If journalism is sold for money, is it not the beginning of the downfall of the country? | జర్నలిజం డబ్బులకు అమ్ముడైపోతే దేశ పతనానికి నాంది కాదా?
నేటి జర్నలిజం గురించి, అత్యధిక మేధావుల మీడియా సమావేశాల గురించి మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ చివరికి ప్రజల చెవుల్లో దుష్ ప్రచారం మ్రోగిస్తూ దేశాన్ని ఆయా రాష్ట్రాలను సర్వనాశనం చేస్తున్నారు.మీడియా ఎప్పుడూ ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి. అధికార పక్షానికి లోబడితే ప్రజల తరుపున బలంగా నిలబడేది ఎవరు?
మేధావుల ముసుగులో ఉన్న వారు మరీ దారుణం. వీళ్ళు ప్రజలకు ఏదో ఉద్దరిస్తున్నామన్న బిల్డప్ ఇస్తూ తెగ సమావేశాలు పెడతారు. కానీ వీళ్ళ మనస్సుల్లో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, స్వార్ధాలు చాలా భయంకరమైనవి. వీళ్ళు ప్రజలను ఏమార్చే తీరు అత్యంత దారుణమైనది. వీళ్ళు ఏపార్టీ అయినా లోకువుగా కనిపిస్తే ఎటువంటి అభాండాలు వేయడానికైనా వెనుకాడరు.