. అదీ కాకుండా రెడ్డి సామాజిక వర్గం ఒకటి కావడంతో దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డికి గన్నవరంలో ఎదురు లేకుండా పోయింది. దీంతో తాజాగా వంశీ వర్సెస్ శివభరత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్ జయంతి సందర్భంగా ఇద్దరూ వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించి ఘర్షణలు చేసుకున్నారు.. రెండు వర్గాలు బాహాబాహీకి గన్నవరంలో దిగడంతో ఉద్రిక్తంగా మారింది.



Latest Telugu news : Devineni Uma Comments on AP Govt in Irrigation & Agriculture | జగన్ ప్రభుత్వం అన్ని విధాల ఘోరంగా విఫలమయ్యింది, ప్రజలు భారీగా నష్టపోతున్నారు

Breaking Telugu News : TDP MLC Buddha Venkanna Press Meet - Buddha Venkanna Fires On CM YS Jagan - కరోనాతో పాటు YS జగన్ కూడా ప్రజలను పీడించుకు తింటున్నాడు

ఈ క్రమంలో ఈ విభేదాలపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితో దుట్టా వర్గం భేటి అయ్యింది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే తమకే టికెట్ ఇవ్వాలంటూ షరత్ విధించినట్లు సమాచారం. వంశీకి టికెట్ ఇస్తే సహకరించమని.. ఓడిస్తామని తేల్చిచెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ వార్తలను మాత్రం దుట్టా వర్గం ఖండిస్తోంది.అభివృద్ధి పనుల కోసమే మంత్రి పెద్దిరెడ్డిని కలిసినట్లు చెబుతున్నారు. కానీ వంశీకి పోటీగా దుట్టా వర్గం గట్టిగా గన్నవరంలో హీట్ పెంచుతోంది. వచ్చే ఉప ఎన్నికల్లో వంశీకి అంత ఈజీగా నియోజకవర్గంలో పరిస్థితులు ఉండేలా కనిపించడం లేదని నియోజకవర్గంలో చర్చ కూడా జరుగుతోంది. అదీ కాకుండా జంపింగ్ క్యాండిట్లను క్రమ,క్రమంగా వదిలించుకుని సొంత నాయకులను నిలబెట్టే యోచనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇక వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్ అయిపోయినట్లే!!

* ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకోవాలంటే మా "Youtube ఛానెల్" ను Subscribe చేయండి.

No comments:

Post a Comment

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.