Amaravati capital of Andhra Pradesh: ఆంధ్రా హైకోర్ట్ "అమరావతి"నే ఆంధ్రా రాజధానిగా ప్రకటించింది. ఈ తీర్పుతో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే మూడు రాజధానులు, ముప్పై రాజధానులంటూ ఇప్పటి వరకూ దోబూచులాటలాడిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లయింది. ఒక్క రాజధానికే దిక్కు లేని రాష్ట్రానికి మూడు రాజధానులా? అంటూ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క రోడ్డూ వేయలేదు. ఒక్క గుడిసె కట్టలేదు. అటువంటిది మూడు రాజధానుల ఏర్పాటా అంటూ ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మించిన భవంతుల్లో ఉండి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏం సాధించగలిగాడని ప్రతిపక్షాలు, ప్రజలు అడగటం ప్రారభించారు.
అన్ని వ్యవస్థలను ధ్వంచం చేస్తున్న జగన్ కి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని ప్రజలలో చలనం ప్రారంభమయింది. మరో ప్రక్క ప్రభుత్వ ఉద్యోగులు కూడా దూరమయిపోయారు. ప్రతి కార్పోరేషన్ లో ఉన్న నిధులన్నీ మాయమయిపోయాయి. దీంతో ప్రతి సంఘము జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమయిపోయింది.
మొత్తానికి అమరావతినే ఆంధ్రా రాజధానిగా హైకోర్ట్ ప్రకటించటం ఆనందించదిగ్గ విషయం. "అమరావతి" రాజధాని కోసం కృషి చేసిన ప్రతి ఆంధ్రుడుకి ఇది అంకితం.
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.