Tuesday, April 20, 2021

షర్మిల CM అయితే... తెలంగాణాకు ఆంధ్రా గతే పడుతుందా?

 షర్మిల CM అయితే... తెలంగాణాకు ఆంధ్రా గతే పడుతుందా?

ప్రొఫెసర్ నాగేశ్వరరావుగారి మహాన్యూస్ ఇంటర్వూలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. 

జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడానికి వెనుకున్నది జగన్,బిజెపి పార్టీలే అన్నఅభిప్రాయం నాకు నిజమే అనిపించింది... ఎందుకంటే ఇప్పుడున్న కేసీయార్ పార్టీ తెరాస ను ఓడించడం ఎవరితరం కాదు. కాంగ్రెస్ గాని, బిజెపిగాని, ఇతర పార్టీలుగాని ఏవీ ఎంత ప్రయత్నం చేసినా అడ్డుకోలేవు. మహా అయితే TRSకు కొద్దిగా ఓటింగ్ శాతాన్ని తగ్గించగలరేమో అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేవు. ఎందుకంటే బిజెపి ఆంధ్రా పట్ల, దేశం పట్ల వ్యవరిస్తున్న ప్రైవేటీకరణ సిద్ధాంతాన్ని చూసి తెలంగాణా ప్రజలు అసలు నమ్మరు. ఇకపోతే కాంగ్రెస్ కు పూర్తిగా గ్రూపు కుమ్ములాటతో బలహీనపడిపోయింది.

ఇటువంటి పరిస్థుతులు ఉన్నప్పుడు కొత్తపార్టీ ఉనికిలోకి తీసుకొస్తే TRS ను గద్దె దించడం సులువు అవుతుంది. ఎందుకంటే TRS ఓటింగ్ ను కొత్తపార్టీ మాత్రమే భారీగా కొల్లగోట్టగలదు.

ఈవిషయం దృష్టిలో పెట్టుకుని షర్మిలను రంగంలోకి దించారు. నా అభిప్రాయం ప్రకారం ఇది ఎప్పటినుండో ప్లానింగ్ లో ఉంది. ఈవిషయం కెసియార్ కి గ్రహించకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డిగారు కెసియార్ తో మిత్రబంధం పెట్టుకున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆంధ్రాలో బిజెపికి మిత్రపక్షమైన వైసిపి, తెలంగాణాలో TRS కు ఎలా మిత్ర పార్టీ అవుతుంది.? అక్కడ తెరాస బిజెపికి వ్యతిరేక పార్టీ కదా?

కెసియార్ ఆంధ్రా పట్ల గుంటనక్క వేషాలు వేసి సర్వనాశనం అవడానికి కుట్రలు పన్నేవాడు. కాని ఆంధ్రా తరువాత బిజెపి చేతికి చిక్కే జింక పిల్ల తెలంగాణ అన్న విషయం గ్రహించలేకపోయాడు.

నాలుగు దారులు మూసి చంద్రబాబును పడగొట్టి వైసిపిని అధికారంలోకి తీసుకురావడానికి కారణం బిజెపికి జగన్ అంటే ప్రేమ కాదు. ప్రయోజనం. చంద్రబాబు అయితే బిజెపి ఆటలు ఆంధ్రాలో సాగవు. నెత్తి మీద కేసులున్న జగన్ అయితేనే చెప్పుచేతల్లో పెట్టుకోవచ్చు.

జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి ప్రత్యేక హోదా ఎగరగొట్టింది. పోలవరాన్ని ముంచేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టగలిగింది. విజయవాడ రైల్వే జంక్షన్ ను హోల్ సేల్ పెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతోంది. ఇలా ఒకటేమిటి అనేకం... కాబోతున్నాయి. ఇది ఆంధ్రాది అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేసేయడం ఖాయం.

తరువాత వంతు తెలంగాణాదే... బిజెపి ముక్కుపుటాలకు హైదారాబాద్, సింగరేణి రుచులు బాగా తాకుతున్నాయి. ఆరగించాలంటే వడ్డించేవారు కావాలి. దానికి బిజెపి ఎన్నుకున్న వ్యక్తే షర్మిల. 

బిజెపికి భయపడే జగన్ షర్మిలలు నడుచుకుంటున్నారు. ఎందుకంటే దోచుకున్న ఆస్తికి మీ ఇద్దరు వారసులుగా ఉన్నారు కదా అని బిజెపి అన్నా,చెల్లెళ్ళను మూసేయడం పెద్ద విషయం కాదు. 

ఇదంతా బిజెపి ఎందుకు చేస్తుందంటే ఈ తెలుగు రాష్ట్రాలు రెండూ తమ చేతుల్లోనే ఉండాలి. తమ దగ్గరే బ్రతకాలి. స్వయంగా బ్రతికే చాన్స్ వీటికి ఉండకూడదు. అలా జరగాలంటే తెలుగు రాష్ట్రాలకు ఆర్ధిక మూలాలు ఉండకూడదు. ఇది జరగడానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బిజెపికి సహకరించడానికి దానికంటే మహా ముదురులకు కొదువే లేదు.

2 comments:

  1. ఆంధ్రావాళ్ళకు ఆలోచనాశక్తి లేదు. తెలంగాణావాళ్ళకు కూడా ఉండకూడదా ? తెలంగాణాలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు, ముఖ్యమంత్రిని చేస్తారా ? ఇంత చెత్త ఆర్టికల్ ఎపుడూ చదవలేదు.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.