వీళ్లను డమ్మీలుగా చేసి వదిలేసిన జగన్!: జగన్ రాజకీయ స్టాటజీ గురించి ఆలోచించిన వారెవరికైనా సరే అర్ధమయిపోతుంది అదెంత ప్రమాదకరమైనదో!
ఎవరినైతే టార్గెట్ పెట్టాడో వాళ్ళకు ఇక రాజకీయ భవిష్యత్ లేకుండా చేసి పడేస్తాడు... వాళ్ళు ఇక ప్రజా జీవితంలో గౌరవంగా తిరిగే అవకాశం లేకుండా చేసేస్తాడు.
జగన్ దెబ్బకు బలయినవాళ్ళు ఒక్కసారి బుద్ధి పెట్టి ఆలోచించుకుంటే తమరు ఎటువంటి నాశనంలో ఉన్నారో వాళ్లకు తెలుస్తుంది. నిజమైన శత్రువు చంద్రబాబా? లేక జగన్మోహన్ రెడ్డినా? అని!
ఉదాహరణకు గన్నవరం MLA వల్లభనేని వంశీ గాని, గుడివాడ MLA కొడాలి నానిని గమనించండి
నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ TDP లో తిరిగిలేని లీడర్లుగా చలామణీ అయ్యేవారు... ఓటమి లేని నాయకులుగా తిరిగారు
కాని వీళ్ళను YCPలోకి లాగి భవిష్యత్ లేకుండా చేసి పడేసారు.
జగన్ రాజకీయ స్టాటజీ గమనిస్తే...
వీళ్లు YCP లో తమ పని తాము చేసుకుపోతే జగన్ ఉపయోగం లేదు
వీళ్ళు పూర్తిగా TDPకి, TDP అభిమానులకు దూరం చేసేయాలి
వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పూర్తిగా పూర్తి వ్యతిరేకం చేసేయాలి... తద్ద్వారా వీళ్ళు మళ్ళి TDP చెంతకు చేరే అవకాశం లేకుండా చేసి పడేసాడు.. నిజం చెప్పాలంటే వాళ్ళు తమతమ నియోజకవర్గంలోనే ఉండలేని స్థితికి తీసుకొచ్చేసాడు
తరువాత వీళ్ళ స్థానంలో YCP రెడ్డి నాయకులను తీసుకొచ్చే ప్రయత్నమే ఇదంతా! 2029లో ఈ ప్రణాళిక వేయడానికి రెడీ చేసి పెట్టారు. ఈవిధంగా ఆ రెండు నియోజక వర్గాలను TDPకి దూరం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసారు
ఇక గన్నవరం MLA వల్లభనేని వంశీ గాని, గుడివాడ MLA కొడాలి నాని విషయానికొస్తే...
వీళ్ళిద్దరూ జగన్ యొక్క మాయ ప్రేమలో పడి... తమకు రాజకీయ భవిష్యత్ ప్రసాదించిన లెజెండరీ లీడర్ చంద్రబాబు పట్ల విపరీత, అసభ్యకరమైన రీతిలో రెచ్చిపోయారు
ఒక సియం కూతురు, ఒక సియంకి భార్య అయిన భువనేశ్వరికి సైతం రంకుతనాన్ని అంటగట్టారు... అదీ నిండు అసెంబ్లీలో... ఇదంతా చూస్తూ పగలబడి నవ్వుతూ జగన్... ఆంధ్రా ప్రజలు ఒక్కసారే ఉలిక్కిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ సహించలేకపోయారు.
ఎన్ని అవమానాలు జరిగినా... ఎంతమంది ఎగతాళి చేసి మాట్లాడినా ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయే ఒక డైనమిక్ లీడర్ అయిన చంద్రబాబే తన భార్యను, తన కుమారుడిని ని౦డు అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడిన అసభ్యకరమైన తీరుకు తట్టుకోలేక పోయారు.. గుండె పగిలి ఏడ్వడం చేసారంటే YCP వాళ్ళ ప్రవర్తన ఎటువంటి భయంకర స్థితిలో ఉందో ఆలోచిస్తేనే మన వళ్ళు జలదరిస్తోంది
జగన్ యొక్క ఈ స్ట్రాటజీకి పూర్తిగా బలయిపోయింది వంశీ, నానీలే!... వీళ్ళకి ఇక రాజకీయ భవిష్యత్... వ్యక్తిత్వం రెండూ సర్వనాశనమయ్యిపోయాయి
No comments:
Post a Comment
అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.