AP Telugu Political News |
AP Telugu Political News: ఆంధ్రాలో రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. ఇక్కడ ప్రజల అభిప్రాయాలకు, స్వేచ్చకు ఏమాత్రం విలువ లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉంచి అక్కడ నుండి రాష్ట్రం అంతా అభివృద్ధి చేయవచ్చు. అంతేగాని మూడు రాజధానులు కడతాం. ముప్పై రాజధానులు కడతాం.. ఇలాగే అభివృద్ధి సాధ్యం అనేది ఏవిధమైన వాదనో ఎవరికీ అర్ధం కావడం లేదు.
మూడు రాజధానుల సిద్ధాంతం భవిష్యత్ లో మూడు రాష్ట్రాలుగా విడిపోవడానికి ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక ఆంధ్రా పరిస్థితి అగమ్య గోచరంలానే తోస్తుంది. ఆంధ్రాను ఏకంగా ఉంచే ఆలోచన నేటి ప్రభుత్వానికి ఉన్నట్లు అనిపించడం లేదు. హీరో శివాజీ అన్నట్లుగా రాబోయే రోజుల్లో ప్రతి ఆంధ్రుడు ఇతర రాష్ట్రాలకు పోయి బ్రతికే పరిస్థితి వస్తుంది.
రాజస్తాన్ నుండి, పంజాబ్ నుండి అనేక మంది ప్రజలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు వలస వచ్చి చిన్న,చిన్న వ్యాపారాల నుండి, పెద్ద,పెద్ద వ్యాపారాల వరకూ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం ఏయే రాష్ట్రాలకు పోయి బ్రతకాలో అర్ధం కాని పరిస్థితి. వాళ్లు కష్టపడి బ్రతికినట్టుగా మన వాళ్ళు బ్రతకలేరు. ఇందంతా ఎందుకు దాపురిస్తుందంటే అభివృద్ధి చేసే వాడు మనకు నచ్చడు. ఉచితంగా పంచి పెట్టేవాడే నచ్చుతాడు. ఇలా పంచి పెట్టాలంటే మనల్నే కొట్టి మనకే పంచాలి. ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా? పరిస్థితి ఇలాగే కొనసాగితే ధనికుడు మధ్యతరగతి స్థితిలోకి, మధ్య తరగతి వాడు దారిద్ర్య స్థితిలోకి జారిపోతాడు. పైకి ఎదగాల్చినవాడు క్రిందికి దిగజారిపోతాడు. ఇదే జరిగే రాష్ట్ర భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ప్రజలలో విజ్ఞత పెరగాలి. ఆలోచనా విధానం మారాలి.
YCP అధికారంలోకి వచ్చి మూడేళ్ళు దాటిపోతుంది. ఇంకా ఎప్పుడు రాజధాని పనులు? మూడు రాజధానుల నినాదంతో ప్రజలను గందరగోళానికి గురి చేసి కాలయాపన చేయడం తప్ప మూడు రాజదానులూ లేవు.. ముప్పై రాజదానులూ లేవు. ఇప్పటివరకూ ఒక్క రోడ్డూ వేయని ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా? నమ్మశక్యంగా ఉందా?
జీతాలకోసం, పెంచన్, ఫించన్ల కోసం, నవరత్నాల అమలు కోసం ప్రతి నెలా అప్పుల కోసం వెతికే ప్రభుత్వానికి ఒక్క రాజధాని నిర్మాణమే కష్టం.. అటువంటిది మూడు రాజధానులు సాధ్యమా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. జైహింద్!!!
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.