ఈమధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఊహలకు అందనంతగా మలుపులు తిరుగుతున్నాయి. ఆంధ్రాలో తిరుగులేని పార్టీగా ఉంటుందనుకున్న తెలుగుదేశం పార్టీ బిజెపి కుట్రలకు ఘోరంగా బలయిపోయింది. కేంద్ర సహకారంతో YSRCP రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. మళ్ళీ ఆంధ్రరాష్ట్రంలో TDP నే వస్తుందనుకున్న ప్రజలకు YSRCPకి అంత మెజారిటీ ఎలా వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. జనసేన అయితే 99.99% తుడుచుపెట్టుకు పోయింది. అత్యంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఎలక్షన్ నిర్వహణలో ఏదో గోల్ మాల్ జరిగిందన్న అనుమానాలు అందరికీ కలుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ఇంత పెద్ద భారీ మోసం బయటపడక తప్పదు. ఎందుకంటే కేవలం 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమయ్యే చెత్త పరిపాలన టిడిపి కలిగిలేదు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు బాగానే చేసుకు వచ్చాడు. ఒకవేళ టిడిపి అధికారం కోల్పోవాల్సివచ్చినా ఇంత దారుణమైన ఓటమి మాత్రం రాదు. EVM లలో ఏదో జరిగే ఉంటుంది.
అసలు తెర వెనుక ఏదో జరుగుతోంది.
బిజెపి తెలుగు రాష్ట్రాలను కబళించాలని చూస్తోంది. తన పూర్తి పట్టు సాధించాలని ప్రయత్నం ముమ్మరం చేస్తోంది. ముందుగా ఆంధ్రాలో బలమైన పార్టీ గా ఉన్న టిడిపిని కకావికలం చేసేసింది. ఇప్పటికే నలుగురు MP అభ్యర్ధులు బిజెపికి సరెండ్ అయిపోయారు. మిగతా వాళ్ళపై వేట ప్రారంభమవుతుంది. నేటి రాజకీయ నాయకుల్లో విలువల కంటే స్వార్ధాలు ఎక్కువ కాబట్టి ఓడిన పార్టీలోని ఒక్కొక్కడూ అధికార పార్టీలోకి జంప్ అవుతూనే ఉంటారు. ఈవిధంగా బిజెపి కావాల్సిన ముఖ్యమైన అభ్యర్దులనందరినీ తనలోకి లాగేసుకున్నాక తదుపరి టార్గెట్ అధికార పార్టీనే. జగన్ ఎలాగూ కేసుల మధ్య తిరుగుతున్నాడు కాబట్టి అతనిని లొంగదీసుకోవడం లేక జగన్ పార్టీని తనలోకి విలీనం చేసుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఇకపోతే తెలంగాణ విషయం...
ఒకవిధంగా చూస్తే తెలంగాణాలో KCR తిరుగులేని నాయకుడు. బిజెపి TRSను ఎదురుకోవడం పెద్ద కష్టతరమే. చంద్రబాబులాగ కేసీయార్ కూడా కొరుకుడు పడని కేండిట్టే. అయితే క్రమేపీ తెలంగాణలో కూడా బిజెపి కొంచెం,కొంచెం పుంజుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ కూడా బలమైన స్థితిలోనే ఉంది. ఇటువంటి స్థితిలో తెలంగాణాను హస్తగతం చేసుకోవడం బిజెపికి చాలా కష్టతరమనే చెప్పాలి.
అసలు విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు ఉన్న బలం జాతీయ పార్టీలకు ఉండదు. ప్రజలు ప్రాంతీయ పార్టీల వారికే ఎక్కువ మక్కువ చూపిస్తారు. తెలంగాణలో బిజెపికి కొద్ది ఓటింగ్ ఉన్నా కొన్ని సీట్లు సంపాదించగలిగినా, ఆంధ్రాలో మటుకు బిజెపికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థులలో తెలుగు రాష్ట్రాలను బిజెపి హస్తగతం చేసుకోవడం అసాధ్యమనే చెప్పాలి. చివరికి ఏపార్టీ అయినా ప్రజల అభిమానం ఉన్నంతవరకే భవిష్యత్ ను కలిగియుంటాయన్నది జగమెరిగిన సత్యం.
దీనిపై నా బ్లాగు వీక్షకులను స్పందనను అడుగుతున్నాను.